సుగమ్‌బాబు
స్వరూపం
సుగమ్‌బాబు ఎం.కె. | |
---|---|
జననం | మహబూబ్ ఖాన్ 1944 ఏప్రిల్ 1 గుంటూరు , గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ |
నివాస ప్రాంతం | గుంటూరు ,ఆంధ్రప్రదేశ్ , ఇండియా |
ఇతర పేర్లు | మహబూబ్ ఖాన్ |
వృత్తి | పాత్రికేయుడు రచయిత |
మతం | ఇస్లాం |
తండ్రి | ఫరీద్ ఖాన్ |
తల్లి | సకీనాబీబీ |
రెక్కలు ప్రక్రియ సృష్టికర్తగా పేరుగాంచిన సుగమ్‌బాబు[1] అసలు పేరు మహబూబ్ ఖాన్. ఇతడు 1944, ఏప్రిల్ 1న గుంటూరు లో సకీనాబీబీ, ఫరీద్‌ఖాన్‌లకు జన్మించాడు. బి.ఏ. చదువుకున్నాడు. పైగంబరకవులలో ఒకడైన సుగమ్‌బాబు 2003లో రెక్కలు అనే నూతన ప్రక్రియను ప్రవేశపెట్టాడు. హిబ్రూ విశ్వవిద్యాలయం, ఇజ్రాయేల్‌కు చెందిన సుర్మన్ డేవిస్ ఈ రెక్కలను 'వింగ్స్' పేరుతో ఇంగ్లీషులో అనువదించడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియకు ఆదరణ లభించింది.
రచనలు
[మార్చు]- చరలో సెలయేరు (1968)
- విప్లవం(1969)
- పైగంబర్ కవులు(1971)
- సూరీడు (1971)
- లెనిన్... లెనిన్ (1984)
- రెక్కలు (2004)
- ధమ్మపదం (2013)
మూలాలు
[మార్చు]- ↑ అక్షరశిల్పులు - సయ్యద్ నశీర్ అహ్మద్