సుబ్బారావు పాణిగ్రాహి
సుబ్బారావు పాణిగ్రాహి | |
---|---|
జననం | 1934 సెప్టెంబర్ 8 |
మరణం | 1969 డిసెంబర్ 22 రంగమటియ కొండలు |
మరణ కారణం | పోలీసు కాల్పులు |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | ప్రజాకవి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | జముకుల కళాకారుడు, విప్లవ గేయకవి |
సుబ్బారావు పాణిగ్రాహి విప్లవ ప్రజాకవి. ఇతడు 1934, సెప్టెంబర్ 8న శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం బారువాలో ఒక పూజారి కుటుంబంలో జన్మించాడు[1]. బొడ్డపాడు గ్రామానికి పూజారిగా వచ్చాడు. అక్కడ తామాడ గణపతి, పంచాది కృష్ణమూర్తిలతో పరిచయమై వారితో కలసి యువకులను ఉద్యమాల్లోకి తెచ్చాడు. తెగింపు సంఘాన్ని పెట్టి ఎందరో యువకులను శ్రీకాకుళ పోరాటంలోకి తీసుకొచ్చాడు. ప్రజల కష్టాలపై ఎన్నో పాటలను, గేయాలను, నాటికలను రాశాడు. ‘ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం’, ‘కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం’ వంటి ఆయన రాసిన పాటలు శాశ్వతంగా నిలిచి పోయాయి. తామాడ చినబాబుతో కలిసి ఆయన చెప్పిన జముకుల కథ ప్రజలను ఉర్రూతలూపింది. ఆయన రాసిన ‘ఓ అరుణ పతాకమా, చేగొనుమా రెడ్ శాల్యూట్’ అనే పాట విప్లవకారులు నిత్యం జెండా వందన వేళ పాడుకునే విప్లవగీతం అయింది.
శ్రీకాకుళ గిరిజనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. చాగంటి భాస్కరరావు, తామాడ గణపతి మరణం తర్వాత సోంపేట ఏరియా పార్టీ కార్యదర్శిగా పాణిగ్రాహిని ఎన్నుకున్నారు. అనతి కాలంలోనే అంటే, 1969 డిసెంబర్ 22న పాణిగ్రాహిని రంగమటియ కొండల్లో కాల్చి చంపారు. ఆయన జీవించింది 36 ఏళ్లు మాత్రమే. ప్రజాకళలకు జీవం పోసి వాటిని రాజకీయాలతో జోడించి ఉద్యమ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి.
రచనలు
[మార్చు]నాటికలు
[మార్చు]- కుంకుమరేఖ
- రిక్షావాలా
- ఎండమావులు
- కాలచక్రం
- విముక్తి
ప్రసిద్ధి చెందిన పాటలు
[మార్చు]- ఓ అరుణ పతాకమా, చేగొనుమా రెడ్ శాల్యూట్
- ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం
- కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం
- వినండి బాబూ విషాధ గాథ గోదావరి నది వరదల బాధ
- దిక్కుమొక్కు లేని జనం ఒక్కొ క్కరు అగ్నికణం.. సింహకంఠ నాదంతో వస్తారిక కాచుకోండి