స్కాట్ ఎడ్వర్డ్స్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | స్కాట్ ఆండ్రూ ఎడ్వర్డ్స్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | టోంగా | 1996 ఆగస్టు 23|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపరు | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 62) | 2018 ఆగస్టు 1 - నేపాల్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 జూన్ 30 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 35 | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 39) | 2018 జూన్ 12 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 నవంబరు 6 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 35 | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 11 July 2023 |
స్కాట్ ఆండ్రూ ఎడ్వర్డ్స్ (జననం 1996 ఆగస్టు 23) నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియన్-డచ్ క్రికెటరు. [1] [2] అతను 2017 నవంబరు 29న 2015–17 ICC ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో నమీబియాపై నెదర్లాండ్స్ తరపున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు.[3] 2017 డిసెంబరు 8న 2015–17 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లో నమీబియాపై నెదర్లాండ్స్ తరపున తన తొలి లిస్ట్ A లో ప్రవేశించాడు.[4] పీటర్ సీలార్ దీర్ఘకాల వెన్నునొప్పి కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు పదవీ విరమణ చేయవలసి వచ్చినపుడు, 2022 జూన్‌లో, ఎడ్వర్డ్స్ డచ్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[5] [6] ఎడ్వర్డ్స్ నెదర్లాండ్స్ జట్టుకు ఏడో వన్డే కెప్టెన్. [7]
ప్రారంభ దేశీయ కెరీర్
[మార్చు]ఎడ్వర్డ్స్ టోంగాలో జన్మించాడు. కానీ, ఆ సమయంలో అతని తండ్రి పని చేస్తున్న ఆస్ట్రేలియాలో పెరిగాడు. ఎమ్మాస్ కాలేజీలో చదువుకున్నాడు. డచ్ అమ్మమ్మ ద్వారా నెదర్లాండ్స్‌కు అర్హత సాధించాడు. అతనికి ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ల ద్వంద్వ పౌరసత్వం ఉంది. ఆస్ట్రేలియాలో అతను విక్టోరియన్ ప్రీమియర్ క్రికెట్‌లో రిచ్‌మండ్ కోసం క్లబ్ క్రికెట్ ఆడాడు. అంతకు ముందు బ్లాక్‌బర్న్ సౌత్ క్రికెట్ క్లబ్, హైటన్ క్రికెట్ క్లబ్ కోసం కూడా ఆడాడు. డచ్ క్లబ్ క్రికెట్‌లో అతను ఎక్సెల్సియర్ '20 కోసం ఆడాడు. ఈ కాలంలో, ఎడ్వర్డ్స్ మాజీ ఆస్ట్రేలియన్ వికెట్-కీపర్ ర్యాన్ కాంప్‌బెల్‌తో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ తరువాత క్యాంప్‌బెల్, 2017లో నెదర్లాండ్స్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ అయ్యాడు.[8] ఎడ్వర్డ్స్, వృత్తిపరంగా క్రికెట్ ఆడటానికి ముందు ఎలక్ట్రికల్ అప్రెంటిస్. [9] అతను "నిజాయితీగా చెబుతున్నా.., ఇది చాలా అధివాస్తవికంగా ఉంది. అప్రెంటిస్‌గా జీవితాన్ని గడుపుతున్న నాకు, అకస్మాత్తుగా క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్‌లకు వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాను - ఇది చాలా ఉత్తేజకరంగా ఉంది".[9]
2019 జూలైలో, అతను యూరో T20 స్లామ్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభ ఎడిషన్‌లో రోటర్‌డామ్ రైనోస్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు. [10] [11] అయితే, మరుసటి నెలలో ఆ టోర్నీని రద్దు చేసారు. [12]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2018 జూన్‌లో ఎడ్వర్డ్స్, 2018 నెదర్లాండ్స్ ట్రై-నేషన్ సిరీస్ కోసం నెదర్లాండ్స్ ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికై,[13] 2018 జూన్ 12న ఐర్లాండ్‌పై T20I రంగప్రవేశం చేసాడు [14]
నేపాల్‌తో జరిగిన సిరీస్ కోసం 2018 జూలైలో నెదర్లాండ్స్ వన్డే ఇంటర్నేషనల్ జట్టుకు ఎంపికయ్యాడు. [15] 2018 ఆగస్టు 1న నేపాల్‌పై తన తొలి వన్‌డే ఆడాడు.[16]
2019 జూలైలో, 2019 యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో ఎడ్వర్డ్స్, 39 బంతుల్లో 137 నాటౌట్‌తో వేగవంతమైన T10 సెంచరీ, అత్యధిక వ్యక్తిగత T10 స్కోరు కోసం ప్రపంచ రికార్డు సాధించాడు.[17] 2019 సెప్టెంబరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన 2019 ICC T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటులో డచ్ జట్టుకు అతను ఎంపికయ్యాడు. [18] టోర్నమెంటుకు ముందు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అతనిని డచ్ జట్టులో గమనించవలసిన ఆటగాడిగా పేర్కొంది. [19] 2020 ఏప్రిల్లో, అతను జట్టులో పేరు పొందిన పదిహేడు మంది డచ్-ఆధారిత క్రికెటర్లలో ఒకడు. [20] మరుసటి నెలలో, ఐర్లాండ్ వోల్వ్స్‌తో జరిగే మ్యాచ్‌లకు ముందు నెదర్లాండ్స్ A జట్టుకు ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [21] 2021 సెప్టెంబరులో ఎడ్వర్డ్స్, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం డచ్ జట్టులో ఎంపికయ్యాడు. [22]
