Jump to content

స్పెయిన్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
స్పెయిన్‌లోని మలాగా ప్రావిన్స్‌లోని బెనల్‌మదేనా లోని హిందూ దేవాలయం. దీన్ని 2001లో ప్రారంభించారు.

స్పెయిన్‌లో హిందూ మతం మైనారిటీ మతం.

చరిత్ర

[మార్చు]

20వ శతాబ్దం ప్రారంభంలో, సింధీలు గొప్ప ఆర్థిక అవకాశాల కోసం బ్రిటిష్ కాలనీ అయిన జిబ్రాల్టర్‌కు వచ్చారు. అక్కడ నుండి వారు ఉత్తర ఆఫ్రికాలోని స్పానిష్ భూభాగాలైన సియుటా, మెలిల్లాకు వెళ్లారు. చివరికి ఇతర నగరాలు, ద్వీపాలకు విస్తరించారు. [1] రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్పెయిన్‌లో దిగుమతుల పైన, విదేశీ మారకం పైనా ఆంక్షలు విధించిన తరువాత, సింధీ వ్యాపారులు, దుకాణదారులు స్పానిష్ కానరీ దీవులు గ్రాన్ కానరియా లోని ఫ్రీపోర్ట్‌లలో అభివృద్ధి చెందారు. వారు లాస్ పాల్మాస్ నుండి ఉత్తర ఆఫ్రికా ఖండంతో చురుకైన వాణిజ్యాన్ని నిర్వహించారు. సియుటా, మెలిల్లా లను కూడా ఉచిత ఓడరేవులుగా ప్రకటించినప్పుడు, భారతీయ వ్యాపారవేత్తలు అక్కడ వర్తక గృహాలు, రిటైల్ దుకాణాలను స్థాపించారు. [1]

హిందూ సమాజం

[మార్చు]

స్పెయిన్‌లో దాదాపు 40,000 [2] -50,000 మంది హిందువులున్నారు. వీరిలో భారతదేశం నుండి దాదాపు 25,000 మంది, తూర్పు ఐరోపా, లాటిన్ అమెరికా నుండి 5,000 మంది, స్పానిష్‌లు 10,000 మందీ ఉన్నారు. నేపాల్ (సుమారు 200), బంగ్లాదేశ్ (సుమారు 500) నుండి వచ్చిన చిన్న హిందూ సంఘాలు కూడా ఉన్నాయి. [3] భారతీయ సంఘంలో దాదాపు 30,000 మంది ఉంటారు. ఇది జనాభాలో 0.04%.

కాటలోనియా

[మార్చు]

2014 నాటికి కాటలోనియాలో 27 హిందూ దేవాలయాలు లేదా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 14 బార్సిలోనా ప్రావిన్స్‌లో ఉన్నాయి. హిందూమతస్థుల్లో ఎక్కువ మంది భారతీయ వలసదారులే. గణనీయమైన సంఖ్యలో మతం మారిన కాటలాన్‌లు కూడా ఉన్నారు. నిజానికి, అత్యధిక సంఖ్యలో హిందూ దేవాలయాలు తమ సేవలను కాటలాన్ లేదా స్పానిష్ భాష లోనే నిర్వహిస్తాయి. [4] [5] కాటలోనియా లోని హిందువులు వివిధ రకాల ఆరాధనా సంప్రదాయాలను అనుసరిస్తారు. [6]

కానరీ ద్వీపాలు

[మార్చు]

స్పెయిన్‌కు చెందిన కానరీ దీవుల్లో హిందువులు 0.5% ఉన్నారు. [7] స్పెయిన్‌ లోని దాదాపు సగం మంది హిందువులు కానరీ దీవుల్లోనే నివసిస్తున్నారు. గణేష్ చతుర్థిని సామూహికంగా జరుపుకునే యూరప్‌లోని కొన్ని ప్రదేశాలలో టెనెరిఫ్ ఒకటి.

మెలిల్లా

[మార్చు]

స్పెయిన్‌కు చెందిన మెలిల్లాలో కొద్దిమంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. 19వ శతాబ్దం చివరలో మెలిల్లా ఉచిత ఓడరేవుగా మారినప్పుడు, అనేక మంది భారతీయులు వాణిజ్యం కోసం ఈ నగరానికి వచ్చారు. కాల్ల్ కాస్టెలర్‌పై హిందూ ప్రసంగం అనేది ఈ సంఘపు మత, సాంస్కృతిక కేంద్ర బిందువు. [8] అయితే, మంచి ఉద్యోగాల కోసం ప్రజలు వలస పోవడం కారణంగా, ఇక్కడి హిందూ సమాజంలో ఇప్పుడు 100 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. [9]

