Jump to content

సోంపల్లి సంపత్ కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
సోంపల్లి సంపత్ కృష్ణమూర్తి
జననంసోంపల్లి సంపత్ కృష్ణమూర్తి
1913
కొక్కంటి, తనకల్లు మండలం, శ్రీ సత్యసాయి జిల్లా
మరణం1969, జనవరి 29
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిపండితుడు, కవి, శతావధాని
మతంహిందూ
తండ్రిచంపార్యుడు
తల్లిమంగాంబ

సోంపల్లి సంపత్ కృష్ణమూర్తి (1913 - 1969, జనవరి 29)[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంస్కృత పండితుడు, కవి, శతావధాని.[2]

జననం, కుటుంబం

[మార్చు]

సంపత్ కృష్ణమూర్తి 1913లో శ్రీ సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం, కొక్కంటి గ్రామంలో జన్మించాడు. తల్లి మంగాంబ, తండ్రి చంపార్యుడు.[2] ఇతను హిందూ బ్రాహ్మణ స్మార్త కులానికి చెందినవాడు.

విద్యాభ్యాసం

[మార్చు]

విద్వాన్ కవిసార్వభౌమ, అభినవ బాణకవి, ఆశుకవి చక్రవర్తి, శతావధాని గౌరావజల రామకృష్ణ సీతారామ సోదరకవులు వద్ద సంపత్ కృష్ణమూర్తి విద్యాభ్యాసం చేశాడు. విశ్వకళాశాల వారి విద్వత్పరీక్షలో ఉత్తీర్ణులై సంస్కృతాంధ్ర భాషలలో పాండిత్యాన్ని సంపాదించాడు.[3]

ఉద్యోగం

[మార్చు]

సంపత్ కృష్ణమూర్తి 1941 నుండి కదిరి ఉన్నత పాఠశాలలో ప్రధానాంధ్ర పండితులుగా పనిచేశాడు.[3]

రచనలు

[మార్చు]

సంపత్ కృష్ణమూర్తి అనేక గ్రంథాలను రచించాడు. వాటిలో కొన్ని ముద్రితమైనవి, కొన్ని అముద్రితంగా ఉన్నాయి.[3]

ముద్రితాలు

[మార్చు]
  • భక్త రక్షామణి (పద్యశతము)
  • ఆపదుద్ధారక స్తోత్రము
  • వాసవీ విలాసాభి రూపకము (నాటకం)
  • మల్లికార్జున దైవవినుతి
  • రామాస్త్రము
  • పుష్ప విలాసము
  • కవితానంద వాల్మీకి రామాయణము (2 సంపుటాలు, 1940)

అముద్రితాలు

[మార్చు]
  • సతీతిలక (నవల)
  • ఆంధ్ర వ్యాకరణ వివరణము
  • శంకర విజయము (హరికథ ముద్రణం)
  • ఆంధ్ర సూర్య శతక టీక
  • దైవజ్ఞ భూషణము
  • సత్యనారాయణ వాచకములు (ఐదు)
  • కొక్కంటి పాళెగారి చరిత్ర కావ్యపరిచయము[4]

మరణం

[మార్చు]

సంపత్ కృష్ణమూర్తి 1969, జనవరి 29న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. రాయలసీమ రచయితల చరిత్ర మొదటి సంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. 2.0 2.1 కల్లూరు అహోబలరావు (1975-07-01). రాయలసీమ రచయితల చరిత్ర (మొదటి సంపుటం).
  3. 3.0 3.1 3.2 కల్లూరు అహోబలరావు (1975-07-01). రాయలసీమ రచయితల చరిత్ర (మొదటి సంపుటం).
  4. కల్లూరు అహోబలరావు (1975-07-01). రాయలసీమ రచయితల చరిత్ర (మొదటి సంపుటం).

ఇతర లింకులు

[మార్చు]