Jump to content

హర్నాజ్ కౌర్ సంధూ

వికీపీడియా నుండి
హర్నాజ్ సంధూ
అందాల పోటీల విజేత
Sandhu's arrival at Mumbai Airport, India as Miss Universe 2021
జననముHarnaaz Kaur Sandhu
(2000-03-03) 2000 మార్చి 3 (వయసు 24)
Gurdaspur, Punjab, India
వృత్తి
  • Actress
  • model
ఎత్తు1.76 m
జుత్తు రంగుBlack
కళ్ళ రంగుBrown
బిరుదు (లు)Femina Miss India Punjab 2019
Miss Diva Universe 2021
Miss Universe 2021
ప్రధానమైన
పోటీ (లు)
Femina Miss India 2019
(Top 12)
Miss Diva Universe 2021
(Winner)
Miss Universe 2021
(Winner)

ప్రపంచ అందాల పోటీ‌లో భారతీయ యువతి విశ్వ సుందరిగా ఎంపికై కీర్తీ పతాకాన్ని ఎగురువేసింది. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ విశ్వసుందరి పోటీలలో 21 సంత్సరాల హర్నాజ్ కౌర్ సంధూ విజేతగా నిలిచి , భారత్ తరుఫున విశ్వసుందరిగా నిలిచిన మూడో యువతిగా పేరు పొందింది.[1]

వ్యక్తిగత జీవితం  

[మార్చు]

హర్నాజ్​ సంధూ 2000 సంవత్సరంలో చండీగఢ్​లో జన్మించింది. అమె పూర్తి పేరు హర్నాజ్ కౌర్ సంధూ. హర్నాజ్​ సంధూ తల్లి అమృత​ కౌర్​ సంధూ, తండ్రి గురుచరణ్​ సింగ్​ సంధూ.[2]

17 ఏళ్ల వయసులో మోడలింగ్​ కెరీర్​ ప్రారంభించింది. అదే ఏడాది మిస్ చంఢీగడ్ టైటిల్​ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2018లో మిస్​ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా-2018 టైటిల్​ను అందుకుంది. 2019లో మిస్​ ఇండియా పంజాబ్​ టైటిల్​ను సొంతం చేసుకుంది. ఈ ఏడాదే బాలీవుడ్ నటి కృతి సనన్​ చేతుల మీదుగా మిస్​ దివా యూనివర్స్ ఇండియా కిరిటాన్ని ధరించింది.[3]

80 మంది అందాల భామలతో పోటీ

[మార్చు]

ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో మొత్తం 80 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఆ పోటీల్లో మొదట టాప్ 16లో చోటు సంపాదించింది. అనంతరం టాప్ 5, టాప్ 3 జాబితాలో కూడా  చోటు సంపాదించింది. టాప్ 3లో హర్నాజ్ సంధూతో పాటు  పర్వాగే సుందరి నాడియా ఫెర్రెరా, దక్షిణాఫ్రికా యువతి లలీలా స్వానేలు వరుసగా తరువాతి స్థానాల్లో  నిలిచారు.[4]

ఆత్మ విశ్వసమే మొదటి విజయం

[మార్చు]

మిస్ యూనివర్స్ 2021 ఫైనల్ పోటీకి ముందు యువతపై అతిపెద్ద ఒత్తిడి ఏమిటి అని న్యాయనిర్ణేత అడిగిన ప్రశ్నకు సమాధానంగా  యువత వారిలోని మనోధైర్యాన్ని నమ్మడానికి ఇబ్బందులు పడటం అతిపెద్ద ఒత్తిడి. మీరు విభిన్నమైన వ్యక్తి అని. అదే మీకు అందమైన జీవితాన్ని ప్రసాదిస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎదుటివారితో మీరు పోల్చుకోవడం ఆపితే, ప్రపంచంలోని అనేక విషయాలపై నిర్మోహమాటంగా అభిప్రాయలు చెప్పవచ్చు. మీలోని భావావేశాన్ని బయటపెట్టండి. అదే మీకు శ్రీరామరక్షగా నిలిచి మిమ్మల్ని లీడర్‌గా మారుస్తుంది. మీ సొంత అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పండి. నేను నన్ను నమ్ముకొన్నాను కాబట్టే.. ఈ రోజు ఇలాంటి విజయంతో మీ ముందు నిలుచున్నాను అంటూ హర్నాజ్ సంధూ చెప్పారు.[5]

