Jump to content

సెర్గీ బుబ్కా

వికీపీడియా నుండి
సెర్గీ బుబ్కా
2013 లో సెర్గీ బుబ్కా
వ్యక్తిగత సమాచారం
స్థానికంగా పేరుСергій Назарович Бубка
పూర్తిపేరుసెర్గీ నజరోవిచ్ బుబ్కా
జాతీయతఉక్రేనియన్
జననం (1963-12-04) 1963 డిసెంబరు 4 (వయసు 61)
లుహాన్స్క్, ఉక్రెయిన్
విద్యపెడగాగీ లో పిహెచ్‌డి
ఆల్మా మ్యాటర్ఉక్రేనియన్ అకాడమీ ఆఫ్ పెడగాగికల్ సైన్స్, కియెవ్ స్టేట్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ కల్చర్
క్రియాశీల సంవత్సరాలు1981–2001
ఎత్తు1.83 మీ. (6 అ. 0 అం.)
బరువు80 కి.గ్రా. (176 పౌ.)
Chair of the NOC of Ukraine
Assumed office
23 June 2005[1]
అంతకు ముందు వారుViktor Yanukovych
క్రీడ
దేశం Soviet Union (1981–1991)
 Ukraine (1991–2001)
క్రీడట్రాక్ అండ్ ఫీల్డ్
పోటీ(లు)పోల్ వాల్ట్
Turned pro1981
కోచ్విటాలీ పెట్రోవ్ (తొలి కోచ్)
రిటైరైనది2001
Updated on 2012 సెప్టెంబరు 8.

సెర్గీ నజరోవిచ్ బుబ్కా [2] (జననం 1963 డిసెంబరు 4) మాజీ ఉక్రేనియన్ పోల్ వాల్ట్ క్రీడాకారుడు. 1991 లో సోవియట్ యూనియన్ పతనమయ్యే వరకు బుబ్కా దానికి ప్రాతినిధ్యం వహించాడు. ట్రాక్ & ఫీల్డ్ న్యూస్ బుబ్కాను రెండుసార్లు అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది.[3] 2012 లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ వారి హాల్ ఆఫ్ ఫేమ్‌లో ప్రారంభ సభ్యులైన 24 మంది అథ్లెట్లలో అతనొకడు.[4]

బుబ్కా వరుసగా ఆరు IAAF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను, ఒక ఒలింపిక్ బంగారు పతకాన్నీ గెలుచుకున్నాడు. పురుషుల పోల్ వాల్ట్‌ క్రీడలో 35 సార్లు ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు.[5] అతను 6.0 మీటర్లు, 6.10 మీటర్ల ఎత్తును దూకిన మొట్టమొదటి పోల్ వాల్ట్ క్రీడాకారుడు.[6][7]

1993 ఫిబ్రవరి 21 న ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్‌లో నెలకొల్పిన 6.15 మీటర్ల ఇన్‌డోర్ ప్రపంచ రికార్డు 20 ఏళ్ళకు పైగా అతడి పేరిటే ఉంది.[8] ఫ్రాన్స్‌కు చెందిన రేనాడ్ లావిల్లెని 2014 ఫిబ్రవరి 15 న 6.16 మీటర్లు దూకినపుడు ఆ రికార్డు బద్దలైంది.[9] 1994 జూలై 31 న అతడు నెలకొల్పిన 6.14 మీటర్ల ఔట్‌డోర్ ప్రపంచ రికార్డు 2020 సెప్టెంబరు నాటికి ఇంకా అతడి పేరిటే ఉంది.[10] కానీ, 2000 లో 260.18 ఎ నియమాన్ని స్వీకరించినప్పటి నుండి IAAF లావిల్లెనీ రికార్డునే అధికారిక "ప్రపంచ రికార్డు"గా పరిగణిస్తున్నారు.[11]

బుబ్కా, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ (IAAF) కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా 2007 నుండి పనిచేస్తున్నాడు. 2005 నుండి ఉక్రెయిన్ జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు. 1996 నుండి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) లో గౌరవ సభ్యుడుగా ఉన్నాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

