Jump to content

హసన్ అహ్మద్

వికీపీడియా నుండి
హసన్ అహ్మద్

పదవీ కాలం
2008 – 2015
ముందు యోగేంద్ర కుమార్ శర్మ
తరువాత జగదీష్ ప్రధాన్
నియోజకవర్గం ముస్తఫాబాద్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం ఢిల్లీ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

హసన్ అహ్మద్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు ముస్తఫాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

హసన్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1993 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓఖ్లా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి పర్వేజ్ హష్మి చేతిలో 1,307 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1] ఆయన 2003 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కరవాల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్త్ చేతిలో 15,227 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

హసన్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ముస్తఫాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యోగేంద్ర కుమార్ శర్మపై 38,859 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్ పై 1,896 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

హసన్ అహ్మద్ 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ముస్తఫాబాద్ శాసనసభ నియోజకవర్గం ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్ చేతిలో 6,031 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Election Result". Archived from the original on 17 April 2018.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  2. "Election Result". Archived from the original on 17 April 2018.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  3. "Election Result". Archived from the original on 17 April 2018.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  4. "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  5. "Mustafabad Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 23 February 2025. Retrieved 23 February 2025.
  6. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.