సియుటా

[మార్చు]
సియుటాలోని మొదటి, ఏకైక హిందూ దేవాలయం. దీన్ని 2007లో నిర్మించారు

స్పెయిన్ భూభాగమైన సియుటాలో దాదాపు 500 మంది హిందువులు నివసిస్తున్నారు. [10] [11] హిందువులు 1893 నుండి సియుటాలో వ్యాపారులుగా, జిబ్రాల్టర్‌తో అనుసంధానించబడిన వ్యక్తులుగా నివసిస్తున్నారు. వారు బజార్ ఎల్ ఇండియోను స్థాపించారు. తరువాత కుటుంబ సమేతంగా సియుటాలో స్థిరపడ్డారు. 1947 లో మరింత మంది హిందువులు సియూటా వచ్చారు. [12] 1948లో, హిందూ వర్తకుల సంఘాన్ని స్థాపించారు. ఇది స్పెయిన్‌లో మొదటి హిందూ సంఘం. 1997లో సంస్థ పేరును కమునిడాడ్ హిందూ డి సియుటాగా మార్చారు. [13] [14] సియూటాలో మొదటి హిందూ మతం ఆలయాన్ని 2007 లో నిర్మించారు [15] జువాన్ కార్లోస్ రంచాందని కృషితో 2007 అక్టోబరు 22 న ఇది ప్రారంభమైంది. [16] 2006 లో పూర్తయిన ఒక హిందూ శ్మశానం కూడా ఉంది. [17] సియుటాలోని హిందువులందరూ సింధీ మూలానికి చెందినవారు.

స్పెయిన్‌లోని హిందూ దేవాలయాలు

[మార్చు]

స్పెయిన్‌లో దాదాపు 40 హిందూ దేవాలయాలు/ఆరాధన స్థలాలు ఉన్నాయి. సియుటా నగరంలో మొదటి హిందూ దేవాలయం 2007లో పూర్తయింది. బార్సిలోనాలోని కృష్ణ రెస్టారెంట్‌తో పాటు బార్సిలోనా, మాడ్రిడ్, మలాగా, టెనెరిఫ్, బృహూగాలో ఇస్కాన్ వారి కృష్ణ దేవాలయాలు ఉన్నాయి. [18]

స్పెయిన్‌లోని హిందూ సంఘాలు

[మార్చు]

ఫెడరేషన్ హిందు డి ఎస్పానా (FHE)

[మార్చు]

FHE 2017లో ఏర్పడింది. హిందువులను ఏకం చేయడం, హిందూ మతాన్ని ప్రోత్సహించడం, రక్షించడం దీని లక్ష్యాలు. ఇది హిందూ మతం గురించి తప్పుగా చేసిన వ్యాఖ్యానాలను, ఉల్లేఖనలనూ సవాలు చేయడానికి, సరిదిద్దడానికీ కూడా ప్రయత్నిస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Feature: The Hindu Diaspora within Continental Europe". January 2014.
  2. "Presentación de la Federación Hindú de España | Yoga en Red". 23 June 2016.
  3. "Feature: The Hindu Diaspora within Continental Europe". January 2014.
  4. "Hinduisme — Mapa Religiós de Catalunya" (PDF). Government of Catalonia, Department of Governance and Institutional Relations, General Direction of Religious Affairs. 2014. Archived from the original (PDF) on 27 September 2017.
  5. ISOR researchers 2014, pp. 98–100.
  6. ISOR researchers 2014, p. 97.
  7. http://www.observatorioreligion.es/upload/80/39/Pdfd_interactivo_Canarias.pdf
  8. "Melilla: Where Catalan "Modernisme" Meets North Africa". 19 September 2013.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-02-02. Retrieved 2022-01-14.
  10. Bárbulo, Tomás (21 March 2009). "Resistir en el monte del Renegado". El País.
  11. "Los hindúes de Ceuta ya tienen su templo". 23 October 2007.
  12. https://www.pluralismoyconvivencia.es/wp-content/uploads/2018/12/Minor%C3%ADas-religiosas-en-Ceuta-y-en-Melilla.pdf
  13. Tarrés, Sol (January 2013). "Los hindúes en Ceuta". Briones, Tarres y Salguero: Encuentros, Diversidad Religiosa en Ceuta y en Melilla.
  14. "Las cuatro comunidades religiosas de Ceuta ya cuentan con su propio templo tras la inauguración oficial del hindú". 26 October 2007.
  15. "Templo Comunidad Indú. Ceuta | Obras y proyectos de Arquitectura religiosa | Andrés Ruiz Manrique | Arquitecto".
  16. "Los hindúes de Ceuta ya tienen su templo". 23 October 2007.
  17. https://www.pluralismoyconvivencia.es/wp-content/uploads/2018/12/Minor%C3%ADas-religiosas-en-Ceuta-y-en-Melilla.pdf
  18. "Hare Krishna Temples Around the World". Stephen-knapp.com. Retrieved 2012-01-22.