బుబ్కా ఉక్రెయిన్ లోని లుహాన్స్క్ లో జన్మించాడు. 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ లలో పాల్గొన్న ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారుడతడు. కానీ పోల్ వాల్ట్ క్రీడను ఎంచుకున్న తరువాతనే అతడు ప్రపంచ స్థాయి విజేత అయ్యాడు. 1983 లో, అంతర్జాతీయంగా పెద్దగా పేరులేని బుబ్కా, ఫిన్లాండ్‌లోని హెల్సింకీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. మరుసటి సంవత్సరం 5.85 మీటర్లు దూకి తన మొట్టమొదటి ప్రపంచ రికార్డును సృష్టించాడు. 1991 చివరలో సోవియట్ యూనియన్ అస్తమించే వరకు బుబ్కా, సోవియట్ జట్ల తరపున ఆడాడు. సోవియట్ క్రీడా వ్యవస్థ, కొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పినందుకు అథ్లెట్లకు బహుమతులు ఇస్తూండేది. కొద్దిపాటి తేడాతో కొత్త కొత్త రికార్డులు సృష్టించడంలో బిఉబ్కా పేరుపొందాడు. అతడి రికార్డులు కొన్నిసార్లు సెంటీమీటరు తేడాలో ఉండేవి. దీంతో అతడు ఎక్కువగా బోనసులు అందుకుంటూండేవాడు. ట్రాక్-అండ్-ఫీల్డ్ పోటీల్లో బుబ్కా పెద్ద ఆకర్షణ అయ్యాడు. సోవియట్ పతనంతో, 1992 నుండి అతడు సోవియట్ వ్యవస్థకు కట్టుబడి ఉండాల్సిన పని లేఖుండా పోయింది. దాంతో అతడు నైకి [12]తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం అతడు నెలకొల్పిన ప్రతీ కొత్త ప్రపంచ రికార్డుకూ $40,000 ప్రత్యేక బోనసులు లభించేవి.[13]

అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు. అతని పేరు కూడా సెర్గీయే.

పోల్ వాల్ట్ జీవితం

[మార్చు]

సెర్గీ బుబ్కా 1981 లో యూరోపియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌ పోటీలతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. అందులో అతడు ఏడవ స్థానంలో నిలిచాడు. అయితే 1983 లో హెల్సింకీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రపంచ అథ్లెటిక్స్‌ లోకి అతడి అసలు ప్రవేశమని చెప్పవచ్చు. అప్పటికి పెద్దగా పేరులేని బుబ్కా 5.70 మీటర్లు దూకి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక ఆ తరువాతి సంవత్సరాల్లో బుబ్కా, పోల్‌వాల్ట్‌పై అనుపమానమైన ఆధిపత్యాన్ని సాధించాడు. పోల్ వాల్ట్‌‌లో అనేక కొత్త రికార్డులు సాధించి, ఎప్పటికప్పుడు సమున్నత ప్రమాణాలను నెలకొల్పుతూ పోయాడు.

అతను 1984 మే 26 న 5.85 మీటర్లు దూకి మొదటి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఒక్క వారం తరువాతనే 5.88 మీటర్లు దూకాడు. మరొక నెల తరువాత 5.90 మీటర్లు దూకి తన రికార్డును తానే మెరుగుపరచాడు. 1985 జూలై 13 న పారిస్‌లో 6.00 మీటర్లు లంఘించి, మొట్టమొదటిసారిగా ఆ ఘనత సాధించినవాడయ్యాడు.[7] ఈ ఎత్తు దూకడం అసాధ్యమని చాలాకాలం పాటు పరిగణించారు. తరువాతి పదేళ్ళు ప్రత్యర్థి అనేవారే లేకుండా బుబ్కా, తన రికార్డులను తానే అధిగమించుకుంటూ పోయాడు. ఈ క్రమంలో 1994 లో, తన కెరీర్లో అత్యుత్తమమైనదీ, ప్రపంచరికార్డూ అయిన 6.14 మీటర్లను సాధించాడు. తన వృత్తి జీవితంలో బుబ్కా ప్రధానంగా UCS స్పిరిట్ పోల్‌లనే వాడాడు.[14][15]

