సి.రామాచార్యులు
సి.రామాచార్యులు | |
---|---|
జననం | 1919 |
మరణం | 1998 |
జాతీయత | భారతీయులు |
జీవిత భాగస్వామి | రాజ్యలక్ష్మి |
చిలకమర్రి రామాచార్యులు(1919-1998) కూచిపూడి నృత్య కళాకారుడు, నాట్యాచార్యుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు 1919లో కృష్ణా జిల్లా, నూజివీడు గ్రామంలో ఒక పండితుల కుటుంబంలో జన్మించాడు.[1] ఇతడు కూచిపూడి నృత్యాన్ని వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి వద్ద అభ్యసించాడు. 1930లో ఇతని వివాహం రాజ్యం లక్ష్మితో జరిగింది. నాట్యాభ్యాసం అనంతరం ఇతడు మొదట ఏలూరులో బందా కనకలింగేశ్వరరావు, పసల సూర్యచంద్రరావు, ఆవేటి పూర్ణిమ మొదలైన వారు ప్రారంభించిన కళాక్షేత్రంలో కూచిపూడి నృత్య శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు . గుడిమెట్ల కృష్ణ, సుబ్బారావు, యామినీ కృష్ణమూర్తి, కాశీ వైజయంతి మొదలైన వారు ఇతని వద్ద కూచిపూడిలో శిక్షణను పొందారు. గుజరాత్‌లో స్థిర పడిన మృణాళినీ సారాభాయ్ ప్రోత్సాహంతో ఇతడు అహ్మదాబాదులో "దర్పణ అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్"లో కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఇతడు మరణించే వరకూ ఈ అకాడమీలో నాట్యాచార్యునిగా పనిచేశాడు.
ఇతడు ప్రదర్శనపై అంతగా ఆసక్తిని చూపించకుండా పరిశోధన, శిక్షణలపై ఎక్కువ దృష్టిని పెట్టాడు. కరణములు, జావళీలు, పదాలు మొదలైన వాటిపై పరిశోధనలు జరిపాడు. మండోదరి శపథం, శివసప్త తాండవాలు , పార్వతీ లాస్య తాండవాలు , అలిమేలు మంగ విలాసం, త్రిపుర సుందరీ తాండవం, తారకాసుర సంహారం, అర్ధ నారీశ్వరం మొదలైన నృత్య నాటికలను రూపొందించాడు. ఆలయ నాట్య సంప్రదాయంలో "ప్రేంఖీణీ నృత్యం"ను రూపొందించాడు.[2]
1978లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి అవార్డును ప్రదానం చేసింది.
రచనలు
[మార్చు]- కూచిపూడి ఆరాధన నృత్యములు
- అండర్స్టాండింగ్ కూచిపూడి (మల్లికా సారాభాయ్తో కలిసి)
మూలాలు
[మార్చు]- ↑ Gudipoodi Srihari (5 May 2011). "A danseur's tale". The Hindu. Retrieved 13 May 2021.
- ↑ ఓలేటి రంగమణి (2015). నృత్య సంహిత (1 ed.). హైదరాబాదు: ఓలేటి రంగమణి. Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 13 May 2021.
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- 1919 జననాలు
- కూచిపూడి నృత్య కళాకారులు
- నాట్యాచార్యులు
- కృష్ణా జిల్లా వ్యక్తులు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- 1998 మరణాలు
- క్యాన్సర్ వ్యాధి మరణాలు
- కృష్ణా జిల్లా నాట్య గురువులు