స్వేచ్ఛ (సంస్థ)
స్వేచ్ఛ | |
అవతరణ | 2005 |
---|---|
రకం | లాభాపేక్ష రహిత సంస్థ |
కేంద్రస్థానం | హైదరాబాదు |
సేవలందించే ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ |
అధికార భాష | తెలుగు |
ప్రధాన విభాగం | Executive Committee |
అనుబంధ సంస్థలు | భారత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ఉద్యమం |
Formerly called | ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ |
స్వేచ్ఛ, లాభాపేక్షలేని సంస్థ. ఇది ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (FSMI)లో భాగం.[2] గతంలో ఇది ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ (FSF-AP) అనే పేరుతో ఉండేది. ఈ సంస్థ స్వేచ్ఛా సాఫ్ట్‌వేరుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, సామాన్యులకు విజ్ఞానాన్ని అందించడానికి కృషి చేస్తున్న ఒక సామాజిక ఉద్యమం. ఇది 2005 సంవత్సరంలో తెలుగు ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసింది.
స్వేచ్ఛ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్క్‌షాపులు, సెమినార్‌లను నిర్వహిస్తుంది.[3] ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్, చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, [4] [5] సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, SCIENT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్, జ్యోతిష్మతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, [6] MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, KL యూనివర్సిటీ, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వంటి అనేక ఇంజనీరింగ్ కళాశాలల్లో స్వేచ్ఛకు చెందిన GLUG (GNU/Linux యూజర్ గ్రూప్) చురుకుగా ఉంది.
లక్ష్యాలు
[మార్చు]సంస్థ ప్రధాన లక్ష్యాలు ఇవి:
- స్వేచ్ఛా సాఫ్ట్‌వేరును దాని సైద్ధాంతిక ప్రభావాలనూ, అభివృద్ధి చెందిన రంగాల నుండి వెనుకబడిన వారి వరకు భారతదేశంలోని అన్ని మూలలకూ తీసుకెళ్లడం.
- స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ వాడుకపై కంప్యూటర్ వినియోగదారులకు అవగాహన కల్పించడం.
- శాస్త్రాలు, పరిశోధనలకు చెందిన అన్ని రంగాల్లో స్వేచ్ఛా సాఫ్ట్‌వేరును వాడేలా కృషి చేయడం.
- పాఠశాల విద్యలోను, ఉన్నత విద్యలోనూ స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ వినియోగాన్ని ముందుకు తీసుకెళ్లడం.
- స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఇ-అక్షరాస్యతను పెంచి, డిజిటల్ అంతరాలను తగ్గించడం, వెనుకబడిన వారిని ప్రోత్సహించడం.
- సామాజిక, జాతీయ అవసరాలను తీర్చే పరిష్కారాలపై డెవలపర్‌లతో కలసి పని చేయడం.
- ప్రజాజీవితం లోని అన్ని రంగాలలో ఉచిత సాఫ్ట్‌వేర్‌కు అనుకూలంగా, ప్రభుత్వ విధానాల్లో మార్పు కోసం పని చేయడం.
ప్రాజెక్టులు
[మార్చు]లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తెలుగులోకి స్థానికీకరించి స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మోడల్‌తో స్థానిక ప్రజలకు ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అందించడం లక్ష్యంగా స్వేచ్ఛ సంస్థ పెట్టుకుంది.[7] స్వేచ్ఛ OS ప్రధాన లక్ష్యం తెలుగు మాత్రమే అర్థం చేసుకోగల ప్రజలకు పూర్తి కంప్యూటింగ్ పరిష్కారాన్ని అందించడం. డిజిటల్ అగాధానానికి ఆవల ఉన్న సమాజమే డిస్ట్రో అనే ఈ లినక్స్ రూపానికి వినియోగదారులు. డిజిటల్ విభజనను నిర్మూలించి, డిజిటల్ ఐక్యతను సాధించడంలో ఇది ఒక అడుగు, ఈ ప్రాజెక్టు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఉచిత సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్
- ఉచిత సాఫ్ట్‌వేర్ ఉద్యమం
- ఉచిత సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ తమిళనాడు
- కర్ణాటక ఉచిత సాఫ్ట్‌వేర్ ఉద్యమం
- పబ్లిక్ పేటెంట్ ఫౌండేషన్
- సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్
- Guifi.net
మూలాలు
[మార్చు]- ↑ "About". Swecha. Retrieved 15 August 2014.
- ↑ "National Free Software coalition formed". The Hindu. 22 March 2010. Retrieved 27 February 2012.
- ↑ "Run up to NCAR 2010: Women In Research workshop held". Women in Research - the FOSS paradigm. Archived from the original on 26 December 2010. Retrieved 26 November 2010.
- ↑ "Workshop on free software". The Hindu. 20 June 2011. Retrieved 27 June 2011.
- ↑ "15 Day's Software Industry Oriented Training Camp". 15 Days Camp at CBIT. 18 March 2011. Retrieved 22 September 2013.
- ↑ "Free software movement spreads in universities". Jits Karimnagar. 18 June 2013. Archived from the original on 25 September 2013. Retrieved 22 September 2013.
- ↑ "A Telugu Os". Deccan Chronicle. 24 September 2013. Archived from the original on 22 February 2015. Retrieved 12 March 2014.