1991 లో బుబ్కా, స్పెయిన్లోని శాన్ సెబాస్టియన్లో 6.10 మీటర్లకు పైగా దూకి ఆ ఘనత సాధించిన మొట్ట మొదటి అథ్లెట్ అయ్యాడు. 2014 జనవరి వరకు, మరే ఇతర అథ్లెట్ కూడా - ఇంటి లోపల గానీ, ఆరుబయట గానీ - 6.07 మీటర్లు దూకలేదు. 1994 లో, ఈ గొప్ప క్రీడాకారుడు ఇక రిటైరయినట్టేనని చాలా మంది అనుకున్న సమయంలో, బుబ్కా 6.14 మీటర్లు దూకి తన వ్యక్తిగత రికార్డును మెరుగుపరచుకున్నాడు. 1984 - 1988 మధ్య కాలంలో బుబ్కా ప్రపంచ రికార్డును 21 సెంటీమీటర్లు పెంచాడు. అంతకు ముందరి 12 సంవత్సరాలలో ఇతర పోల్ వాల్టర్లు సాధించిన దానికంటే ఇది ఎక్కువ. 45 సందర్భాలలో బుబ్కా 6.00 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూకాడు.[16] 2015 జూన్ నాటికి, ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లందరూ కలిసి సరిగ్గా 100 సార్లు 6 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూకారు.[17]

2001 లో దోనెట్స్క్‌లో జరిగిన పోల్ వాల్ట్ తారల సమావేశంలో జరిగిన ఉత్సవంలో బుబ్కా అధికారికంగా పోల్ వాల్ట్ నుండి రిటైరయ్యాడు.[18]

ఒలింపిక్స్ శాపం

[మార్చు]

పోల్ వాల్ట్‌లో అతడికి ఎంత ఆధిపత్యం ఉన్నప్పటికీ, ఒలింపిక్ క్రీడలలో మాత్రం బుబ్కాది పేలవమైన రికార్డేనని చెప్పాలి. అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ లోకి అడుగుపెట్టాక, 1984 లో జరిగిన ఒలింపిక్స్ బుబ్కాకు మొదటివి. ఈ క్రీడలను సోవియట్ యూనియన్, ఇతర తూర్పు బ్లాక్ దేశాలు బహిష్కరించాయి. ఆ ఒలింపిక్స్‌లో బంగారు పతకం పొందిన పియరీ క్వినాన్ కంటే, అంతకు రెండు నెలల ముందు జరిగిన పోటీల్లో బుబ్కా 12 సెంటీమీటర్లు ఎక్కువ దూకాడు. 1988 లో బుబ్కా సియోల్ ఒలింపిక్స్‌లో పోటీపడి 5.90 మీ. లంఘించి, తన ఏకైక ఒలింపిక్ బంగారు పతకాన్ని సాధించాడు. 1992 లో అతను తన మొదటి మూడు ప్రయత్నాల లోనూ (5.70, 5.70, 5.75 మీ) దూకడంలో విఫలమై, బార్సిలోనా ఒలింపిక్స్‌ నుండి ఔటయ్యాడు. 1996 లో జరిగిన అట్లాంటా ఒలింపిక్స్‌లో మడమ గాయం కారణంగా అతను అసలు దూకకుండానే పోటీ నుండి వైదొలిగాల్సి వచ్చింది. 2000 లో సిడ్నీ ఒలింపిక్స్‌లో బుబ్కా, 5.70 మీ. వద్ద మూడు ప్రయత్నాల్లో విఫలమై ఫైనల్‌కు చేరలేకపోయాడు.[19]

IAAF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు

[మార్చు]

1983 నుండి 1997 వరకు బుబ్కా, వరుసగా ఆరు IAAF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లలో పోల్ వాల్ట్ పతకాన్ని గెలుచుకున్నాడు. వటి వివరాలు:

