స్వరూపానందేంద్ర సరస్వతి
స్వరూపం
స్వరూపానందేంద్ర సరస్వతి | |
---|---|
జననం | 18 నవంబరు, 1964 రణస్థలం, శ్రీకాకుళం జిల్లా |
జాతీయత | భారతీయుడు |
విశాఖ శ్రీ శారద పీఠాధిపతి | |
Assumed office 04 ఆగస్టు 1997 | |
వ్యక్తిగత వివరాలు | |
నివాసం | విశాఖ శ్రీ శారద పీఠం |
స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని విశాఖ శ్రీ శారద పీఠ మొదటి పీఠాధిపతి. అతను 1997లో ఈ పీఠంను ప్రారంభించాడు.[1]
జీవిత విషయాలు
[మార్చు]స్వరూపానందేంద్ర సరస్వతి 1964, నవంబరు 18న శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం గ్రామంలో జన్మించాడు.[2] తెలుగు రాష్ట్రాలలో రాజకీయ హిందుత్వ రాజకీయాల్లో స్వరూపానేంద్ర సరస్వతి ముఖ్యమైన, కీలక పాత్రను పోషించాడు.[3][4]
ఇతర వివరాలు
[మార్చు]- డా. చింతకింది శ్రీనివాసరావు స్వరూప సుధ పేరుతో స్వరూపానందేంద్ర సరస్వతి జీవిత చరిత్రను రాశాడు. ఈ పుస్తకం 2012, ఏప్రిల్ 30న విశాఖపట్నంలోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ ఆవిష్కరణ జరుపుకుంది.
- 2020, నవంబరు 18న స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ముఖ్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Know All About Swaroopanandendra Saraswati". srisaradapeetham.org. Retrieved 28 May 2019.
- ↑ "Biography of Swaroopanandendra released". The Hindu (in ఇంగ్లీష్). 1 May 2012. Retrieved 1 March 2018.
- ↑ "Police leaves KCR fans upset in Vizag". Deccan Chronicle (in ఇంగ్లీష్). 24 December 2018. Retrieved 23 May 2019.
- ↑ "With poll results in a week, Andhra politicians flock to temples". Hindustan Times (in ఇంగ్లీష్). 16 May 2019. Retrieved 26 May 2019.
- ↑ 10టివి, ఆంధ్రప్రదేశ్ (14 November 2020). "స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినం". 10TV (in telugu). మధు. Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)