Jump to content

సి.ఎస్.కృష్ణ అయ్యర్

వికీపీడియా నుండి
సి.ఎస్.కృష్ణ అయ్యర్
జననంమార్చి 23, 1916
మరణం1998
వృత్తికర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు, సంగీత గురువు

సి.ఎస్.కృష్ణ అయ్యర్(1916-1998) ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు కేరళ రాష్ట్రంలో పాలక్కాడు సమీపంలోని కల్పతి గ్రామంలో 1916, మార్చి 23న జన్మించాడు[1]. ఇతడు గాత్ర సంగీతాన్ని టి.ఎస్.సభేశ అయ్యర్, టైగర్ వరదాచారి, తంజావూరు కె.పొన్నయ్య పిళ్ళైల వద్ద చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత కళాశాలలో నేర్చుకున్నాడు. ఇతడు తన మొదటి సంగీత ప్రదర్శన 1937లో ఇచ్చాడు. ఇతడు తంజావూరు సంప్రదాయ శైలిలో పాడేవాడు. ఇతడు మలయాళంలో ఎన్నో కృతులకు రాగాలను సమకూర్చాడు[2]. ఇతడు సంగీత గురువుగా అనేక సంవత్సరాలు అనేక మందికి సంగీతం నేర్పాడు. ఇతడు తిరువంతపురంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో 1942లో అధ్యాపకుడిగా చేరాడు. తరువాత పాలక్కాడులోని చెంబై సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.[3] కె. జె. ఏసుదాసు, కె.వి.నారాయణస్వామి, రాజేశ్వరి సతీష్, అంబికాపురం జి.కె.శివరామన్, సాదనం హరికుమార్ మొదలైన వారు ఇతని శిష్యులలో కొంతమంది. ఇతనికి 1972లో కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు, 1994లో కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించాయి. 1994లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును ఇతనికి ప్రదానం చేశారు.

మూలాలు

[మార్చు]
  1. web master. "C. S. Krishna Iyer". SANGEET NATAK AKADEMI. Government of India. Archived from the original on 9 మార్చి 2021. Retrieved 19 February 2021.
  2. రాజేశ్వరీ సతీష్. "C.S. KRISHNA IYER (1916 – 1998)". Rajeswari Satish. Rajeswari Satish. Retrieved 19 February 2021.
  3. Ashok Madhav. "Great Composers of Kerala Desham". Carnatic Corner. Mohan Ayyar. Retrieved 19 February 2021.