సి.హెచ్. ఆదినారాయణ రెడ్డి
చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 - | |||
ముందు | పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | మూలే సుధీర్ రెడ్డి | ||
నియోజకవర్గం | జమ్మలమడుగు నియోజకవర్గం | ||
మాజీ రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 - 2019 | |||
తరువాత | మోపిదేవి వెంకటరమణ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 4 జులై 1958 జమ్మలమడుగు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్ట్, తెలుగుదేశం పార్టీ, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | సుబ్బరామిరెడ్డి, వెంకట సుబ్బమ్మ | ||
జీవిత భాగస్వామి | అరుణమ్మ | ||
సంతానం | సుధీర్‌రెడ్డి, దీప్తి | ||
నివాసం | జమ్మలమడుగు |
చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయంగా నాయకుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2017 నుండి 2019 వరకు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రిగా పని చేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఆదినారాయణ రెడ్డి 4 జులై 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, జమ్మలమడుగులో సుబ్బరామిరెడ్డి, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కాన్పూరు యూనివర్సిటీ నుండి 1980లో ఎమ్మెస్సీ - కెమిస్ట్రీ పూర్తి చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జమ్మలమడుగు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2] ఆయన తరువాత టీడీపీలో చేరి 2017 నుండి 2019 వరకు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రిగా పని చేశాడు.[3][4] ఆదినారాయణ రెడ్డి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[5] ఆయన 22 అక్టోబర్ 2019న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[6]
ఆదినారాయణ రెడ్డి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై,[7] నవంబర్ 12న శాసనసభలో విప్‌గా నియమితుడయ్యాడు.[8][9][10]
మూలాలు
[మార్చు]- ↑ Andrabhoomi (3 April 2017). "కొత్త మంత్రుల పుట్టుపూర్వోత్తరాలు". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Sakshi (9 October 2013). "నేడు వైఎస్‌ఆర్‌సీపీలోకి ఆది". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Andhrajyothy (16 September 2017). "ఆక్వాతో రూ.13 వేల కోట్ల ఆదాయం: మంత్రి ఆదినారాయణ రెడ్డి". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Sakshi (26 May 2019). "'ఆది' నుంచి పార్టీ అంతం వరకూ..." Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Sakshi (22 October 2019). "కమలం గూటికి.. ఆదినారాయణరెడ్డి". Archived from the original on 2019-10-22. Retrieved 10 December 2021.
- ↑ Election Commision of India (4 June 2024). "AP Assembly Election Results 2024 - Jammalamadugu". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ Eenadu (12 November 2024). "ఏపీ శాసనసభలో చీఫ్‌విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో అనురాధ". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ Andhrajyothy (13 November 2024). "శాసనసభ చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ Eenadu (13 November 2024). "విధేయతకు అందలం". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.