Jump to content

సుహాస్ గోపీనాథ్

వికీపీడియా నుండి
సుహాస్ గోపీనాథ్
జననం (1986-11-04) 1986 నవంబరు 4 (వయసు 38)
వృత్తివ్యాపారవేత్త

సుహాస్ గోపీనాథ్ (జననం 1986 నవంబరు 4) భారతీయ పారిశ్రామికవేత్త. ఆయన బహుళజాతి ఐటీ కంపెనీ అయిన గ్లోబల్స్ ఇన్కార్పొరేషన్(Globals Inc.) వ్యవస్థాపకుడు.[1] ఆయన కంపెనీని స్థాపించిన మూడు సంవత్సరాల తర్వాత 17 సంవత్సరాల వయస్సులో ముఖ్య కార్యనిర్వాహక అధికారి(సీఈఓ) అయ్యాడు.[2]

జీవితం తొలి దశలో

[మార్చు]

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో సుహాస్ గోపీనాథ్ జన్మించాడు. అతని తండ్రి శాస్త్రవేత్త, కాగా తల్లి గృహిణి.[3] గోపీనాథ్ పుస్తకాల సహాయంతో వెబ్‌సైట్‌లను రూపొందించడం నేర్చుకున్నాడు. 14 సంవత్సరాల వయస్సులోనే సొంతంగా వెబ్‌సైట్‌ సృష్టించాడు. అదే సంవత్సరం, 2000లో అతను తన కంపెనీ గ్లోబల్స్ ఇంక్‌[4]ను స్థాపించాడు.[5] ఆయన 17 సంవత్సరాల వయస్సులో తన కంపెనీకి సీఈఓ బాధ్యతలు స్వీకరించాడు. దీంతో ఆయన, ఒక కంపెనీకి అతి పిన్న వయస్కుడైన సీఈఓగా గుర్తింపు పొందాడు.[6]

గుర్తింపు

[మార్చు]
  • 2005లో, కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును అందుకున్న 175 మందిలో గోపీనాథ్ అత్యంత పిన్న వయస్కుడు.
  • 2007 డిసెంబరు 2న, యూరోపియన్ పార్లమెంట్ అండ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ గోపీనాథ్‌కు బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్‌లో "యంగ్ అచీవర్ అవార్డు"ని ప్రదానం చేసింది.[7]
  • నవంబరు 2008లో, ఆఫ్రికాలో ప్రపంచ బ్యాంకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఐసీటి) లీడర్‌షిప్ రౌండ్‌టేబుల్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఆయన ఆహ్వానించబడ్డాడు.[8]
  • వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2008-2009లో ఆయన "యంగ్ గ్లోబల్ లీడర్"గా ఎన్నికయ్యాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. Roy, Ashish (26 July 2012). "Globals CEO Suhas Gopinath plans to list company in 2015". The Times of India. Retrieved 6 May 2018.
  2. "India's youngest CEO Suhas Gopinath's journey of highs & lows". Indian Television Dot Com (in ఇంగ్లీష్). 2015-04-20. Retrieved 2018-06-15.
  3. "Indian teen at gates of success". 17 November 2003. Retrieved 24 April 2014.
  4. "Globals". www.globalsinc.com. Retrieved 2023-11-02.
  5. "Indian teen at gates of success". 17 November 2003. Retrieved 24 April 2014.
  6. "Teenager hopes his firm will become another Microsoft". The Sydney Morning Herald. 2003-11-10. Retrieved 2007-07-07.
  7. "Young Achiever Award". EICC. 2007-12-04. Retrieved 2008-03-18. [dead link]
  8. "Youth with a Mission". City News-Singapore. 2009-10-13. Retrieved 2009-10-25.
  9. "Young Global Leaders 2008". World Economic Forum. 2008-03-11. Archived from the original on 26 January 2009. Retrieved 2008-03-18.