సునీల్ ఇబ్రహీం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీల్ ఇబ్రహీం
జననం1978, డిసెంబరు 12
మదనవిలా, కేరళ
వృత్తిదర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2012 - ప్రస్తుతం

సునీల్ ఇబ్రహీం కేరళకు చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. 2012లో నివిన్ పౌలీ, శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో చాప్టర్స్ సినిమా తీశాడు.[1] 2013లో అరికిల్ ఒరాల్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

జననం

[మార్చు]

సునీల్ ఇబ్రహీం 1978, డిసెంబరు 12న కేరళ రాష్ట్రంలోని మదనవిలాలో జన్మించాడు.

సినిమారంగం

[మార్చు]

సునీల్ ఇబ్రహీం చాప్టర్స్ అనే సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఇంద్రజిత్ సుకుమారన్, నివిన్ పౌలీ, రమ్య నంబీషన్ ప్రధాన పాత్రలలో రెండవ సినిమా అరికిల్ ఒరాల్ తీశాడు.[2] 40 మంది కొత్త నటులతో తీసిన వై అనే సినిమా 2017లో విడుదలైంది. సూరజ్ వెంజరమూడ్, సిజా రోజ్, షైన్ టామ్ చాకో, జిన్స్ బాస్కర్ ప్రధాన పాత్రలతో తన అతని నాల్గవ సినిమా "రాయ్" తీశాడు.[3][4][5]

సినిమాలు

[మార్చు]
  • దర్శకుడిగా
సంవత్సరం సినిమా తారాగణం ఇతర వివరాలు
2012 చాప్టర్స్ నివిన్ పౌలీ, శ్రీనివాస్, లీనా అభిలాష్ దర్శకుడు, రచయిత
2013 అరికిల్ ఓరల్ నివిన్ పౌలీ, ఇంద్రజిత్, రమ్య నంబీషన్ దర్శకుడు, రచయిత
2017 వై అలన్సియర్ లే, దాదాపు 40 మంది నటులు దర్శకుడు, రచయిత
2021 రాయ్ సూరజ్ వెంజరమూడ్, సిజా రోజ్, షైన్ టామ్ చాకో, జిన్స్ బాస్కర్ దర్శకుడు, రచయిత
  • నిర్మాతగా
సంవత్సరం సినిమా తారాగణం ఇతర వివరాలు
2015 ఓలప్పిప్పి బిజు మీనన్, పారిస్ లక్ష్మి నిర్మాత మాత్రమే

మూలాలు

[మార్చు]
  1. "No hero, heroine in Sunil Ibrahim's 'Chapters'". Mathrubhumi. Archived from the original on 2015-02-12. Retrieved 2023-07-17.
  2. Sooraj Rajmohan. "On Location: Arikil Oraal - True colours". The Hindu.
  3. Mathews, Anna. "Roy director Sunil Ibrahim: Shooting post pandemic was a positive and creatively better experience - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-07-17.
  4. "Suraj Venjaramoodu to star in thriller Roy". The New Indian Express. Retrieved 2023-07-17.
  5. Mathews, Anna. "Suraj Venjaramoodu's next is a thriller titled Roy - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-07-17.

బయటి లింకులు

[మార్చు]