సీ హారియర్ ప్రదర్శన శాల, విశాఖపట్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సీ హారియర్ ప్రదర్శనశాల విశాఖపట్నం రామకృష్ణా బీచ్ రోడ్ లో ఉంది. ఈ "సీ హారియర్ ఎయిర్‌క్రాఫ్ట్" ఒక నౌకాదళ జెట్ ఫైటర్. భారత నావికాదళం 2019లో ఒక డి-ఇండక్టెడ్ 'సీ హారియర్ ఎయిర్‌క్రాఫ్ట్' (SH 606)ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుప్రదర్శన శాల (మ్యూజియం)గా మార్చడానికి కేటాయించింది. దీనిని విశాఖపట్నం సముద్రపు ఒడ్డు (బీచ్ రోడ్‌)న గల 22,000 చదరపు అడుగుల వైశాల్యం గల రాజీవ్ స్మృతి భవన్‌ ను ఈ ప్రదర్శనశాలకు ఏర్పాటు చేశారు.

సీ హారియర్ ఎయిర్‌క్రాఫ్ట్ లు

[మార్చు]
సీ హారియర్ నిలువుగా ఎగరడం

సీ హారియర్ లు బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన నావికాదళ "సీ హారియర్ జెట్ ఫైటర్స్", నిఘా దాడి విమానాలు'. ఇవి చిన్నగా ఎగిరడానికి (షార్ట్ టేకాఫ్), నిలువుగా ఎగరడానికి/క్రిందకు దిగడానికి (వర్టికల్ టేకాఫ్/ల్యాండింగ్‌) ఇంకా నిఘా దాడులకు పేరు గాంచిన విమానం. ఇది హారియర్ కుటుంబంలో అభివృద్ధి చెందిన జెట్ ఫైటర్ విమానాలలో రెండవడది.[1] మొదటిసారిగా 1980 ఏప్రిల్లో రాయల్ నేవీ 'సీ హారియర్ ఎఫ్ఆర్ఎస్1' (Sea Harrier FRS1)ను ప్రవేశపెట్టింది. అనధికారికంగా దీనిని "షార్" ("Shar") అని పిలుస్తారు. సీ హారియర్‌ను విదేశాలలో విక్రయించడానికి ప్రయత్నించారు. తర్వాత భారతదేశం కొనుగోలు చేసి ఉపయోగించింది.[2] [3]

1977లో భారత ప్రభుత్వం తమ నావికాదళం కోసం సీ హారియర్ను కొనుగోలు చేసే ప్రణాళికలను మొదలుపెట్టి, మొత్తం 30 హారియర్లను సేకరించారు, వీటిలో 25 నిర్వహణ కోసం, మిగిలినవి ఇద్దరు కూర్చునే విధంగా శిక్షణ విమానాలుగా ఉపయోగించారు.[4] [5] విమానాల లభ్యత పరిమితమైన కారణంగా బ్రిటన్లో గణనీయమైన స్థాయిలో పైలట్ శిక్షణను నిర్వహించారు [6] సీ హారియర్ మొదటిసారిగా డిసెంబరు 16, 1983న భారత నావికాదళానికి చేరింది. విమాన వాహక నౌక INS విరాట్‌తో పాటు జెట్ ఫైటర్‌ను ప్రవేశపెట్టారు. INS విరాట్ తదుపరి INS విక్రమాదిత్య రూపొందడానికి దారితీసింది, ఈ హారియర్‌లు క్రమంగా మరింత అధునాతన MIG 29Kలకు మార్గం సుగమం అయింది. [7]

అయితే ఈ 'సీ హారియర్' లతో సంబంధం ఉన్న చోట గణనీయమైన సంఖ్యలో ప్రమాదాలు జరిగడం కారణంగా 2006లో రాయల్ నేవీ 8 విమానాలను తిరిగి తీసుకుని నిర్వహణ సేవలందించింది.[8] రాయల్ నేవీ ఈ విమానాలను తమ నిర్వహణ/సేవల నుండి ఉపసంహరించుకున్న తరువాత 2016లో మరో దశాబ్దం పాటు భారత నౌకాదళం నిర్వహణలో ఉంది. చివరగా 2016లో భారత నౌకాదళం సీ హారియర్ జెట్ ఫైటర్లకు వీడ్కోలు పలికింది. ఆఖరుగా దానిని గోవా నుండి తెప్పించి విశాఖపట్నంలోని బీచ్ రోడ్‌లోని రాజీవ్ స్మృతి భవన్‌లో ఉంచారు.[7]

ప్రదర్శన శాల

[మార్చు]

విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) 2020లో ఈ రాజీవ్ స్మృతి భవన్‌ సీ హారియర్ ప్రదర్శనశాలకు తగినట్లుగా (రీట్రోఫిట్ చేయడం), మళ్ళీ రూపకల్పన (రీడిజైనింగ్) చేసి అభివృద్ధి చేయడానికి ₹7.5 కోట్ల ప్రాజెక్ట్ ను బెంగళూరుకు చెందిన KPR కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కాంట్రాక్ట్‌ ఇచ్చారు.