సంవత్సరం పోటీ వేదిక స్థానం దూకిన ఎత్తు
1983 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు హెల్సింకి 1 5.70 మీ. (18 అ. 8+716 అం.)
1987 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు రోమ్ 1 5.85 మీ. (19 అ. 2+516 అం.)
1991 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు టోక్యో 1 5.95 మీ. (19 అ. 6+14 అం.)
1993 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు స్టుట్‌గార్ట్ 1 6.00 మీ. (19 అ. 8+14 అం.)
1995 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు గోథెన్బర్గ్ 1 5.92 మీ. (19 అ. 5+116 అం.)
1997 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఏథెన్స్ 1 6.01 మీ. (19 అ. 8+58 అం.)

బుబ్కా ప్రపంచ రికార్డు పురోగతి

[మార్చు]

బుబ్కా తన కెరీర్లో పురుషుల పోల్ వాల్ట్ పోటీలో 35 సార్లు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.[5] అతను ఆరుబయలు ప్రపంచ రికార్డును 17 సార్లు, ఇండోర్ ప్రపంచ రికార్డును 18 సార్లూ బద్దలు కొట్టాడు. తన విశిష్టమైన కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే తన ఆరుబయలు ప్రపంచ రికార్డును కోల్పోయాడు. ఫ్రాన్సు‌కు చెందిన థియరీ విగ్నెరాన్, 1984 ఆగస్టు 31 న రోమ్‌లో జరిగిన గోల్డెన్ గాలా ఇంటర్నేషనల్ ట్రాక్ పోటీల్లో అతడి రికార్డును బద్దలు కొట్టిన తరువాత, కొద్ది నిమిషాల తరువాత అదే ట్రాక్ మీద బుబ్కా తన రికార్డును తిరిగి నిలబెట్టుకున్నాడు.[20]

ఔట్‌డోర్
ఎత్తు తేదీ ప్రదేశం
6.14 మీ. (20 అ. 1+34 అం.) 1994 జూలై 31 సెస్ట్రియరె
6.13 మీ. (20 అ. 1+516 అం.) 1992 సెప్టెంబరు 19 Tokyo
6.12 మీ. (20 అ. 1516 అం.) 1992 ఆగస్టు 30 పడువా
6.11 మీ. (20 అ. 916 అం.) 1992 జూన్ 13 డిజోన్
6.10 మీ. (20 అ. 316 అం.) 1991 ఆగస్టు 5 మాల్మో
6.09 మీ. (19 అ. 11+34 అం.) 1991 జూలై 8 ఫార్మియా
6.08 మీ. (19 అ. 11+38 అం.) 1991 జూన్ 9 మాస్కో
6.07 మీ. (19 అ. 11 అం.) 1991 మే 6 షిజువోకా
6.06 మీ. (19 అ. 10+916 అం.) 1988 జూలై 10 నైస్
6.05 మీ. (19 అ. 10+316 అం.) 1988 జూన్ 9 బ్రాటిస్లావా
6.03 మీ. (19 అ. 9+38 అం.) 1987 జూన్ 23 ప్రాగ్
6.01 మీ. (19 అ. 8+58 అం.) 1986 జూన్ 8 మాస్కో
6.00 మీ. (19 అ. 8+14 అం.) 1985 జూన్ 13 పారిస్
5.94 మీ. (19 అ. 5+78 అం.) 1984 ఆగస్టు 31 రోమ్
5.90 మీ. (19 అ. 4+516 అం.) 1984 జూలై 13 లండన్
5.88 మీ. (19 అ. 3+12 అం.) 1984 జూన్ 2 పారిస్
5.85 మీ. (19 అ. 2+516 అం.) 1984 మే 26 బ్రాటిస్లావా
ఇన్‌డోర్
ఎత్తు తేదీ ప్రదేశం
6.15 మీ. (20 అ. 2+18 అం.) 1993 ఫిబ్రవరి 21 డోనెట్స్క్
6.14 మీ. (20 అ. 1+34 అం.) 1993 ఫిబ్రవరి 13 లీవిన్
6.13 మీ. (20 అ. 1+516 అం.) 1992 ఫిబ్రవరి 22 బెర్లిన్
6.12 మీ. (20 అ. 1516 అం.) 1991 మార్చి 23 గ్రెనోబుల్
6.11 మీ. (20 అ. 916 అం.) 1991 మార్చి 19 డోనెట్స్క్
6.10 మీ. (20 అ. 316 అం.) 1991 మార్చి 15 సాన్ సెబాస్టియన్
6.08 మీ. (19 అ. 11+38 అం.) 1991 ఫిబ్రవరి 9 వోల్గోగ్రాడ్
6.05 మీ. (19 అ. 10+316 అం.) 1990 మార్చి 17 డోనెట్స్క్
6.03 మీ. (19 అ. 9+38 అం.) 1989 ఫిబ్రవరి 11 ఒసాకా
5.97 మీ. (19 అ. 7+116 అం.) 1987 మార్చి 17 టురిన్
5.96 మీ. (19 అ. 6+58 అం.) 1987 జనవరి 15 ఒసాకా
5.95 మీ. (19 అ. 6+14 అం.) 1986 ఫిబ్రవరి 28 న్యూయార్క్
5.94 మీ. (19 అ. 5+78 అం.) 1986 ఫిబ్రవరి 21 ఇంగిల్‌వుడ్, కాలిఫోర్నియా
5.92 మీ. (19 అ. 5+116 అం.) 1986 ఫిబ్రవరి 8 మాస్కో
5.87 మీ. (19 అ. 3+18 అం.) 1986 జనవరి 15 ఒసాకా
5.83 మీ. (19 అ. 1+12 అం.) 1984 ఫిబ్రవరి 10 ఇంగిల్‌వుడ్, కాలిఫోర్నియా
5.82 మీ. (19 అ. 1+18 అం.) 1984 ఫిబ్రవరి 1 మిలానో
5.81 మీ. (19 అ. 34 అం.) 1984 జనవరి 15 విల్నియస్

