సీతే రాముడైతే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సారథి స్టూడియోస్ వారి 1979 డిసెంబర్ 14 విడుదలైన సీతే రాముడైతే చిత్రానికి దర్శకుడు బోయిన సుబ్బారావు.ఈ చిత్రంలో శంకర్ నాగ్ , జయసుధ, శ్రీధర్, నూతన్ ప్రసాద్, ప్రభాకరరెడ్డి , జయమాలిని ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం సమకూర్చారు.

సీతే రాముడైతే
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బోయిన సుబ్బారావు
తారాగణం శంకర్ నాగ్,
జయసుధ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ సారధీ స్టూడియోస్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

డాక్టర్ కృష్ణ, రాము ప్రాణస్నేహితులు. దేశసంచారం చేస్తూ రాము డాక్టర్ కృష్ణను చూడడానికి వస్తాడు. ఒక గెస్ట్ హవుస్‌లో మకాం పెడతాడు. అక్కడ సీత అనే అమ్మాయితో రాముకు పరిచయమై పరస్పరం ప్రేమించుకుంటారు. వీరిద్దరికీ పెళ్లి కుదురుస్తాడు కృష్ణ. అయితే ఆ ఊళ్ళో ఒక దుష్టచతుష్టయం వుంది. వాళ్ళు నలుగురూ కలిసి సీతను బలవంతం చేయబోతే రాము వాళ్ళకు బుద్ధిచెబుతాడు. ఆ సంఘటనతో రాముపై పగబడుతుంది ఆ దుష్టచతుష్టయం. కాపు కాచి ఒంటరిగా వస్తున్న రామును హత్యచేయిస్తారు. సీతారాముల పెళ్లి రోజునే రాము మరణవార్త తెలియడంతో సీత ఆవేశంతో పరిగెత్తి మెట్ల మీద నుండి క్రిందకు పడుతుంది. తలకు గాయమై మతి స్థిమితం తప్పుతుంది. సీతని డాక్టర్ కృష్ణ తన ఇంటికి తీసుకువెళతాడు. అంతకు ముందు చనిపోయిన రాము మెదడును తీసి భద్రం చేసిన డాక్టర్ కృష్ణ మతిభ్రష్ట అయిన సీతకు ఆ మెదడును అమరుస్తాడు. దీనితో సీతే రాముడవుతుంది. సీతే రాముడయితే జరిగినదేమిటి? దుష్టచతుష్టయం తమ పాప ఫలాన్ని ఏవిధంగా అనుభవించింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు క్లైమాక్స్ దృశ్యాలలో లభిస్తాయి[1].

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.అమ్మలారా జేజమ్మలారా రాముడొస్తాడమ్మ , రచన: సి నారాయణ రెడ్డి, గానం.శిష్ట్లా జానకి

2.ఆమనిలో కోయిలవో వేసవిలో వెన్నెలలో , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల కోరస్

3.ఏమి అందమేమి అందమమ్మో ఎంత వయసు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.కాళినిరా భద్రకాళినిరా కాలకంఠ, రచన: దాశం గోపాలకృష్ణ, పులపాక సుశీల

5 . సోది కావాలా నా సోకు కావాలా ఎవరికి చెప్పండి, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి

6.అడిగితే ఇవ్వనా అందమే ముడుపుగా , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం.

మూలాలు

[మార్చు]
  1. గాంధి (19 December 1979). "చిత్రసమీక్ష సీతేరాముడైతే?". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 257. Retrieved 4 January 2018.[permanent dead link]

2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటిలింకులు

[మార్చు]