సోమయాజులు
స్వరూపం
సోమయాజులు తెలుగు వారిలో కొందరి పేరు.
- జె.వి. సోమయాజులు,: తెలుగుప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర వంటి మాధ్యమాలన్నింటిలో నటించాడు. అతను పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు.
- చాగంటి సోమయాజులు : ప్రముఖ తెలుగు రచయిత. చాసోగా అందరికీ సుపరిచితుడు. ఈయన మొట్ట మొదటి రచన చిన్నాజీ 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసే కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు ప్రధానంగా ఉంటాయి.
- వావిలాల సోమయాజులు: తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు.[1].
- బి.ఎల్.కె. సోమయాజులు : భమిడిపాటి లక్ష్మీధర కనకాద్రి సోమయాజులు (1937-2016) ఒక భారతీయ జియోకెమిస్ట్ , అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో సిఎస్ఐఆర్ ఎమెరిటస్ సైంటిస్ట్. [2]
- బులుసు సోమయాజులు : ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు.
- అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి : ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు.
మూలాలు
[మార్చు]- ↑ వావిలాల_సోమయాజులు_సాహిత్యం-1. వికీసోర్స్.
- ↑ "AMS programme at IOP, Bhubaneswar". Institute of Physics. 2016.