సుల్తానాబాద్ మండలం
సుల్తానాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో ఉన్న 14 మండలాలో గల ఒక మండలం.[1]
సుల్తానాబాద్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°32′00″N 79°20′00″E / 18.5333°N 79.3333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి జిల్లా |
మండల కేంద్రం | సుల్తానాబాద్ |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 166 km² (64.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 63,454 |
- పురుషులు | 31,465 |
- స్త్రీలు | 31,489 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.65% |
- పురుషులు | 66.52% |
- స్త్రీలు | 42.69% |
పిన్‌కోడ్ | 505185 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం సుల్తానాబాద్.
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.
[మార్చు]లోగడ సుల్తానాబాద్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లాలో, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సుల్తానాబాద్ మండలాన్ని (1+20) ఇరువై ఒక్క గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
గతంలో ఇది జిల్లాలో అతి పెద్ద తాలూకా. 1956 కు ముందు సుల్తానాబాద్ నియోజకవర్గం. పెద్దపల్లి, సుల్తానాబాద్ రెండు నియోజకవర్గాలున్న క్రమంలో 1956 అనంతరం పెద్దపల్లి కేంద్రంగా ఒకే నియోజకవర్గం ఏర్పడింది. ఇక మండలంలో భౌగోళిక పరిస్థితి విషయానికి వస్తే ఎక్కువగా ఎర్రరేగడి, నల్లరేగడి భూములున్నాయి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 63,454 - పురుషులు 31,465 - స్త్రీలు 31,489, అక్షరాస్యత - మొత్తం 54.65% - పురుషులు 66.52% - స్త్రీలు 42.69%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 166 చ.కి.మీ. కాగా, జనాభా 63,454. జనాభాలో పురుషులు 31,465 కాగా, స్త్రీల సంఖ్య 31,989. మండలంలో 16,688 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]రవాణా సౌకర్యాలు
[మార్చు]ఈ మండలానికి బస్సు సౌకర్యం ఉంది
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.