హర్షవర్ధన్ బహుగుణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జననం1939
మరణం1971 ఏప్రిల్ 18(1971-04-18) (వయసు 31–32)
మౌంట్ ఎవరెస్ట్
మరణ కారణంప్రమాదం
జాతీయతభారతీయుడు
వృత్తిపర్వతారోహకుడు

మేజర్ హర్ష్ వర్ధన్ బహుగుణ (1939-1971 ఏప్రిల్ 18) భారతదేశంలోని ప్రముఖ పర్వతారోహకుడు, సైనిక అధికారి. అతను గుల్మార్గ్ హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ స్కీయింగ్, పర్వతారోహణ బోధకుడిగా పనిచేసి, అనేక పర్వతాలను విజయవంతంగా అధిరోహించాడు.[1]

మరణం

[మార్చు]

1971 ఏప్రిల్ 18న ఎవరెస్ట్ పర్వతం మీద అంతర్జాతీయ యాత్రలో భాగంగా అతను మరణించాడు. ఇది అతని రెండవ ప్రయత్నం. అతను 1965లో శిఖరాగ్రానికి కేవలం 400 అడుగుల దూరంలో తన మొదటి యాత్రను రద్దు చేయాల్సి వచ్చింది. పద్నాలుగు సంవత్సరాల తరువాత, అక్టోబర్ 1985లో అతని తమ్ముడు మేజర్ జైవర్ధన్ బహుగుణ కూడా మరో నలుగురు సైనిక అధికారులతో పాటు భారత సైన్యం ఎవరెస్ట్ పర్వతం మీద జరిపిన సాహసయాత్రలో ప్రాణాలు కోల్పోయారు. సోదరులు ఎవరూ ఎవరెస్ట్ పర్వతం పైకి ఎక్కలేదు. వారి రెండవ ప్రయత్నంలో ఇద్దరూ ఒకే ప్రాంతానికి సమీపంలో మరణించారు.[2][3]

పురస్కారాలు

[మార్చు]

1972లో భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతరం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.[4]

మూలాలు

[మార్చు]
  1. The Himalayan Journal. Oxford University Press. 1971. p. 325.
  2. "Dehra Dun and Mt Everest; Some Sad Memories". Hill Post. March 9, 2013. Archived from the original on 18 March 2014. Retrieved 2014-03-18.
  3. "Not eyeing records, says youngest Everest challenger". The Hindu. March 26, 2010. Archived from the original on 18 March 2014. Retrieved 2014-03-18.
  4. "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 18 March 2014.