Jump to content

స్వయంవరం (మలయాళ సినిమా)

వికీపీడియా నుండి
స్వయంవరం
స్వయంవరం
దర్శకత్వంఅడూర్ గోపాలక్రిష్ణన్
రచనఅడూర్ గోపాలక్రిష్ణన్
కె.పి.కుమరన్
కథఅడూర్ గోపాలక్రిష్ణన్
నిర్మాతచిత్రలేఖ ఫిలిం కోఆపరేటివ్
తారాగణం
  • మధు
  • శారద
  • ఆదూర్ భవాని
  • కె.పి.ఎ.సి.లలిత
  • తిక్కురిసి సుకుమాన నాయర్
  • భరత్ గోపి
ఛాయాగ్రహణంఎం.రవివర్మ
కూర్పురమేశన్
సంగీతంఎం.బి.శ్రీనివాసన్
పంపిణీదార్లుచిత్రలేఖ ఫిలిం కో ఆపరేటివ్
విడుదల తేదీ
24 నవంబరు 1972 (1972-11-24)
సినిమా నిడివి
131 నిమిషాలు
దేశంభారత దేశం
భాషమలయాళం
బడ్జెట్2,50,000 (US$3,100)

స్వయంవరం మలయాళ భాషలో తీయబడిన చలనచిత్రం. ఇది అడూర్ గోపాలక్రిష్ణన్ దర్శకత్వంలో 1972లో విడుదలైన సినిమా. ఈ సినిమా ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఛాయాగ్రాహకుడు (నలుపు తెలుపు) అనే నాలుగు విభాగాలలో జాతీయ చలనచిత పురస్కారాలను గెలుచుకుంది.[1]

చిత్రకథ

[మార్చు]

విశ్వం, సీత ఇద్దరూ అప్పుడే నవజీవన ప్రాంగణంలోకి అడుగు పెట్టిన ప్రేమికులు. పాత సాంప్రదాయాలను పట్టుకుని వేలాడే పెద్దవాళ్ళ అభ్యంతరాలను లెక్క చేయక తమకు తాముగా ఈ విశాలమైన ప్రపంచంలో స్వతంత్రంగా, స్వశక్తితో బ్రతకగలమన్న విశ్వాసంతో ఆ నగరంలోనికి అడుగు పెట్టారు. కానీ ఈ వ్యవస్థలో జీవితం పూలబాట కాదనీ, అనుక్షణం సమస్యల ముళ్ళే ఎదురౌతాయని చాలా ఆలస్యంగా గుర్తించారు ఆ యువదంపతులు!

విశ్వానికి ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. దగ్గరున్న డబ్బు మాత్రం వాళ్ళ ఆశల్లాగే క్షీణించసాగింది. వ్యయభారాన్ని తగ్గించడం కోసం వాళ్ళు పూరిగుడిసెల వాతావరణంలోకి చేరవలసి వచ్చింది.

విశ్వం తాను చూస్తున్న జీవితాన్ని, సమస్యలను నిజాయితీగా తన రచనలలో ప్రతిబింబిస్తూ రచయితగా ఈ సమాజంలో బ్రతకగలనని అనుకున్నాడు. కానీ ఎదురుదెబ్బ తినక తప్పలేదు. కష్టాలు ఎన్నైనా భరించవచ్చు - కానీ దహించే ఆకలిని ఎలా చల్లార్చడం అన్న పేద ప్రజల సమస్య వాళ్ళకూ ఎదురైంది. విశ్వం తన ఆశయాలకూ ఆదర్శాలకూ సమాధి కట్టవలసి వచ్చింది.

వాళ్ళచుట్టూ బతుకుతున్న వాళ్ళూ ఇలా సమస్యలతో జీవిత పోరాటాన్ని ఎంతోకాలంగా కొనసాగిస్తున్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. వితంతువైన జానకమ్మ బియ్యం వ్యాపారం చేస్తుంటే కల్యాణి వేశ్యగా బ్రతుకుతూంది. వాసూ అనే వాడు స్మగ్లర్. వీళ్ళంతా జీవితంలో దగాపడ్డవాళ్లే కానీ మొండిగా జీవించడానికి అలవాటు పడిపోయారు.

విశ్వానికి ఉన్నట్టుండి జబ్బు చేసింది. భర్త బ్రతకాలంటే మందులు కావాలి. కానీ వాళ్ళను ఆదుకోగల స్తోమత అక్కడ ఎవరికుంది? స్వయంవరం లో తానెన్నుకున్న జీవితం ఇలా పరిణమించేసరికి సీత కన్నీరు మున్నీరుగా విలపించింది. కానీ ఆమె ఆవేదన కన్నీళ్ళు విశ్వాన్ని బ్రతికించలేకపోయాయి.

ఇప్పుడామె ఎలా బ్రతకాలి? దగాపడిన ఆమె జీవితం - వాసు, కల్యాణి, జానకమ్మలలా ఇప్పుడు ఏ మార్గాన్ని అనుసరించాలి?

మన సమాజాన్ని ఇలా ప్రశ్నిస్తూ ఈ సినిమా ముగుస్తుంది.[2]

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగము లబ్దిదారుడు ఫలితం
1973 మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఉత్తమ దర్శకుడు అడూర్ గోపాలక్రిష్ణన్ ప్రతిపాదించబడింది
1973 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ చిత్రం స్వయంవరం గెలుపు
1973 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ నటి శారద గెలుపు
1973 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ దర్శకత్వం అడూర్ గోపాలక్రిష్ణన్ గెలుపు
1973 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం ఎం.రవివర్మ గెలుపు
1973 కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రాహకుడు ఎం.రవివర్మ గెలుపు
1973 కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ కళాదర్శకుడు దేవదత్తన్ గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "72 చిత్రాలకు జాతీయ బహుమతులు". విజయచిత్ర. 8 (3): 30. 1 September 1973.
  2. "స్వయంవరం". విజయచిత్ర. 8 (3): 45. 1 November 1973.

బయటి లింకులు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు