స్వామిబాబు పొట్నూరు
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
స్వామిబాబు పొట్నూరు | |
---|---|
జననం | స్వామిబాబు పొట్నూరు 1884 |
మరణం | 1982 |
ఇతర పేర్లు | స్వామిబాబు పొట్నూరు |
పొట్నూరు స్వామిబాబు, నరసన్నపేట వాస్తవ్యులు. దేశభక్తుడు, దాత, సంఘసేవకుడు, కవి, పండితపోషకుడు.
చేసిన సేవలు :
[మార్చు]1906 వందేమాతరం ఉద్యమంలో సకుటుంబంగా పాల్గొన్నాడు. స్వరాజ్యోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో క్రియాశీల పాత్రలు పోషించారు, 1941-42 ఉమ్మడి విశాఖ జిల్లాబోర్డు అధ్యక్షుడుగా, ఖాదీ ఉద్యమవ్యాప్తికి ఎనలేని కృషిచేసారు.
సంఘసంస్కర్తగా
[మార్చు]స్త్రీ విద్య, ఆదర్శ వితంతు వివాహాలు, అస్పృశ్యత నిర్మూలన కోసం కృషిచేసాడు.
- సంఘ సేవకుడుగా
దళితులకు గ్రామసముదాయ నిర్మాణం, సహకారరంగ విస్తరణకు తోడ్పడ్డాడు,
- దాతగా
కవులకు ఇల్లు, శిశు సదనాలు, ఆశ్రమాలు, ఆసుపత్రుల నిర్మాణాలు గావించాడు.అతని విగ్రహాన్ని ఇంటాక్ సహకారంతో డే & నైట్ కొత్త బ్రిడ్జి రోడ్ న ఆవిష్కరించారు.