పొందిన పురస్కారాలు, పదవులు

[మార్చు]
  • 1991 లో క్రీడలలో ప్రిన్స్ ఆఫ్ అస్టురియాస్ పురస్కారం గెలుచుకున్నాడు.
  • 1984 నుండి 1986 వరకు వరుసగా మూడు సంవత్సరాల పాటు సోవియట్ యూనియన్ ఉత్తమ క్రీడాకారుడుగా బుబ్కాకు పురస్కారం లభించింది
  • లేఎక్విప్ పత్రిక 1997 లో బుబ్కాను స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నుకుంది
  • గత అర్ధ శతాబ్దంలో ఉత్తమ పోల్ వాల్టర్‌గా బుబ్కాను ట్రాక్ & ఫీల్డ్ న్యూస్ పత్రిక సత్కరించింది
  • బుబ్కా FICTS హాల్ ఆఫ్ ఫేమ్‌లో ప్రవేశించాడు. 2001 లో ఎక్సలెన్స్ గిర్లాండ్ డి హొన్నూర్‌ పురస్కారం పొందాడు.
  • బుబ్కాను 2001 లో IAAF కౌన్సిల్ సభ్యుడిగా ఎంపికయ్యాడు. 2011 లో నాలుగేళ్ల కాలానికి ఆ సంస్థ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.[21]
  • ఉక్రెయిన్ జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా, IOC సభ్యుడుగా పనిచేస్తున్నాడు [22]
  • 2003 లో బుబ్కాను యునెస్కో ఛాంపియన్ ఫర్ స్పోర్ట్ గా నియమించారు [23]
  • 2005 లో అతను క్రీడాభివృద్ధికి ప్రోత్సాహానికీ చేసిన కృషికి గాను బుబ్కా, పానాథ్లాన్ ఇంటర్నేషనల్ ఫ్లామ్‌బ్యూ డి'ఆర్ అందుకున్నాడు.[24]
  • 2002 నుండి 2006 వరకు, అతను ఉక్రేనియన్ పార్లమెంటు సభ్యుడుగా పనిచేసాడు. యువత విధానం, భౌతిక సంస్కృతి, క్రీడలు, పర్యాటకాలపై పార్లమెంటు కమిటీలో సభ్యుడుగా పనిచేసాడు [25][26]
  • బుబ్కా 2005 లో మార్కా లేయెండాను గెలుచుకున్నాడు
  • 2008 ఆగస్టులో IOC అథ్లెట్స్ కమిషన్‌లో తన పదవీకాలాన్ని పూర్తి చేశాడు [27]

