సెయింట్ జార్జి చర్చి, హైదరాబాదు
సెయింట్ జార్జి చర్చి | |
---|---|
మతం | |
Ecclesiastical or organizational status | బసిలికా |
ప్రదేశం | |
ప్రదేశం | అబిడ్స్, హైదరాబాదు, తెలంగాణ |
దేశం | భారతదేశం |
సెయింట్ జార్జి చర్చి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అబీడ్స్ లో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం.[1] 1844లో చర్చి మిషనరీ సొసైటీ వారిచే నిర్మించబడిన ఈ చర్చి, 1947లో దక్షిణ భారతదేశపు చర్చీల సమూహంలో చేర్చబడింది.[2] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
చరిత్ర
[మార్చు]బ్రిటీషు రెసిడెన్సీ భవనం కోఠిలో ఏర్పాటుచేయడంతో అనేకమంది క్రైస్తవులు చాదర్ ఘాట్, అబిడ్స్ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటుచేసుకున్నారు. వారందరికి అందుబాటులో ఉండేందుకు నిజాం ప్రభువు అనుమతితో దాదాపు పదిన్నర ఎకరాల్లో ఈ చర్చి నిర్మించబడింది.[3]
నిర్మాణం
[మార్చు]దీనికి బ్రిటీషు రెసిడెంట్ సర్ జార్జి యాలే శంకుస్థాపన చేశాడు. దీని నిర్మాణానికి దాదాపు రెండు సంవత్సరాల కాలం పట్టింది. డెబ్భై అడుగుల ఎత్తులో యూరోపియన్ శైలీలో క్రీస్తు శిలువ ఆకారంలో నిర్మించిన ఈ చర్చి ముందు ఎత్తైన పోర్టికో, ప్రార్థనా మందిరంలో రంగూన్ టేకు టేబుళ్లు, ఇతర వస్తువులు ఉన్నాయి. చర్చిలోని రంగు అద్దాలపై క్రీస్తు జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, ఇతర ఆకృతులు చిత్రించబడ్డాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ Itihas, Volume 11, 1983, p.296
- ↑ "British Empire: Resources: Articles: Churches of India: a legacy of The Imperial Raj: St George's, Hyderabad". britishempire.co.uk. Archived from the original on 5 జనవరి 2019. Retrieved 18 March 2019.
- ↑ సాక్షి, ఫీచర్స్ (25 December 2014). "క్రిస్టియన్ మిషనరీలు 100 plus". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 26 March 2019. Retrieved 26 March 2019.
- ↑ సెయింట్ జార్జి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 43