Jump to content

స్విట్జర్లండ్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
అడ్లిస్విల్‌లోని శ్రీ శివసుబ్రమణియర్ ఆలయం లోపలి భాగం

హిందూమతం స్విట్జర్లాండ్ జనాభాలో 0.6% మంది ఆచరించే మైనారిటీ మతం. [1] దాదాపు 90% మంది హిందువులు విదేశాల్లో జన్మించినవారే. [2] వారిలో మూడింట ఒక వంతు మంది శరణార్థులు లేదా కాందిశీకులు. అడ్లిస్విల్‌లోని సిహ్ల్ వ్యాలీలో ఉన్న శ్రీ శివసుబ్రమణియర్ ఆలయం, స్విట్జర్లాండ్‌లోని అత్యంత ప్రసిద్ధ, అతిపెద్ద హిందూ దేవాలయం [3] గ్లాట్‌బ్రగ్‌లో అరుల్మిగు శివాలయం ఉంది. [4] 2010లో డర్న్‌టెన్‌లోని శ్రీ విష్ణు తుర్క్కై అమ్మన్ ఆలయంకు పునాది వేసారు. [5] [6]

చరిత్ర

[మార్చు]
జూరిచ్‌లోని ఇస్కాన్ కృష్ణ దేవాలయం

ఈ దేశంలో మొట్టమొదటి యోగా పాఠశాలను 70 సంవత్సరాల క్రితం స్థాపించారు. హంగేరియన్ పియానిస్ట్, శిల్పి ఎలిసబెత్ హైచ్ 1940లలో తన భారతీయ భర్త, వైద్యుడు సెల్వరాజన్ యేసుడియన్‌తో కలిసి బుడాపెస్ట్ నుండి జ్యూరిచ్‌కు వెళ్ళింది. వారు కలిసి 1948 లో స్విట్జర్లాండ్‌లో మొదటి యోగా పాఠశాలను ప్రారంభించారు. ఈ రోజు యోగా అనేది ప్రధానంగా విశ్రాంతి, వ్యాయామం యొక్క రూపంగా అర్థం చేసుకున్నప్పటికీ, వాస్తవానికి యోగాలో లోతైన మత-ఆధ్యాత్మిక విధానం ఉందని తెలుసుకోవడం హిందూమతం పట్ల అనేక మంది అభ్యాసకులలో ఇది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. 1966 లో భారతీయ సన్యాసి స్వామి ఓంకారానంద, స్విట్జర్లాండ్‌లోని మొట్తమొదటి సంఘం, డివైన్ లైట్ సెంటర్‌ను స్థాపించాడు. [7] 1970వ దశకం ప్రారంభంలో, భగవాన్ శ్రీ రజనీష్ నాయకత్వంలో ఓషో సంఘం, స్వామి ప్రభుపాద స్థాపించిన ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్) కూడా విస్తరించింది.

శ్రీలంక తమిళ హిందువులు 1983 లో జాతి వివాదం సమయంలో శరణార్థులుగా స్విట్జర్లాండ్‌కు వచ్చారు. ప్రారంభ రోజుల్లో, 1980లో ప్రారంభించబడిన జ్యూరిచ్‌బర్గ్‌లోని కృష్ణ దేవాలయం చాలా మంది తమిళులకు మొదటి ఆశ్రయాన్ని అందించింది. అనేక సంవత్సరాలుగా వివిధ సంఘాలు ఏర్పడ్డాయి, తద్వారా 1986లో బాసెల్‌లో మొదటి తమిళ ఆలయాన్ని తెరిచారు. స్విట్జర్లాండ్‌లోని ఇతర ప్రాంతాలలో మరిన్ని ఆలయాలు తెరిచారు. ఈ రోజు 20కి పైగా విభిన్న తమిళ హిందూ దేవాలయాలు ఉన్నాయి. [8]

జనాభా వివరాలు

[మార్చు]

మునుపటి జనాభా గణనలలో, హిందూమతాన్ని, ఇతర అబ్రహమికేతర సంప్రదాయాలనూ (ప్రధానంగా బౌద్ధమతం) "ఇతర చర్చిలు సంఘాలు"గా గుర్తించేవారు. ఇవి 1970లో 0.12%, 1980లో 0.19%, 1990లో 0.42%, 2000లో 0.78% (0.38% హిందూమతం, 0.29% బౌద్ధమతం, 0.11% ఇతరాలు). 1990లలో స్విట్జర్లాండ్‌లో హిందూమతం జుడాయిజంను దాటి మూడవ అతిపెద్ద మతంగా (క్రైస్తవ మతం, ఇస్లాం తర్వాత) పేరుపొందింది. 2000 లో న్యూ అపోస్టోలిక్ చర్చితో 0.38%తో పోటీ పడింది.

2000 జనాభా లెక్కల ప్రకారం స్విట్జర్లాండ్‌లోని 27,839 మంది హిందువులుగా గుర్తించబడ్డారు (మొత్తం జనాభాలో 0.38%; బెర్న్‌లో 1.11%, జూరిచ్‌లో 1%, జెనీవాలో 0.27%). వీరిలో ఎక్కువ మంది శ్రీలంక తమిళులే (81.2%).

2017లో, స్విట్జర్లాండ్ జనాభాలో హిందువులు 0.6% ఉన్నారు. [9] హిందువుల సంఖ్య దాదాపు 50,000. [10] [11] స్విట్జర్లాండ్‌లో దాదాపు 400 మంది సభ్యులు, దాదాపు 2000 మంది స్నేహితులు, సానుభూతిపరులతో కూడిన ISKCON సంఘం కూడా ఉంది. [12]

హిందూ సంఘాలు

[మార్చు]

ది స్విస్ ఫెడరేషన్ ఫర్ హిందూయిజం (www.hindus.ch) అనేది స్విట్జర్లాండ్‌లోని ప్రధాన హిందూ సంఘం. దీన్ని 2017 లో స్థాపించారు. [13]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Religions".
  2. Hinduismus in der Schweiz Archived 2015-07-10 at the Wayback Machine
  3. Religionen in der Schweiz: Hinduismus Archived 2015-07-10 at the Wayback Machine
  4. Simone Thommen Awe (2012-07-02). "Umzug zu Ehren der Götter" (in జర్మన్). Zürcher Unterländer. Archived from the original on 2015-04-02. Retrieved 2015-03-20.
  5. Regula Lienin (2013-07-20). "Ein Pfauentanz für Göttin Amman" (in జర్మన్). Zürcher Oberländer. Retrieved 2014-12-18.
  6. Patrizia Legnini (2010-01-17). "Indische Handwerker bauen Hindu-Tempel – ohne Bewilligung" (in జర్మన్). Limmattaler Zeitung. Archived from the original on 2014-12-18. Retrieved 2014-12-18.
  7. "Three European Monasteries". Hinduismtoday.
  8. "Hinduism in Switzerland". Archived from the original on 2019-02-09. Retrieved 2022-01-26.
  9. "Religions".
  10. "Hinduism in Switzerland". Archived from the original on 2019-02-09. Retrieved 2022-01-26.
  11. "Hinduism Today".
  12. "Hinduism in Switzerland". Archived from the original on 2019-02-09. Retrieved 2022-01-26.
  13. "Hinduism Today".