Jump to content

హరే కృష్ణ దేవాలయం (టొరంటో)

అక్షాంశ రేఖాంశాలు: 43°40′37″N 79°23′52″W / 43.67692°N 79.397893°W / 43.67692; -79.397893
వికీపీడియా నుండి
హరే కృష్ణ దేవాలయం

హరే కృష్ణ దేవాలయం కెనడాలోని అంటారియోలోని టొరంటోలో 243 అవెన్యూ రోడ్‌లో ఉంది. ఈ భవనాన్ని పూర్వం అవెన్యూ రోడ్ చర్చిగా పిలిచేవారు.[1] ఇది 1899లో నిర్మించబడింది. వాస్తవానికి ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ ది ఒడంబడికగా ఉంది. ఈ భవనాన్ని టొరంటో వాస్తుశిల్పులు గోర్డాన్ & హెల్లివెల్ రూపొందించారు.

అవలోకనం

[మార్చు]

హరే కృష్ణ దేవాలయం 1899 సంవత్సరంలో నిర్మించబడిన దీనిని  1925 సంవత్సరాల వరకు ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ ది కన్వెన్షన్ గా, 1941 సంవత్సరంలో ప్రారంభమైన చర్చ్ ఆఫ్ ది నజరేన్ గా [పిలువబడినది. దీనికి 1944 సంవత్సరం లో అగ్నిప్రమాదం జరిగింది.  తర్వాత 1974 సంవత్సరాల వరకు వివిధ అవసరాల కోసం ఉపయోగించబడి, తర్వాత  అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ చైతన్య (ఇస్కాన్) కొనుగోలు చేసి ఆలయంగా  మార్చడం జరిగింది. ఈ  సమయంలో, హిందూ మతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి లో ఉండటం,  దీనికి కొంతమంది ప్రముఖ రాక్ స్టార్లలో, ముఖ్యంగా మాజీ బీటిల్ జార్జ్ హారిసన్ కు  పెరుగుతున్న ప్రజాదరణ సహాయపడింది. టొరంటో దేవాలయం స్థాపకుడు, ఎ.సి.భక్తివేదాంత స్వామి (ప్రస్తుతం  ప్రభుపాదుడు గా పిలుస్తున్నారు) , వీరు 1920 లలో భారతదేశం స్వాతంత్ర్యం కోసం జరిగిన సమయంలో మహాత్మా గాంధీ అనుచరుడు. ఎ.సి.భక్తివేదాంత స్వామి భారతదేశంలో హిందూ ధర్మం లో ఉండే వివిధ అంశాలను నాలుగు దశాబ్దాల పాటు అధ్యయనం చేసి, 1965 సంవత్సరంలో హిందూ మత బోధనలు వ్యాప్తి చేయడానికి న్యూయార్క్ నగరానికి చేరుకున్నాడు , వారి వయస్సు60 ఏళ్ళు. ఆ సమయంలో అక్కడి యువతలో ప్రబలంగా ఉన్న అర్థం కోసం తెలుసుకోవడం (అన్వేషణ) కొరకు చాలా మంది ఉండటం, ప్రభుపాద చే వ్యాప్తి చెందుతున్న  హిందూ ధర్మం వైపు ఆకర్షణ కావడం, వారిలో శాఖాహారం గురించి తెలుపడం, భక్తి యోగా అభ్యాసాన్ని బోధించడం వంటివి చేసేవారు.  కెనడా అంతటా ప్రధాన నగరాల్లో శాఖలను తెరవడం, అందులో ఈ ఆలయం ప్రజాదరణ పొందింది. ప్రభుపాద 70కి పైగా పుస్తకాలను రచించారు. ఆ రచనలు 76 భాషల్లోకి అనువాదం చేయబడినవి. టొరంటో దేవాలయం స్థాపించిన ఒక సంవత్సరం తరువాత అతని అకాల మరణం ఇస్కాన్  అంతర్జాతీయ విభాగానికి అంతర్గత సమస్యల ప్రారంభమునకు నాంది పలకడం, అందులో ఉన్న వారికీ అభిప్రాయ బేధాలు రావడం, ఇతర మతముల వారు అందరూ ఏకం కావడం, వారి ఏకైక లక్ష్యం ఇస్కాన్ ను అడ్డుకోవడమే పెట్టుకున్నారు, తరువాత అనేక కేసులలో ఇస్కాన్ ఉండటం జరిగి , అవినీతి ఆరోపణలపై ఆ సమాజములో ఉన్న వారిని బహిష్కరించడం ,90వ దశకంలో ఇస్కాన్ నేతలు బాలలపై వేధింల ఆరోపణలు ఎదుర్కోవడం, విదేశాల్లోని ఈ దేవాలయాలకు ఉగ్రవాద గ్రూపుల లో లక్ష్యం గా పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం టొరంటోలోని ఆలయానికి చాల మంది అనుచరులు ఉన్నారు. కోవిడ్ -19  మహమ్మారి సమయంలో ఆన్లైన్ సేవలు, శాకాహార భోజనం అందిస్తూ ఆలయం తన కర్తవ్యాన్ని నిర్వహించినది[2] .

కార్యక్రమాలు

[మార్చు]

హరే కృష్ణ సెంటర్ (ఇస్కాన్ టొరంటో), ఎల్లప్పుడూ సంపన్న, శక్తివంతమైన, ఉత్సాహభరితమైన కార్యక్రమాలకు ఒక కేంద్రంగా ఉంది. ఇక్కడ జరిగే పండుగలు గ్రాండ్ ఫెస్టివల్స్) , స్థానిక యూనివర్శిటీలు, యోగా నిర్వహణ కేంద్రాలలో పండుగలు , వేదాంత చర్చలు( ఫిలాసఫికల్ డిస్కషన్స్), ఆహారం గురించి తెలుపడం, వీధుల్లో పాటలు పాడటం, నాట్యాలు వంటివి ప్రతి ఒక్కరిని ఆకట్టు కుంటున్నాయి. ఆదివారాలలో ఇక్కడ జరిగే సండే ఫీస్ట్ పేరుతొ, ప్రతి ఆదివారం సాయంత్రం, భక్తి యోగం - ప్రేమ, ధ్యానం, సంగీత కార్యక్రమాల తో ఆక్కడ ఉన్న ప్రజలను ముగ్ధులను చేస్తారు. ఈ కార్యక్రామాలకు హాజరయిన వారికి ఉచిత శాఖాహార విందు ఉంటుంది[3].

ఇవి కూడా చదవండి

[మార్చు]

ఎ.సి.భక్తివేదాంత స్వామి ప్రభుపాద

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం

హరేకృష్ణ (మంత్రం )

మూలాలు

[మార్చు]

43°40′37″N 79°23′52″W / 43.67692°N 79.397893°W / 43.67692; -79.397893

  1. "City of Toronto – Doors Open 2011 – Hare Krishna Temple". Archived from the original on 28 May 2013. Retrieved 30 July 2013.
  2. DiMatteo, Enzo (2021-06-06). "Hidden Toronto: the Hare Krishna temple". NOW Toronto (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-03-31.
  3. "ISKCON Toronto". www.radha.name. Retrieved 2023-03-31.