మిస్ యూనివర్స్ 2020 చేతుల మీదుగా

[మార్చు]

హర్నాజ్‌కు మాజీ విశ్వసుందరి, మెక్సికోకు చెందిన ఆండ్రియా మేజా కిరీటం తొడిగింది. దాంతో హర్నాజ్ కౌర్ సంధూ విశ్వ సుందరిగా నిలిచింది.

సుస్మిత సేన్, లారా దత్తా తర్వాత

[మార్చు]

విశ్వ సుందరి 2021 గా ఎంపికైన హర్నాజ్ కౌర్ సంధూ ఈ ఘనతను సాధించిన తొలి సిక్కు యువతిగా రికార్డును సాధించింది. అలాగే సుస్మితా సేన్, లారా దత్తా తర్వాత మూడో భారతీయ సుందరిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. లారా దత్తా 2000 సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపిక కాగా, సుస్మిత సేన్ 1994లో మిస్ యూనివర్స్‌గా నిలిచింది.[6]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

ఫిల్మ్స్

[మార్చు]
Year Title Role Language Ref.
2021 యారా దియాన్ పూన్ బరన్ Unknown పంజాబీ [7]
2022 బాయి జీ కుట్టాంగే † TBA [8]

టెలివిజన్

[మార్చు]
Year Title Role Notes Ref.
2019 మిస్ ఇండియా 2019 Herself/Contestant [9]
2021 ఉదారియన్ Beauty pageant contestant Cameo role [10]
మిస్ దివా యూనివర్స్ 2021 Herself/Contestant/Winner [11]
Good Morning America Herself Guest appearance
మిస్ యూనివర్స్ 2021 Herself/Contestant/Winner International pageant [12]

మ్యూజిక్ వీడియోస్

[మార్చు]
Year Title Singer(s) Label Ref.
2019 Tarhthalli The Landers Sony Music India [13]

మూలాలు

[మార్చు]
  1. "harnaaz-kaur-sandhu".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  2. "View source for Harnaaz Sandhu - Wikipedia". en.wikipedia.org (in ఇంగ్లీష్). Retrieved 2022-01-20.
  3. "-harnaaz-kaur-sandhu-miss-universe-2021-".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  4. "harnaaz-sandhu-crowned-miss-universe-2021/".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  5. "హర్నాజ్ కౌర్ సంధూ".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  6. "హర్నాజ్‌ కౌర్‌ సంధూ Archives". Bright Telangana (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-20. Retrieved 2022-01-20.
  7. "Harnaaz Sandhu: 'Would love to be a part of, not just Bollywood, but Hollywood too'". The Indian Express (in ఇంగ్లీష్). 2021-12-14. Retrieved 2022-01-01.
  8. "Harnaaz Sandhu's co-star Gurpreet Ghuggi says she is the pride of the nation". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-01-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "It's so much more than just glamour, says Harnaaz Sandhu". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Archived from the original on 2022-11-11. Retrieved 2022-01-01.
  10. "Did you know Harnaaz Sandhu had a cameo in Udaariyaan?". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-01-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "Harnaaz Sandhu crowned winner of LIVA Miss Diva Universe 2021". The Indian Express (in ఇంగ్లీష్). 2021-10-01. Retrieved 2022-01-01.
  12. "'Harnaaz means everyone's pride, she proved that today'". The Indian Express (in ఇంగ్లీష్). 2021-12-14. Retrieved 2022-01-01.
  13. "Must-watch movies and music videos of LIVA Miss Diva Universe 2021 Harnaaz Sandhu". Beauty Pageants - India Times. Archived from the original on 2022-11-11. Retrieved 2022-01-01.