మూలాలు

[మార్చు]
  1. Ten years ago Serhiy Bubka was placed in charge of the National Olympic Committee of Ukraine (10 років тому Сергій Бубка очолив Національний олімпійський комітет України). UNIAN. 23 June 2015
  2. Honorary and Goodwill Ambassadors
  3. "Track and Field Athlete of the Year". Trackandfieldnews.com. Archived from the original on 11 మే 2011. Retrieved 14 ఆగస్టు 2012.
  4. "Hall of Fame | Athletes". Iaaf.org. Archived from the original on 2017-03-20. Retrieved 2017-03-20.
  5. 5.0 5.1 "Bubka says farewell". BBC News. 4 February 2001. Retrieved 26 August 2007.
  6. "Top Lists: Pole Vault". IAAF.org. Retrieved 29 June 2009. (Indoor)
  7. 7.0 7.1 "Top Lists: Pole Vault". IAAF.org. Retrieved 29 June 2009. (Outdoor)
  8. "RENAUD LAVILLENIE SETS POLE VAULT WORLD RECORD OF 6.16M IN DONETSK – UPDATED". IAAF. Retrieved 17 February 2014.
  9. "RENAUD LAVILLENIE SETS POLE VAULT WORLD RECORD OF 6.16M IN DONETSK – UPDATED". IAAF. Retrieved 15 February 2014.
  10. "Pole Vault - men - senior - outdoor". Iaaf.org. Retrieved 2017-03-20.
  11. "World Records". Iaaf.org. Retrieved 2017-03-20.
  12. Sandomir, Richard (12 April 1992). "OLYMPICS; Top Athletes Are Being Wooed to Fill Some Big Shoes". The New York Times. Archived from the original on 26 May 2015. Retrieved 2 January 2017.
  13. O'Connor, Ian (1 August 1996). "Sore Bubka cannot soar". NY Daily News. Archived from the original on 3 జనవరి 2017. Retrieved 2 January 2017.
  14. Price, David (4 Aug 2017). "Carson Valley has a new 'Spirit'". The Record-Courier. Archived from the original on 5 ఆగస్టు 2017. Retrieved 23 May 2020.
  15. "A Family Company". ucsspirit. UCS Spirit. Retrieved 23 May 2020.
  16. "The Legendary Sergey Bubka". Insideathletics.com.au. Retrieved 20 April 2009.
  17. "Men's pole vault". Alltime-athletics.com. Retrieved 2017-03-20.
  18. Pole vault legend Sergei Bubka retires[permanent dead link]. The Independent (4 February 2001). Retrieved on 12 February 2011.
  19. "Sydney 2000 results". IAAF.org. Archived from the original on 22 November 2007. Retrieved 26 August 2007.
  20. Bubka finishes 1st in world-record vault battle Associated Press (1 September 1984). Retrieved on 21 May 2012.
  21. "International Association of Athletics Federations". Daegu2011.iaaf.org. 24 August 2011. Archived from the original on 14 September 2011. Retrieved 1 September 2011.
  22. "IOC > Members > Sergey Bubka". Official Website of the Olympic Movement. Retrieved 26 August 2007.
  23. "Ukrainian athlete Serhiy Bubka designated UNESCO Champion for Sport". Unesco.org. 4 November 2003. Retrieved 27 August 2007.
  24. "Archived copy". Archived from the original on 31 May 2012. Retrieved 2012-01-04.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  25. [1][dead link]
  26. [2]
  27. "Fredericks succeeds Bubka as chairman of IOC's Athletes Commission_English_Xinhua". News.xinhuanet.com. 2008-08-05. Archived from the original on 27 November 2013. Retrieved 2017-03-20.