2022 జూన్‌లో ఆమ్‌స్టర్‌డామ్‌లోని VRA గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌పై వరుసగా మూడు వన్‌డే అర్ధ శతకాలు సాధించాడు. [23]
2022 జూలైలో, ICC పురుషుల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ సెమీ-ఫైనల్‌లో నెదర్లాండ్స్ USAని ఓడించింది. 2022లో ఆస్ట్రేలియాలో జరిగే ICC పురుషుల T20 ప్రపంచకప్‌లో రౌండ్ 1కి పంపింది. [24]
వ్యక్తిగత జీవితం
[మార్చు]2022లో, ఎడ్వర్డ్స్ డీకిన్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ (స్పోర్ట్ మేనేజ్‌మెంట్) చదువుతున్నాడు. [25]
మూలాలు
[మార్చు]- ↑ "Scott Edwards". ESPN Cricinfo. Retrieved 29 November 2017.
- ↑ "Scott Edwards". CricX. Retrieved 29 November 2017.
- ↑ "ICC Intercontinental Cup at Dubai, Nov 29-Dec 2 2017". ESPN Cricinfo. Retrieved 29 November 2017.
- ↑ "55th Match, ICC World Cricket League Championship at Dubai, Dec 8 2017". ESPN Cricinfo. Retrieved 8 December 2017.
- ↑ "Pieter Seelaar announces retirement due to persistent back injury". ESPN Cricinfo. Retrieved 19 June 2022.
- ↑ "Captain Pieter Seelaar announces his retirement from international cricket due to persistent back injury". Royal Dutch Cricket Association. Retrieved 19 June 2022.
- ↑ Roller, Matt (21 June 2022). "Scott Edwards takes Netherlands captaincy in his stride after mid-series coronation".
- ↑ Paynter, Jack (7 July 2022). "Best-kept secret: The Dutch's high-flying Aussie import".
- ↑ 9.0 9.1 "ICC World Cup Qualifiers: Monash Tigers wicketkeeper Scott Edwards reflects on rise to international cricket". Herald Sun. Retrieved 14 August 2018.
- ↑ "Eoin Morgan to represent Dublin franchise in inaugural Euro T20 Slam". ESPN Cricinfo. Retrieved 19 July 2019.
- ↑ "Euro T20 Slam Player Draft completed". Cricket Europe. Archived from the original on 19 జూలై 2019. Retrieved 19 July 2019.
- ↑ "Inaugural Euro T20 Slam cancelled at two weeks' notice". ESPN Cricinfo. Retrieved 14 August 2019.
- ↑ "Three new faces as Netherlands begin post-Borren era". ESPN Cricinfo. Retrieved 7 June 2018.
- ↑ "1st Match, Netherlands Tri-Nation T20I Series at Rotterdam, Jun 12 2018". ESPN Cricinfo. Retrieved 12 June 2018.
- ↑ "Selecties Nederlands XI voor Lord's en Nepal". KNCB. Retrieved 23 July 2018.
- ↑ "1st ODI, Nepal tour of England and Netherlands at Amstelveen, Aug 1 2018". ESPN Cricinfo. Retrieved 1 August 2018.
- ↑ "European Cricket Family – Q & A with World Record Holder Scott Edwards". European Cricket Network. 10 April 2020.
- ↑ "Ryan Campbell announces squad for T20 World Cup Qualifier". Royal Dutch Cricket Association. Retrieved 8 September 2019.
- ↑ "Team preview: Netherlands". International Cricket Council. Retrieved 16 October 2019.
- ↑ "Dutch men's squads announced". Cricket Europe. Archived from the original on 25 ఫిబ్రవరి 2021. Retrieved 6 May 2020.
- ↑ "Netherlands A: Scott Edwards to lead in Ireland". Emerging Cricket. Retrieved 4 May 2021.
- ↑ "Dutch ICC Men's T20 World Cup squad announced". Royal Dutch Cricket Association. Retrieved 10 September 2021.
- ↑ Lyall, Rod (20 June 2022). "Scott Edwards again stands out, but England still too strong".
- ↑ (Podcast) Scott Edwards: "ODI Cricket still the benchmark for Associates" (in ఇంగ్లీష్), retrieved 2022-09-23
- ↑ "Elite Athlete Program Profiles". Deakin University. Retrieved 13 March 2022.