హరికిషన్ సింగ్ సూర్జిత్
స్వరూపం
హరికిషన్ సింగ్ సూర్జిత్ | |||
సీపీయం పార్టీ ప్రధాన కార్యదర్శి
| |||
పదవీ కాలం 1992–2005 | |||
ముందు | నంబూదిరి పద్ | ||
---|---|---|---|
తరువాత | ప్రకాశ్ కారత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జలంధర్, పంజాబ్ | 1916 మార్చి 23||
మరణం | 2008 ఆగస్టు 1 నోయిడా, ఉత్తర ప్రదేశ్ | (వయసు 92)||
రాజకీయ పార్టీ | సీపీయం |
హరికిషన్ సింగ్ సూర్జిత్ (23 మార్చి 1916 – 1 ఆగస్టు 2008) పంజాబ్ కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. 1992 నుంచి 2005 దాకా సీపీయం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 1964 నుంచి 2008 దాకా అదే పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. [1]
స్వాతంత్ర్యానికి మునుపు
[మార్చు]హరికిషన్ సింగ్ 1916 లో పంజాబ్ లోని జలంధర్ జిల్లా, రోపావల్ లోని ఒక సిక్కు ఝాట్ కుటుంబంలో జన్మించాడు. [2] ఆయన భగత్ సింగ్ అనుచరుడిగా దేశ స్వాతంత్రోద్యమంలో అడుగు పెట్టాడు. 1930లో నవజీవన్ భారత్ సభ లో చేరాడు. 1936లో కమ్యూనిస్టు పార్టీ లో చేరాడు. పంజాబ్ లో అఖిల భారత రైతు సమాఖ్య ప్రారంభకుల్లో ఒకడు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి భారత్ పాకిస్థాన్ విడిపోయిన తరువాత పంజాబ్ లో కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన పంజాబీ సాంప్రదాయ వస్త్రధారణయైన తలపాగా ధరించినా కూడా జీవితాంతం నాస్తికుడు గానే ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Manini Chatterjee. "Nine to none, founders’ era ends in CPM Archived 2018-07-03 at the Wayback Machine". The Telegraph. 3 April 2008.
- ↑ "Surjeet, who always sported a white turban, was also passionately opposed to the Sikh separatist campaign that bled Punjab for a decade until 1993. He led a spartan lifestyle and always wore simple, even crumpled clothes." M.R. Narayan Swamy and Monobina Gupta, Indo-Asian News Service: 'Harkishan Singh Surjeet - nationalist to Communist and then kingmaker Archived 2012-12-09 at Archive.today', Hindustan Times, 1 August 2008 (accessed 1 August 2008).