స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
స్వరూపం
(స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ నుండి దారిమార్పు చెందింది)
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్ (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యండమూరి వీరేంద్రనాధ్ |
---|---|
చిత్రానువాదం | పరుచూరి సోదరులు |
తారాగణం | చిరంజీవి, నీరోష, విజయశాంతి |
సంగీతం | ఇళయరాజా |
సంభాషణలు | ఎం.వి.ఎస్.హరనాథరావు |
ఛాయాగ్రహణం | లోక్ సింగ్ |
కూర్పు | వెళ్ళైస్వామి |
నిర్మాణ సంస్థ | క్రియెటివ్ కమర్షియల్స్ |
భాష | తెలుగు |
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్ 1991 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వం వహించాడు. చిరంజీవి, విజయశాంతి, నిరోషా ప్రధాన పాత్రల్లో నటించారు. కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ ప్రధాన విలన్‌గా నటించాడు.[1]
కథ
[మార్చు]ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ ( చిరంజీవి ) ను స్టూవర్టుపురం పోలీస్ స్టేషనులో పోస్టు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్టూవర్ట్‌పురం, దోపిడీలు, దొంగతనాలు, రాజకీయ అవినీతితో అపఖ్యాతి పాలైన ప్రదేశం. గ్రామంలో పెద్ద ఎత్తున జరిగిన ఆభరణాల దోపిడీ రహస్యాన్ని ఛేదించే పని రాణా ప్రతాప్ కు కేటాయించారు. రాణా ప్రతాప్ ఈ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతాడు. నగల దోపిడీ వెనుక సూత్రధారి అయిన మాఫియా నాయకుడిని ( శరత్ కుమార్ ) పట్టుకుంటాడు
తారాగణం
[మార్చు]- రాణా ప్రతాప్‌గా చిరంజీవి
- విజయశాంతి
- నిరోషా
- శరత్ కుమార్
- సుధాకర్
- కైకాల సత్యనారాయణ
- బ్రహ్మానందం
- కోట శ్రీనివాసరావు
- గొల్లపూడి మారుతీరావు
- మోహన్ రాజ్
- బాబు మోహన్
- జ్యోతి
- మోహన్ రాజ్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:
సం. | పాట | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "జిందాబాద్" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:46 |
2. | "ఫెంటాస్టిక్" | మనో, కె.ఎస్.చిత్ర | 5:27 |
3. | "బలేగా ఉంది" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 5:03 |
4. | "ఇద్దరతివల" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, ఎస్. జానకి | 5:12 |
5. | "చీకటంటే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | 4:56 |
6. | "నీతోనే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 5:09 |
మూలాలు
[మార్చు]- ↑ "Wordsmith and a guru of gyaan". The Hindu. 6 June 2009. Archived from the original on 26 జనవరి 2013. Retrieved 8 October 2012.