Jump to content

సిల్వియా లైకెన్స్ హత్య

వికీపీడియా నుండి
సిల్వియా లైకన్స్
జననం
సిల్వియా మారీ లైకన్స్

(1949-01-03)1949 జనవరి 3
లెబనన్, ఇండియానా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
మరణం1965 అక్టోబరు 26(1965-10-26) (వయసు 16)
ఇండియానాపోలిస్, ఇండియానా, యు.ఎస్.ఎ
మరణ కారణం
  • సబ్డురల్ హెమటోమా
  • షాక్ (రక్త ప్రసరణ మండలం)
  • పోషకాహార లోపం
సమాధి స్థలంఓక్ హిల్ స్మశానము
లెబనాన్, ఇండియానా, యు.ఎస్.
40°02′54″N 86°27′14″W / 40.0484°N 86.4539°W / 40.0484; -86.4539
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పిల్లల హక్కుల దుర్వినియోగం, బాలలపై అశ్రద్ధ, బాలల హత్య

సిల్వియా లికెన్స్ హత్య 1965 అక్టోబరు 26న జరిగిన ఇండియానాలోని ఇండియానపొలిస్ ప్రాంతంలో జరిగిన బాల హత్య. 16 సంవత్సరాల వయసున్న బాలిక అయిన సిల్వియా లికెన్స్‌ను బందీగా ఉంచి, హింసకు గురిచేసి దారుణంగా హత్య చేసారు. ఈ హత్య ఆ కాలంలో సంచలనంగా మారింది. ఒక్కరోజులోనో, కొద్దిసేపటిలోనో జరిగిన హింస కాదు. కొన్ని నెలల పాటు చిత్రహింసలు పెట్టి, ఆహారం ఇవ్వకుండా బలవంతంగా హత్య చేసారు.[1]

ఆమె స్వభావం

[మార్చు]

ఆమె యుక్త వయస్సులో ఉండగా స్నేహితులకు, ఇరుగు పొరుగువారికి సహాయం చేసేది. ఇతర పనులు చేసి అప్పుడప్పుడు కొంచెం సంపాదించి అందులో కొంత అమ్మకు కూడా ఇచ్చేది. అందరితో కలిసిపోయి, నమ్మకంగా ఉండేది. అందరితో స్నేహంగా ఉండేది. ఆమె జుట్టు బ్రౌన్ రంగులో ఉండి భుజాల క్రిందికి ఉండేది. ఆమె స్నేహితులకి వండి పెట్టేది. ఆమె చురుకుగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ చిన్నప్పుడు తన సోదరులతో ఆటలాడే సమయంతో ఏదో తగలడం వల్ల ముందు పంటిని కోల్పోయింది. అందువలన ఆమె ఎప్పుడూ నోరు మూసుకునే నవ్వేది. ఆమెకు సంగీతం పట్ల అభిమానం కూడా ఉండేది. ముఖ్యంగా బీటిల్స్ సంగీతాన్ని ఇష్టపడేది. ఆమె తన చెల్లెలికి ఎప్పుడూ సహాయకారిగా, రక్షణగా ఉండేది. [2] అనేక సందర్భాల్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు స్థానిక స్కేటింగ్ రింక్‌ను వెళ్తూ ఉండేవారు. ఆమె చెల్లెలు జెన్నీకి ఒక కాలు అంగవైకల్యంగా ఉండేది. స్కేటింగ్ వద్ద జెన్నీ ఒకే రోలర్ స్కేట్‌ను తన బలమైన పాదానికి కట్టుకునేది. సిల్వియా ఆమెను తోసుకుంటూ తీసుకు వెళ్ళేది,

నేపథ్యం

[మార్చు]

సిల్వియా, జెన్నీల తల్లిదండ్రులు సర్కస్‌లో పని చేస్తూ ఊళ్లు తిరుగుతూ ఉండేవారు. ఇలా వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నందున పిల్లల చదువు పాడవుతుందని బెనెస్యూయ్‌స్కీ దగ్గర పేయింగ్ గెస్టులుగా పెట్టి వెళ్లారు[3]. అందుకు ప్రతిఫలంగా వారానికి ఇరవై డాలర్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రెండు వారాల అడ్వాన్స్ కూడా చెల్లించారు. దాంతో బెనెస్యూయ్‌స్కీ వారిని రెండు వారాలు పిల్లల్ని బాగానే చూసింది[3]. అలా ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఒక రోజు సిల్వియా హత్యకు గురయింది. వెంటనే బెనెస్యూయ్‌స్కీ పోలీసులకు పిర్యాదు చేసింది.

