Jump to content

సుందర్ సింగ్ గుర్జర్

వికీపీడియా నుండి
(సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ నుండి దారిమార్పు చెందింది)
సుందర్‌ సింగ్‌ గుర్జర్‌
వ్యక్తిగత సమాచారం
జాతీయత భారతదేశం
జననం (1996-01-01) 1996 జనవరి 1 (వయసు 28)
కరౌలి, రాజస్థాన్
క్రీడ
దేశం భారతదేశం
క్రీడఅథ్లెటిక్స్
పోటీ(లు)జావెలిన్ /డిస్కస్ త్రో /షాట్ ఫుట్
కోచ్మహావీర్ ప్రసాద్ సైనీ

సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ భారతదేశానికి చెందిన పారా అథ్లెట్స్‌ క్రీడాకారుడు. ఆయన 2020 టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో కాంస్య పతకం గెలిచాడు.[1][2]

క్రీడా జీవితం

[మార్చు]

సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ 2009 నుంచి క్రీడల్లో పాల్గొంటూ షాట్‌పుట్‌లో జాతీయస్థాయిలో పతకాలు సాధించాడు. ఆయన 2015 వరకు సాధారణ అథ్లెట్లలాగే ఉన్నాడు కానీ 2015లో తన మిత్రుడి ఇంటికి వెళ్లిన సందర్భంలో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. ఓ రేకు షెడ్డు అతడి ఎడమచేతిపై పడటంతో దాన్ని కోల్పోయాడు. ఆయన అనంతరం పారా అథ్లెట్‌గా మారిన సుందర్‌ మరుసటి ఏడాది జరిగిన రియో పారాలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. పారాలింపిక్స్‌కు వెళ్లిన అతడు జావెలిన్‌ త్రో విభాగంలో మంచి ప్రదర్శన చేస్తున్నా నిర్వాహకులు కాల్‌రూమ్‌కు పిలిచినప్పుడు 52 సెకన్లు ఆలస్యంగా వెళ్లినట్లు పేర్కొని అతనిని అనర్హుడిగా ప్రకటించారు.

సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ 2020 టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఎఫ్‌46 విభాగంలో కాంస్య పతకం గెలిచాడు.[3]

సాధించిన పతకాలు

[మార్చు]
  • ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌, లండన్‌ 2017 - స్వర్ణ పతకం[4]
  • 2020 టోక్యో పారాలింపిక్స్‌ - కాంస్య పతకం

మూలాలు

[మార్చు]
  1. "Tokyo Paralympics: Devendra Jhajharia Wins Silver, Bronze For Sundar Singh Gurjar In Men's Javelin (F46)" (in ఇంగ్లీష్). Retrieved 2021-08-30.
  2. "Tokyo Paralympics: Devendra Jhajharia Wins Javelin Silver, Bronze For Sundar Singh Gurjar | Athletics News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-30.
  3. Eenadu (7 September 2021). "2016లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: సుందర్‌ సింగ్‌ గుర్జార్". Archived from the original on 7 సెప్టెంబరు 2021. Retrieved 7 September 2021.
  4. Sakshi (16 July 2017). "జావెలిన్‌ త్రోలో సుందర్‌ సింగ్‌కు స్వర్ణం". Archived from the original on 7 సెప్టెంబరు 2021. Retrieved 7 September 2021.