Jump to content

సువెందు అధికారి

వికీపీడియా నుండి
సువెందు అధికారి
సువెందు అధికారి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
10 మే 2021
డిప్యూటీ మిహిర్ గోస్వామి
ముందు అబ్దుల్ మన్నన్
నియోజకవర్గం నందిగ్రామ్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2016
ముందు ఫిరోజ్ బిబి
నియోజకవర్గం నందిగ్రామ్

రవాణా శాఖ మంత్రి
పదవీ కాలం
27 మే 2016 – 27 నవంబర్ 2020
గవర్నరు కేశరినాథ్ త్రిపాఠి
జగదీప్ ధంకర్
ముందు అరూప్ బిస్వాస్
తరువాత మమతా బెనర్జీ[1]

పర్యావరణ శాఖ మంత్రి
పదవీ కాలం
2018 – 2020
ముందు సోవన్ ఛటర్జీ
తరువాత మమతా బెనర్జీ

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2009 – 19 మే 2016
ముందు లక్ష్మణ్ చంద్ర సేథ్
తరువాత దిబ్యేందు అధికారి
నియోజకవర్గం తమ్లుక్

జ్యూట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌
పదవీ కాలం
31 డిసెంబర్ 2020 – 2 మార్చ్ 2021[2]
ముందు అజయ్ కుమార్ జోలీ

వ్యక్తిగత వివరాలు

జననం (1970-12-15) 1970 డిసెంబరు 15 (వయసు 54)
కొంటాయి, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2020- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు * కాంగ్రెస్ పార్టీ (1995-1998)
  • త్రిణమూల్ కాంగ్రెస్ (1998-2020)
బంధువులు దిబ్యేందు అధికారి (సోదరుడు)
నివాసం కొంటాయి,పూర్భా మేదినిపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్
పూర్వ విద్యార్థి రవీంద్రభారతి యూనివర్సిటీ (ఎంఏ)
ప్రభాస్ కుమార్ కాలేజీ (బిఏ)
వృత్తి రాజకీయ నాయకుడు

సువెందు అధికారి పశ్చిమ బెంగాల్కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు.[3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సువెందు అధికారి 1970 డిసెంబరు 15న కర్కులి, పుర్బా మేదినీపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో సిసిర్ కుమార్ అధికారి, గాయత్రి దంపతులకు జన్మించాడు. ఆయన ఎంఏ వరకు చదివాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సువెందు అధికారి తన తండ్రి సిసిర్ కుమార్ అధికారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995లో తొలిసారి కాంటాయ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 1998లో మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన తృణమూల్ కాంగ్రెస్ లో చేరి 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంతి దక్షిణ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

సువెందు అధికారి పార్టీలో మమతా బెనర్జీ అనుచరుడిగా మరి ఎకనమిక్ సెజ్‌లకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు అండగా పోరాడిన నాయకుడిగా మంచి గుర్తింపునందుకున్నాడు. ఆయన తరువాత ఎంపీగా, ఎమ్మెల్యేగా 2016లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసి 2020 డిసెంబరు 17న పార్టీకి రాజీనామా చేసి, [4] డిసెంబరు 19న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5] ఆయన 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మమతా బెనర్జీ పై 1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[6] ఆయనను తరువాత బీజేపీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితుడయ్యాడు.

ఎన్నికల్లో పోటీ

[మార్చు]
  1. 1995 : కాంటాయ్ మున్సిపాలిటీ కౌన్సిలర్‌
  2. 2006 : కాంతి దక్షిణ్ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నిక
  3. 2009 : తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, ఎమ్మెల్యే పదవికి రాజీనామా
  4. 2014 : రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై ఎంపీగా రాజీనామా చేశాడు.
  5. 2021 : నందిగ్రామ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక[7]

మూలాలు

[మార్చు]
  1. "CM Banerjee will take charge of Suvendu's portfolio". NDTV. 28 November 2020.
  2. ANI News (2 March 2021). "BJP leader Suvendu Adhikari likely to step down as Chairperson of Jute Corporation of India" (in ఇంగ్లీష్). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  3. Namasthe Telangana (10 May 2021). "బెంగాల్‌ ప్రతిపక్ష నేతగా సువేందు". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  4. 10TV (27 November 2020). "బెంగాల్ రవాణాశాఖ మంత్రి రాజీనామా" (in telugu). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Mana Telangana (19 December 2020). "బిజెపిలో చేరిన సువేందు అధికారి". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  6. 10TV (2 May 2021). "నందిగ్రామ్ లో సీఎం మమతని ఓడించిన సువెందు అధికారి" (in telugu). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Namasthe Telangana (2 May 2021). "నందిగ్రామ్‌ సువేందుదే!". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.