Jump to content

స్వయం సహాయక బృందం

వికీపీడియా నుండి

స్వయం సహాయక బృందం (Self-help Group - SHG) ఆర్థిక మధ్యవర్తిత్వ సంఘం. ఇందులో 18 నుంచి 50 సంవత్సరాల వయసున్న 12 నుంచి 25 మంది ప్రాంతీయ మహిళలు సభ్యులుగా ఉంటారు. ఈ సంఘాలు ప్రధానంగా భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాలోని కొన్ని దేశాలలో కూడా ఇవి ఉన్నాయి. సాధారణంగా కూలిపని లాంటివి చేసుకునే వారు కొంతమంది ఒక జట్టుగా ఏర్పడి, వీలున్నవారు డబ్బును సమకూర్చితే, అవసరం ఉన్నవారు ఆ డబ్బును తమ అవసరాలకు వాడుకుంటారు. ఇందుకోసం ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసి, చాలినంత మొత్తం సమకూరిన తర్వాత దాన్ని ఋణంగా ఇస్తారు. భారతదేశంలో ఈ బృందాలు బ్యాంకుతో అనుసంధానమై దాన్నుంచి సూక్ష్మ ఋణాలు అందిస్తున్నాయి.

నిర్మాణం

[మార్చు]

SHG అనేది 10-25 మంది సభ్యులతో కూడిన సమూహం. సభ్యులు సాధారణంగా ఒకే విధమైన సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుండి వచ్చిన మహిళలు. అందరూ స్వచ్ఛందంగా చిన్న మొత్తాలను క్రమ పద్ధతిలో పొదుపు చేస్తారు. వారు ఆర్థికంగా స్థిరపడేందుకు, అత్యవసర లేదా ఆర్థిక కొరత, ముఖ్యమైన కార్యాలు లేదా ఆస్తులను కొనుగోలు చేయడానికి వారి సామూహిక పొదుపు నుండి రుణాలను తీసుకుంటారు.[1][2]


మూలాలు

[మార్చు]
  1. Kabeer, Naila (2005). "Is Microfinance a 'Magic Bullet' for Women's Empowerment? Analysis of Findings from South Asia". Economic and Political Weekly. 40 (44/45): 4709–4718. ISSN 0012-9976. JSTOR 4417357.
  2. "Money and Credit" (PDF). Understanding Economic Development: Social Science Textbook for Class X. New Delhi: NCERT. 2019. pp. 50–51. ISBN 978-81-7450-655-9. OCLC 1144708028.