భారత నౌకాదళ యుద్ధ విమానం

మ్యూజియం ప్రవేశద్వారం వద్ద ఉన్న గ్లాస్ ముఖభాగం సీ హారియర్స్ (1983-2016) పనిచేసిన వ్యవధిని సూచిస్తుంది. సీ హారియర్ ను ఎత్తైన ఎయిర్‌ఫ్రేమ్ పై ఉంచి విద్యుత్ దీపాలను ఉంచారు. ఇది భవనం పైకప్పు నుండి వేలాడదీయబడి ఎగిరడానికి సిద్ధంగా (టేకాఫ్ మోడ్‌ లో) ఉన్నట్లు ఉంటుంది. క్రింది అంతస్థులో 'సీ హారియర్' ఖండాలు అది మోసుకెళ్లిన క్షిపణుల రకాన్ని, దాని భాగాలను వివరిస్తాయి. చిత్రాలతో కూడిన ప్రదర్శన ఏర్పాటుచేశారు. అదనంగా, 'సీ హారియర్' తో పాటు పైలట్‌లకు శిక్షణ ఇవ్వడంలో అది పోషించే పాత్రను ప్రదర్శించడానికి ఒక సిమ్యులేటర్ కూడా ప్రదర్శన కోసం ఉంచారు.

"సీ హారియర్ మ్యూజియం ఏర్పాటుతో, విశాఖపట్నం మూడు నౌకాదళ మ్యూజియంలను కలిగి ఉన్న ఏకైక నగరం గా నిలిచింది. ప్రతి ఒక్కటి భారతీయ నావికాదళం ప్రత్యేక లక్షణాన్ని హైలైట్ చేస్తుంది - ఒక జలాంతర్గామి, యాంటీ సబ్‌మెరైన్ విమానం, జెట్ ఫైటర్". "సీ హారియర్స్" పాత్రను సందర్శకుల ప్రధానంగా చూపించడం కోసం సంక్షిప్త దృశ్య శ్రవణ (ఆడియో-విజువల్) సౌకర్యాన్ని కలుగ చేస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం బీచ్ రోడ్‌లోని మూడు నౌకాదళ మ్యూజియంలకు ఒకే ప్రవేశ టిక్కెట్‌ను ప్రవేశపెట్టాలని VMRDA ప్రతిపాదించింది.[7]

సీ హారియర్ ఎయిర్‌క్రాఫ్ట్ 2016లో డీకమిషన్ అయిన తర్వాత విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) గోవా నుండి విశాఖపట్నం వరకు రవాణా చేసారు. మ్యూజియం నిర్మాణానికి మొత్తం రూ.10 కోట్లు వెచ్చించారు. సీ హారియర్ (SH 606) మ్యూజియాన్ని విశాఖపట్నం రామకృష్ణా బీచ్ రోడ్, రాజీవ్ స్మృతి భవన్‌లో ఉంది. 2022 మే 11 తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు, సీ హారియర్ మ్యూజియంలోని ప్రజల ప్రదర్శన కోసం తెరచారు.[9] [10]

ప్రస్తావనలు

[మార్చు]
  1. March 2006 (Royal Navy); 6 March 2016 (Indian Navy)
  2. Mison, Graham. "Sea Harrier Down Under". Harrier.org.uk. Archived from the original on 12 December 2010. Retrieved 26 April 2010.
  3. "London almost sold arms to BA before war: Astonishing weapons sales plan for Argentina". Buenos Aires Herald. 29 June 2005. Archived from the original on 5 June 2013. Retrieved 4 January 2014.
  4. "Indian Navy to bid adieu to Sea Harrier Fighters". Indian Navy. Archived from the original on 10 May 2016. Retrieved 9 May 2016.
  5. Hiranandani 2000, p. 276.
  6. Tellis, Ashley J. (1985). "The Naval Balance in the Indian Subcontinent: Demanding Missions for the Indian Navy". Asian Survey. Berkeley, California: University of California Press. 25 (12): 1186–1213. doi:10.2307/2644281. ISSN 0004-4687. JSTOR 2644281.
  7. 7.0 7.1 7.2 GANGULY, NIVEDITA (8 September 2022). "Resting in Visakhapatnam's Rajiv Smruthi Bhavan is the last of Navy's Sea Harrier jet fighters". The Hindu. Retrieved 17 January 2024.
  8. "Hover and out: UK Royal Navy retires the Sea Harrier". Flightglobal. 28 March 2006. Archived from the original on 1 January 2014. Retrieved 31 December 2013.
  9. "Andhra CM Inaugurates Sea Harrier Museum". Outlook Publishing India. 12 May 2023. Retrieved 17 January 2024.
  10. "AP CM inaugurates sea harrier museum". TELANGANA TODAY. 12 May 2023. Retrieved 17 January 2024.