సి.హెచ్‌. ద్వారకా తిరుమలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.హెచ్‌. ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డీజీపీ)
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 మే 19

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 - 2024

వ్యక్తిగత వివరాలు

జననం 1960
దేవాపురం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
సంతానం ఇద్దరు కుమార్తెలు
వృత్తి పోలీస్ అధికారి (ఐపీఎస్ అధికారి)

సి.హెచ్‌. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన 2024 జూన్ 15న ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్(డీజీపీ)గా నియమితుడయ్యాడు. అంతకుముందు ఆయన ఏపీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సి.హెచ్‌. ద్వారకా తిరుమలరావు గుంటూరులోని దేవాపురంలో సామాన్య కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ విభాగంలో అధికారి. తిరుమలరావు కృష్ణ నగర్‌లోని మున్సిపల్‌ స్కూల్లో ఐదో తరగతి వరకు, ఆ తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు, సెంట్రల్‌ యూనివర్సిటీలో మేథ్స్‌‌లో గోల్డ్‌మెడల్‌ అందుకొని కొంతకాలం గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో మేథమేటిక్స్‌ లెక్చరర్‌గా పని చేసి 1989లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు.

వృత్తి జీవితం

[మార్చు]

ద్వారకా తిరుమలరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు ఏఎస్పీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత కామారెడ్డి, ధర్మవరం ఏఎస్పీగా, నిజామాబాద్‌ జిల్లా ఆపరేషన్స్‌ విభాగం అదనపు ఎస్పీగా, అనంతపురం, కడప, మెదక్‌ జిల్లాల ఎస్పీగా పని చేశాడు. ఆయన హైదరాబాద్‌ రేంజ్‌లతో పాటు ఎస్‌ఐబీలో డీఐజీగా, చెన్నై సీబీఐలో కొంతకాలం పని చేసి ఆ తరువాత తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్టోపస్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగాల్లో ఐజీగా పని చేసి ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా పని చేశాడు.

ద్వారకా తిరుమలరావు 2014లో రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత 2021 జూన్‌ నుంచి ఆర్టీసీ ఎండీగా పని చేసి,[3] సీనియార్టీ ప్రకారం 2024 జూన్ 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యాడు.[4] ఆయన జూన్ 21న డీజీపీగా భాద్యతలు చేపట్టాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (19 June 2024). "Dwaraka Tirumala Rao is new DGP of Andhra Pradesh" (in Indian English). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  2. Eenadu (20 June 2024). "ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు". Archived from the original on 20 June 2024. Retrieved 20 June 2024.
  3. The Hindu (1 June 2021). "Dwaraka Tirumala Rao is APSRTC Managing Director" (in Indian English). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  4. "ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ద్వారకా తిరుమలరావు". 19 June 2024. Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  5. Sakshi (22 June 2024). "డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  6. Eenadu (22 June 2024). "డీజీపీ గా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.