Jump to content

సుల్ఖాన్ సింగ్

వికీపీడియా నుండి
సుల్ఖాన్ సింగ్
సుల్ఖాన్ సింగ్ (డి.జి.పి)
జననంసుల్ఖాన్ సింగ్
1957
జహర్ పూర్, బండా జిల్లా, ఉత్తరప్రదేశ్
ఇతర పేర్లుసుల్ఖాన్ సింగ్
వృత్తిఉత్తరప్రదేశ్ డి.జి.పి
ప్రసిద్ధిఐపీఎస్‌ అధికారి
తండ్రిలఖన్ సింగ్
తల్లికళాదేవి దేవి

సుల్ఖాన్ సింగ్ ఐ.పి.ఎస్ అధికారి. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి గా నియమితులైనారు.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధానికి 200 కి.మీ దూరంలో గల బండా జిల్లాలోని జహర్ పూర్ గ్రామంలో లఖన్ సింగ్, కళావతి దేవి దంపతులకు 1957లో జన్మించారు. ఆయన స్థానిక పాఠశాలలో 8వ తరగతి వరకు చదివారు. తరువాత పాఠశాల విద్యను తింద్వారీ పాఠశాలలో పూర్తిచేసారు. ఇంటర్మీడియట్ విద్యను ఆదర్శ్ బజ్రంగ్ ఇంటర్ కళాలాలలో చదివారు. తరువాత రూర్కీలో సివిల్ ఇంజనీరింగ్ చేసారు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. ఆయన నాయశాస్త్రంలో కూడా పట్టభద్రుడు.ఆయన 1980లో మొదటిసారి తన తొలి ప్రయత్నంలోనె సివిల్ సర్వీసు పరీక్షలను పూర్తి చేసారు. ఆయన 1989 బ్యాచ్ ఐ.పి.ఎస్ అధికారి.[3]

నిరాడంబరుడు

[మార్చు]

ఆయన 37 సంవత్సరాల సర్వీసులో నిజాయితీగా వ్యవహరించిన అధికారి. ఆయన తన సర్వీసులో 3 లక్షల విలువ జేసే 2.3 ఎకరాల పొలం, లక్నోలో వాయిదాలతో కొనుక్కున్న ఓ మూడు గదుల ఇల్లు మాత్రమే సంపాదించాడు.

ఉద్యోగ జీవితం

[మార్చు]

1980 కేడర్ ఐపీఎస్ అధికారి ఆయన, 2007లో ములాయంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భారీ పోలీసు రిక్రూట్‌మెంట్ స్కాం బయటపెట్టాడు గానీ లేకపోతే ఎప్పుడో డీజీపీ అయ్యేవాడు. ఆ తరువాత ఆయనను మొత్తం నాన్ ఫోకల్ పోస్టుల్లోనే వేశారు. తరువాతి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2012లో ఈ సుల్కాన్ సింగ్‌కన్నా ఎనిమిది మెట్లు కింద ఉన్న జావీద్ అహ్మద్‌ను డీజీపీగా నియమించారు. అప్పుడు అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్న ఈ సుల్కాన్ సింగ్‌ను తీసుకుపోయి ఓ డీఐజీ ర్యాంకు అధికారిని నియమించే ఓ పోలీసు ట్రెయినింగు కాలేజీలో పడేశారు. ఇక కెరీర్ అక్కడే ముగిసిపోయినట్టే అనుకున్న స్థితిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఆయనను డి.జి.పి. గా నియమించారు. ఆయనకు 2017 సెప్టెంబరు వరకు మాత్రమే పదవీకాలం ఉంది.[4][5]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]