సోమేపల్లి సాంబయ్య
సోమేపల్లి సాంబయ్య | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1994 - 1999 | |||
ముందు | కందిమల్ల జయమ్మ | ||
---|---|---|---|
తరువాత | పత్తిపాటి పుల్లారావు | ||
పదవీ కాలం 1985 – 1989 | |||
ముందు | ఖాజా కృష్ణ మూర్తి | ||
తరువాత | కందిమల్ల జయమ్మ | ||
నియోజకవర్గం | చిలకలూరిపేట నియోజకవర్గం | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1978 – 1983 | |||
ముందు | బొబ్బిలి సత్యనారాయణ | ||
తరువాత | ఖాజా కృష్ణ మూర్తి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
మరణం | జనవరి 2000 | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
బంధువులు | మర్రి రాజశేఖర్ (మేనల్లుడు)[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సోమేపల్లి సాంబయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు.[2]
రాజకీయత జీవితం
[మార్చు]సోమేపల్లి సాంబయ్య ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయన రాజకీయాల పట్ల ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి 1967లో చిలకలూరిపేట మండలంలోని తాతపూడి గ్రామానికి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. ఆయన ఆ తరువాత తాతపూడి గ్రామ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షునిగా పని చేశాడు. సోమేపల్లి సాంబయ్య భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి భీమిరెడ్డి సుబ్బారెడ్డిపై 17,463 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1983 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కృష్ణమూర్తి ఖాజా చేతిలో 24,666 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
సోమేపల్లి సాంబయ్య 1985 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మానం వెంకటేశ్వర్లుపై 4,878 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 1989 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండిమల్ల జయమ్మ చేతిలో 949 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
సోమేపల్లి సాంబయ్య 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాలెంపాటి వెంకట నరసింహారావుపై 131 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 1999 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు చేతిలో 26,241 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ "తొలిసారి కొందరు.. అదృష్టం వరించి మరికొందరు." Eenadu. 24 March 2023. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.
- ↑ "Chilakaluripet sent educated leaders to Assembly" (in ఇంగ్లీష్). The Hans India. 27 December 2023. Retrieved 20 March 2025.
- ↑ "1978 శాసనసభ ఎన్నికలు-సామాజికవర్గాల విశ్లేషణ". Sakshi. 6 March 2024. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.
- ↑ "1985 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ". Sakshi. 7 March 2024. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.
- ↑ "1994 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ". Sakshi. 8 March 2024. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.