Jump to content

వాసుకి సుంకవల్లి

వికీపీడియా నుండి
(సుంకవల్లి వాసుకి నుండి దారిమార్పు చెందింది)

అదే పేరు కలిగి ఉన్న ఇతర వ్యాసాల కొరకు, వాసుకి (అయోమయ నివృత్తి) చూడండి.

వాసుకి సుంకవల్లి
అందాల పోటీల విజేత
2011లో వాసుకి సుంకవల్లి
జననముహైదరాబాద్, భారతదేశం
వృత్తిన్యాయవాది, మోడల్
బిరుదు (లు)మిస్ యూనివర్స్ ఇండియా 2011
భర్తఅతుల్ పంజ్(m.2018)[1]

వాసుకి సుంకవల్లి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరుకి చెందిన లాయరు. తండ్రి సుంకవల్లి వెంకటరమణ ప్రస్తుత నివాసము హైదరాబాదు. వాసుకి సికిందరాబాదు, ఢిల్లీ, పూనే లలో విద్యాభ్యాసము చేసింది. అమెరికా లోని న్యూ యార్క్ విశ్వవిద్యాలయములో న్యాయ శాస్త్రము అభ్యసించి, ఐక్యరాజ్యసమితి కార్యాలయములో కొంతకాలము ఉద్యోగం చేసింది.

2011లో వాసుకి "మిస్ ఇండియా యూనివర్స్- 2011"గా ఎన్నికయింది. 2011 జూలై 15న ముంబైలో ఆమెకు ఈ పురస్కారం ప్రదానం చేసారు.[2] 5 అడుగుల 8 అంగుళాల వాసుకి 2011 సెప్టెంబరు 12న బ్రెజిల్, సావో పోలోలో జరిగిన "విశ్వసుందరి-2011" పోటీలలో పాల్గొంది.[3]

విద్య

[మార్చు]

2002లో పూణే లోని సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్ లా చదవడం కోసం చేరింది. భారతదేశంలో ఉండగా అమె స్థానిక న్యాయవాద సంస్థల్లోను, జాతీయ మానవ హక్కుల కమిషనులోనూ ఇంటర్నుగా పనిచేసింది.

ఢిల్లీలో మేధోహక్కులకు స్ంబంధించిన అంతర్జాతీయ సంస్థలో మేధో హక్కులపై డిప్లొమా చేసింది. ఇక్కడ ఉండగానే ఆఅమె మోడలింగు చెయ్యడమ్మొదలుపెట్టింది.

2009లో న్యూయార్కు యూనివర్సిటీలో చేరి అంతర్జాతీయ చట్టం, మనవ హక్కులపై ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ తీసుకుంది.[4] ఆ తరువాత ఐరాసలోని భారత శాశ్వత రాయబార కార్యాలయంలో రీసెర్చి అసిస్టెంటుగా చేసింది.

మోడలింగు

[మార్చు]

2007లో మోడలింగు రంగంలో చేరి రెండేళ్ళ పాటు మోడలుగా పనిచేసింది. నైకే, కిట్ కాట్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వంటి సంస్థలకు పనిచేసింది.

మిస్ యూనివర్స్ 2011

[మార్చు]

వసుకి 2011 జూలై 15న ముంబైలో మిస్ ఇండియా యూనివర్స్ పురస్కారం అందుకుంది.[2] 2011 సెప్టెంబరు 12న బ్రెజిల్, సావో పోలోలో జరిగిన "విశ్వసుందరి-2011" పోటీలలో పాల్గొంది. అయితే ఆ పోటీల్లో జాతీయ వేషధారణ విభాగంలో ఆమె పాల్గొనలేక పోయింది. ఈ విభాగం కోసం అమె ధరించాల్సిన దుస్తులు బ్రెజిల్ కస్టమ్స్ విభాగంలో చిక్కుకుపోవడంతో ఆమె ఈ పోటీలో పాల్గొనలేక పోయింది. దాంతో ఈ పోటీల్లో ఆమెకు ఏ స్థానమూ అందలేదు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Atul Weds Vasuki - Atul Pratap Chauhan Pictures | Wedding Photographers in Delhi NCR - WedMeGood".
  2. 2.0 2.1 Borah, Prabalika (19 July 2011). "Vasuki eyes Miss Universe title". The Hindu. Chennai, India. Retrieved 2011-08-27.
  3. "I Am She - The Wadhawan Lifestyle I AM She 2011 Vasuki Sunkavalli". Archived from the original on 2012-03-20. Retrieved 2011-08-26.
  4. http://www.law.nyu.edu/sites/default/files/ECM_PRO_065836.pdf
  5. "Why Miss India was not seen in national costume". Hindustan Times (in ఇంగ్లీష్). 2011-09-13. Archived from the original on 2020-07-02. Retrieved 2020-07-02.


'