సుభాష్ సుధ
అశోక్ కుమార్ అరోరా | |||
రాష్ట్ర మంత్రిగా (స్వతంత్ర బాధ్యత)
| |||
పదవీ కాలం 19 మార్చి 2024 – 2024 అక్టోబరు 17 | |||
పదవీ కాలం 2014 – 2024 | |||
తరువాత | అశోక్ కుమార్ అరోరా | ||
---|---|---|---|
నియోజకవర్గం | తానేసర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బీజేపీ |
సుభాష్ సుధ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను తానేసర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా (స్వతంత్ర బాధ్యత) 2024 మార్చి 19 నుండి 2024 అక్టోబరు 17 వరకు పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సుభాష్ సుధ 2009లో తానేసర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆ తరువాత బీజేపీ పార్టీలో చేరి[2] 2014లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి అశోక్ కుమార్ అరోరాపై 25,638 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
సుభాష్ సుధ 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ అరోరాపై 842 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[5] 2024 మార్చి 19 నుండి 2024 అక్టోబరు 17 వరకు రాష్ట్ర మంత్రిగా (స్వతంత్ర బాధ్యత) హోదాలో పనిచేశాడు.[6] సుభాష్ సుధ 2024లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ అరోరా చేతిలో 3,243 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ The Tribune (20 March 2024). "Celebrations erupt in Thanesar as Subhash Sudha becomes minister" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
- ↑ Navbharat Times (22 August 2014). "सुभाष सुधा ने भी बीजेपी का दामन थामा". Retrieved 27 October 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Hindustantimes (27 September 2019). "Haryana Assembly Polls: Subhash Sudha, Thanesar". Retrieved 27 October 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Thanesar". Retrieved 27 October 2024.