Jump to content

సీలియో*

వికీపీడియా నుండి
సీలియో*
తరహా
స్థాపన1985
ప్రధానకేంద్రముఫ్రాన్స్
కీలక వ్యక్తులుక్రిస్టియన్ పైమోంట్ (CEO), మార్క్, లారెంట్ గ్రాస్ మన్(వ్యవస్థాపకులు)
పరిశ్రమరిటెయిల్
ఉత్పత్తులువస్త్రాలు
రెవిన్యూ500 మిలియన్ యూరోలు
ఉద్యోగులు1800
వెబ్ సైటుwww.celio.com
ప్యారిస్ లోని సీలియో ఫ్లాగ్ షిప్ స్టోరు
బెల్జియంలో సీలియో

సీలియో* అనునది అంతర్జాతీయ ప్రమాణాలతో వస్త్రాలను రూపొందించే ఒక రిటైలర్. ఇది ఫ్రాన్స్ లోని సెయింట్-ఓయువెన్ లో ప్రారంభించబడింది.

ప్రాథమికంగా ఐరోపా ఖండానికి సరసమైన ధరలకే ఆధునిక వస్త్రాలను రూపొందిస్తుంది. సీలియో స్టోరులు ఫ్రాన్స్ లోని షాపింగ్ మాల్ లలోను, షాపింగ్ డిస్ట్రిక్ట్ లలోను కనిపిస్తుంటాయి. 2005 లో ఈ సంస్థ 1,800 ఉద్యోగులను నియమించుకోగా, 1,500 స్టోరులలోను, మిగతావారు వేర్ హౌవుస్ లలోను పనిచేస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

1978 లో మార్క్, లారెంట్ గ్రాస్ మన్ సోదర ద్వయం సెయింట్ లాజారెలో ఉన్న వారి దుకాణంలో పనిని ప్రారంభించారు. 1980 నాటికి దానిని ఇతర ప్రదేశాలకు విస్తరించారు. 1985 నాటికి గానీ సిసలైన సీలియో రూపం దాల్చలేదు. 1989 నాటికి ఫ్రాన్సు లోని 34 చోట్ల స్థాపించబడింది. 1992 కు ఇది 150కి చేరినది. తర్వాత బెల్జియం, స్పెయిన్, 1994లో పోర్చుగల్, 1999లో ఇటలీలో స్థాపించారు.

భారతదేశంలో సీలియో

[మార్చు]

భారతదేశంలో సీలియో జాయింట్ వెంచర్ ఉత్పత్తిగా ఫ్యూచర్ గ్రూప్కి చెందిన ప్యాంటలూన్ రిటెయిల్ ఇండియా లిమిటెడ్ చే రూపొందించబడుతున్నది. ట్రౌజర్లు, షర్టులు, స్వెటర్ లు, టీ-షర్టులు, పోలో షర్టులు, సూట్లు, జాకెట్లు, బెల్టులు, టైలు, బాక్సర్ షార్టులు అందిస్తుంది.

సీలియో పంచసూత్రాలు

[మార్చు]
  • మగతనం
  • ఆకర్షణీయం
  • పారదర్శకత
  • విలువలు
  • సేవ

నిర్దేశిత వినియోగదారులు

[మార్చు]

పట్టణంలో నివసించే ముప్పై ఏళ్ళ ఉద్యోగి. ఫ్యాషన్ ని గుడ్డిగా అనుసరించకుండా, విచక్షణతో మంచి దుస్తులను వేసుకోవాలనుకొనేవారు, దుస్తులు సౌకర్యంగానూ, చూడటానికి ఆకర్షణీయంగా కనిపించాలనుకొనేవారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సీలియో*&oldid=2885885" నుండి వెలికితీశారు