స్వామిరారా
స్వామిరారా | |
---|---|
దర్శకత్వం | సుధీర్ వర్మ |
కథ | సుధీర్ వర్మ |
నిర్మాత | చక్రి చిగురుపాటి |
తారాగణం | నిఖిల్ కలర్స్ స్వాతి |
ఛాయాగ్రహణం | రిచర్డ్ ప్రసాద్ |
కూర్పు | ఎస్. ఆర్. శేఖర్ |
సంగీతం | సన్ని ఎం.ఆర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | ఫిబ్రవరి 14, 2013 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
స్వామిరారా 2013, ఫిబ్రవరి 14న సుధీర్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ఉత్కంఠ భరిత తెలుగు చిత్రం.[1] ఇందులో నిఖిల్, స్వాతి ప్రధాన పాత్రలు పోషించారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దొంగిలింపబడిన ఓ చిన్ని విగ్రహం చుట్టూ అల్లుకోబడిన కథ ఇది.
కథ
[మార్చు]ఈ సినిమా తిరువనంతపురంలోని పద్మనాభస్వామి గుడిలోని అత్యంత మహిమ గల గణేష్ విగ్రహాన్ని దొంగలించడంతో మొదలవుతుంది. ఈ విగ్రహం అత్యంత పురాతనమైనది కావడం వల్లన మార్కెట్లో భారీగా ధర పలుకుతుంది. ఈ విగ్రహం ఒకరి చేతిలో నుండి మరొకరి చేతిలోకి మారుతూ వుంటుంది. అలా నిధానంగా గ్యాంగ్ స్టర్స్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి ఒక్కరు ఈ విగ్రహాన్ని ఒకరి దగ్గర నుంచి ఒకరు దొంగిలించి అమ్మడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఇదిలా ఉండగా సూర్య (నిఖిల్) ఒక జేబు దొంగ, తనతో పాటు మరో ముగ్గురు వుంటారు. వారు బ్రతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వుంటారు.
ఒకరోజు అనుకోకుండా సూర్య, జర్నలిస్ట్ గా పనిచేస్తున్న స్వాతి (స్వాతి)ని కలుసుకుంటాడు. వీరు మంచి స్నేహితులుగా మారుతారు. గ్యాంగ్ స్టర్స్ దగ్గర గల గణేష్ విగ్రహం చేతులు మారుతూ మారుతూ అనుకోకుండా స్వాతి హ్యాండ్ బ్యాగ్ లోకి చేరుతుంది. ఈ విషయం దుర్గకి తెలుస్తుంది. ఈ విగ్రహం కోసం రవిబాబు స్వాతి, సూర్యల వెంట పడతాడు. ఈ గ్యాంగ్ స్టర్ నుండి సూర్య, స్వాతి ఎలా బయట పడ్డారు? చివరికి ఆ విగ్రహం ఏమవుతుంది? అనేది మిగతా కథ.
నటులు
[మార్చు]- సూర్యగా నిఖిల్
- కలర్స్ స్వాతి
- సత్య
- పూజా రామచంద్రన్
- జీవా
- దుర్గగా రవిబాబు
- ప్రవీణ్
- రాజా రవీంద్ర
- జోగి నాయుడు
- సత్య (నటుడు)
పాటలు
[మార్చు]- లైఫంటేనే పెద్ద చేజురా, రచన:కృష్ణచైతన్య , గానం. షెఫలి అల్వరెస్ , బెన్నీ దయాళ్
- కృష్ణుడి వారసులంతా , రచన: కృష్ణచైతన్య, గానం. ఆర్జిత్ సింగ్
- యో యో యో మేము అంతా , రచన: కృష్ణచైతన్య, గానం.నిఖిల్ సిద్ధార్ద్, స్వాతి రెడ్డి
- అదిఏంటి సారీ , రచన: కృష్ణచైతన్య , గానం.ఆర్జిత సింగ్ .
- ఈడూ వాడు ఎవడో లేడు , రచన: కృష్ణచైతన్య, గానం.అర్జిత్ సింగ్
- స్వామి రారా,(రీలోడ్) రచన: కృష్ణచైతన్య, గానం.సన్నీ.
మూలాలు
[మార్చు]- ↑ "స్వామిరారా సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 28 November 2017.