Jump to content

స్వర్ణగౌరి

వికీపీడియా నుండి
స్వర్ణగౌరి
(1962 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వై.ఆర్.స్వామి
నిర్మాణ సంస్థ శ్యాం ప్రసాద్ మూవీస్
భాష తెలుగు

స్వర్ణగౌరి 1962, మే 24న విడుదలైన తెలుగు సినిమా. శ్యాంప్రసాద్ మూవీస్ బ్యానర్‌పై డి.ఆర్.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించాడు.[1] ఈ సినిమా తెలుగు, కన్నడ భాషలలో ఏక కాలంలో నిర్మించబడింది. కన్నడ చిత్రంలో కథానాయకుడి పాత్రను రాజ్‌కుమార్ నటించాడు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, పాటలు, మాటలు: వీటూరి
  • దర్శకత్వం: వై.ఆర్.స్వామి
  • సంగీతం: ఎం.వెంకటరాజు
  • ఛాయాగ్రహణం: ఆర్.మధు
  • కూర్పు: ఎస్.పి.ఎన్.కృష్ణ, జి.బోజరావు
  • కళ: సయ్యద్ అహ్మద్
  • నృత్యం: వేణుగోపాల్

ఆది దంపతుల ప్రణయ కోపాన్ని లోకానికి వెల్లడించిన నేరంపై తన శిరోభూషణమైన సర్పరాజు కాళింగుణ్ణి మానవునిగా జన్మించమని మహేశ్వరుడు శపిస్తాడు. ఇరవైఐదేళ్ళ మానవజీవితం తరువాత తిరిగి తన లోకానికి రావలసిందని శాపవిముక్తి ప్రసాదిస్తాడు. విష్ణుసభలో అపశ్రుతి పలికి తన ఓటమికి కారణమైన మహతిని నారదుడు కష్టజీవితం గడుపుతూ భూలోకంలో జీవించమని శపిస్తాడు. మణిపురాధీశుడి కుమారుడు చంద్రుడిగా కాళింగుడు, సంగీత విద్వాంసుడు విప్రదాసు కుమార్తె గౌరిగా మహతి భూలోకంలో జన్మిస్తారు. పెద్దల నిర్ణయంతో వారిరువురికి పెళ్ళవుతుంది. గౌరిని నారదుని కారణంగా దీర్ఘసుమంగళిగా దీవించిన భవానికీ, కళింగుణి అల్పాయుష్కునిగా శపించిన శంకరునికి మధ్య స్పర్ధలు ఏర్పడతాయి. కాళింగుడు మానవుడిగా జన్మించడానికి కారణమైన మాలిని మూలాన చంద్రుడు, గౌరి కష్టాలను అనుభవించడం, 25 సంవత్సరాలు నిండిన చంద్రుడి ప్రాణాలు హరించాలని మృత్యుంజయుడు ప్రయత్నించగా భవాని రక్షించడం, చివరి క్షణాలలో గౌరి చేసిన మహాదేవీ మంత్రజపంవల్ల లోకాలు కల్లోలం కావడం, చివరకు భవానీ శంకరుల మధ్య సయోధ్యకుదిరి చంద్రునకు గౌరితో భూలోక సుఖాలు లభించడం జరుగుతుంది.[2]

పాటలు, పద్యాలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను వీటూరి రచించగా ఎం.వెంకటరాజు బాణీలను కట్టాడు.[3]

  1. ఆశలన్నీకలబోసి నేను కలలు కన్నాను నాలో - ఎస్.జానకి
  2. జయమీవే జగదీశ్వరీ కావ్యగాన కళా సాగరీ - ఎస్.జానకి, చిత్తరంజన్
  3. రసమయ జీవన దీనావనా త్రిభువన పాలన - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
  4. రావే నా చెలియా నీ తళుకు బెళుకు కులుకులతో - పి.బి.శ్రీనివాస్
  5. రావో జాబిలీ చిన్నారి కన్నెనోయి కన్నారా చూడవోయి - ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్
  6. కరకు ఱాగుండె కాలుని కరుగ జేసి (పద్యం) -
  7. జయ జయ నారాయణ ప్రభో పావన హే లీలా వినోదా - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  8. తన మగని నత్తమామల జననీ జనకులను (పద్యం) -
  9. దయగనుమా మొర వినుమా పతిని కాపాడవమ్మా -
  10. న్యాయం మారిందా జగతిని ధర్మం మీరిందా - ఎస్.జానకి బృందం
  11. పాలించు ప్రభువుల పసిపాపాలను జేసి (పద్యం) - మంగళంపల్లి
  12. మనసేలా ఈ వేళా రాగాలా తేలేను ఆ వంనేకాని - ఎస్.జానకి
  13. రష్వ చాలించరా ఓ హౌసుకాడా నవ్వు నవ్వించరా -ఎస్.జానకి బృందం

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Swarna Gauri (Y.R. Swamy) 1962". ఇండియన్ సినిమా. Archived from the original on 23 December 2022. Retrieved 23 December 2022.
  2. నాగరాజ్ (27 May 1962). "చిత్రసమీక్ష: స్వర్ణగౌరి" (PDF). ఆంధ్రపత్రిక. Archived (PDF) from the original on 23 December 2022. Retrieved 23 December 2022.
  3. కొల్లూరి భాస్కరరావు. "స్వర్ణ గౌరి - 1962". ఘంటసాల గళామృతము. Archived from the original on 23 December 2022. Retrieved 23 December 2022.