Jump to content

హజారీ ప్రసాద్ ద్వివేది

వికీపీడియా నుండి
హజారీ ప్రసాద్ ద్వివేది
హజారీ ప్రసాద్ ద్వివేది
జననం19 ఆగుస్ట్ 1907
మరణం19 మె 1979
ఢిల్లీ
వృత్తిహిందీ భాషావేత్త

 

హజారీ ప్రసాద్ ద్వివేది (19 ఆగస్టు 1907 - 19 మే 1979) ఒక హిందీ వ్యాసకర్త, విమర్శకుడు, నవలా రచయిత . ఆయన హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, బెంగాలీ భాషలలో పండితుడు. ఆయనకు భక్తి సాహిత్యంపై మంచి పరిజ్ఞానం ఉంది. 1957 లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు లభించింది.

ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది 1964, శ్రావణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు, అంటే ఆగస్టు 19, 1907న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని దుబే కా ఛప్రాలోని ఓఝవలియా అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు శ్రీ అన్మోల్ ద్వివేది, తల్లి పేరు శ్రీమతి జ్యోతిష్మతి. అతని కుటుంబం జ్యోతిషశాస్త్రానికి ప్రసిద్ధి చెందింది. ఆయన తండ్రి పండిట్ అన్మోల్ ద్వివేది సంస్కృతంలో గొప్ప పండితుడు. ద్వివేది చిన్ననాటి పేరు వైద్యనాథ్ ద్వివేది.

ద్వివేది తన ప్రాథమిక విద్యను గ్రామ పాఠశాలలోనే పొందారు. 1920లో బసరికాపూర్ మిడిల్ స్కూల్ నుండి మిడిల్ పరీక్షలో మొదటి డివిజన్‌లో ఉత్తీర్ణుడయ్యారు. దీని తరువాత అతను గ్రామానికి సమీపంలోని పరాశర బ్రహ్మచార్య ఆశ్రమంలో సంస్కృతం అధ్యయనం ప్రారంభించారు. 1923లో, అతను చదువు కోసం కాశీకి వచ్చారు. అక్కడ అతను కాంచాలో ఉన్న రణవీర్ సంస్కృత పాఠశాల నుండి ప్రవేశ పరీక్షలో మొదటి తరగతిలో మొదటి స్థానంతో ఉత్తీర్ణుడయ్యారు. 1927లో, అతను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఉన్నత పాఠశాల పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. అదే సంవత్సరం భగవతీ దేవితో అతని వివాహం జరిగింది. 1929లో సంస్కృత సాహిత్యంలో ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యారు. 1930 లో, అతను జ్యోతిషశాస్త్రంలో ఆచార్య పట్టా పొందారు.

ద్వివేది గారి వ్యక్తిత్వం చాలా ఆకట్టుకునేది. ఆయన స్వభావం చాలా సరళంగా, ఉదారంగా ఉండేది. ద్వివేది 1930 నవంబర్ 8 నుండి శాంతి నికేతన్‌లో హిందీ బోధించడం ప్రారంభించారు. అక్కడ, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆచార్య క్షితిమోహన్ సేన్ ప్రభావంతో, అతను సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేశారు. అక్కడే క్రమపద్ధతిలో తన స్వతంత్ర రచనను కూడా ప్రారంభించారు. 1949లో, లక్నో విశ్వవిద్యాలయం అతనికి డి.లిట్ గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. శాంతినికేతన్‌లో ఇరవై సంవత్సరాలు బోధించిన తర్వాత, ద్వివేది జూలై 1950లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క హిందీ విభాగానికి ప్రొఫెసర్ధి, అదిపతిగా బాధ్యతలు స్వీకరించారు. 1957లో ఆయనకు రాష్ట్రపతి చేతుల మీదుగా ' పద్మభూషణ్ ' బిరుదు లభించింది.

ప్రత్యర్థుల వ్యతిరేకత కారణంగా ద్వివేదిని మే 1960లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించారు . జూలై 1960 నుండి ఆయన చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో హిందీ విభాగానికి ప్రొఫెసర్ అధిపతిగా పనిచేశారు. అక్టోబర్ 1967లో, ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి హిందీ విభాగాధిపతిగా తిరిగి వచ్చారు. ఆయన మార్చి 1968లో విశ్వవిద్యాలయ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఫిబ్రవరి 25, 1970న ఆ పదవి నుండి పదవీ విరమణ చేశారు. కొంతకాలం ఆయన 'హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ హిందీ' ప్రాజెక్టుకు డైరెక్టర్ కూడా ఉన్నారు. తరువాత, ఆయన ఉత్తరప్రదేశ్ హిందీ గ్రంథ్ అకాడమీ అధ్యక్షుడయ్యారు. 1972 నుండి, లక్నోలోని ఉత్తరప్రదేశ్ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడిగా జీవితాంతం పనిచేశారు. 1973లో, 'అలోక్ పర్వ్' అనే వ్యాస సంకలనానికి ఆయనకు ' సాహిత్య అకాడమీ అవార్డు ' లభించింది.

మే 19, 1979న ఢిల్లీలో బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు.

ముఖ్య రచనలు

[మార్చు]

హజారీ ప్రసాద్ ద్వివేది జీ యొక్క ప్రధాన రచనలు క్రింద ఇవ్వబడ్డాయి-

  • సూర్ సాహిత్య (1936)
  • హిందీ సాహిత్యాకీ భూమిక (1940)
  • ప్రాచీన భారత్ కె కాలాత్మక వినోదా (1952)
  • కబీర్ (1942)
  • నాథ సంప్రదాయ (1950)
  • హిందీ సాహిత్యం కా ఆదికాలా (1952)
  • ఆధునిక హిందీ సాహిత్యపర్ విచార (1949)
  • సాహిత్య కా మర్మ (1949)
  • మేఘదూత: యేక్ పురానీ కహానీ (1957)
  • లాలిత్య తత్త్వ (1962)
  • సాహిత్య సహచర్ (1965)
  • కాళిదాసు కీ లాలిత్య యోజనా(1965)
  • మధ్య కాలీన బోధ్ కా స్వరూప(1970)
  • హిందీ సాహిత్యకా ఉద్భవ అవుర్ వికాస (1952)
  • మృత్యుంజయ్ రవీంద్ర (1970)
  • సహజ్ సాధన (1963)
  • హిందీ సాహిత్యం
  • అశోక కె ఫూల్

మూలములు

[మార్చు]