దర్యాప్తు

[మార్చు]
గెట్రూడ్ బెనెస్యూయ్‌స్కీ

అమెరికాలోని ఇండియానాపోలిస్ ప్రాంతంలో ఉన్న గెట్రూడ్ బెనెస్యూయ్‌స్కీ ఇండిలో ఆమె పేయింగ్ గెస్టుగా ఉండి హత్యకు గురి కాబడింది. అందువలన పోలీసులు ఆ యింటి యజమాని ఐన గెట్రూడ్ బెనెస్యూయ్‌స్కీ ని ప్రశ్నించారు. దానికి ఆమె తనకు ఆ హత్య గురించి తెలియదనీ, ఆమెకు చాలా మంది అబ్బాయిలలో సంబంధం ఉండేదనీ, వారం రోజుల క్రితం ఆ యింటి నుండి వెళ్ళి హత్య జరిగిన ఉదయమే తన యింటికి వచ్చిందనీ, ఆమెతో పాటు దిగబెట్టడానికి ఇద్దరు అబ్బాయిలు వచ్చారనీ, వారితో ఎందుకో గొడవ పడడం వల్ల వారు అమెను దారుణంగా కొట్టి చంపారని తెలియజేసింది. [4]

పోలీసు ఇనస్పెక్టరు ఆ యింటి బేస్‌మెంటు వైపు వెళ్ళి చూసే సరికి అక్కడ నేలమీద చెల్లాచెదురుగా పడేసి ఉన్న వస్తువుల మధ్య దుప్పటి కప్పి ఉంది సిల్వియా దేహం కనబడింది. దుప్పటిని తొలగించాడు. ఆమె నైట్ ప్యాంటు, టీషర్టు ధరించి ఉండటాన్ని గమనించాడు. ఆ షర్టు నిండా రక్తం నిండి ఉంది. తల పగిలి రక్తం ధార కట్టి ఉంది. పెదవులు చిట్లిపోయి, చేతుల మీద ఎక్కడ చూసినా గాయాలే అతనికి కనిపించాయి.

హత్యా నేరం ఆరోపించబడ్డ అబ్బాయిల గూర్చి యిండి యజమానికి అడిగే సరికి ఆమెకు తెలియదని చెప్పింది. అందువల్ల ఆ పార్థివ శరీరాన్ని పోస్టుమార్టం కు పంపించాడు ఇనస్పెక్టరు.

పోస్టు మార్టం ప్రకారం ఆ హత్య ఒక్కరోజులోనో, కొద్ది సేపటిలోనో జరిగింది కాదని తెలిసింది. ఆమె కొన్ని నెలల పాటు చిత్రహింసలకు గురి కాబడినట్లు తెలిసింది. ఆమె శరీరమంతా గాయాలతో నిండి ఉండడాన్ని గమనించారు. ఆమె కొన్ని నెలలుగా ఆహారం కూడా తీసుకోనట్లు గుర్తించారు. పోస్టు మార్టం రిపోర్టు ప్రకారం రేప్ జరగలేదు కానీ, అంతకంటే దారుణమైన హింసకు గురి కాబడినట్లు తెలిసింది. ఆమె జననాంగాలు దాదాపు ఛిద్రమైపోయి ఉన్నాయి. ఆమెను దారుణంగా ఎవరో హత్య చేసినట్లు తెలిసింది.

పోలీసు ఇనస్పెక్టరు ఆ యింటి యజమాని బెనెస్యూయ్‌స్కీ ని అనుమానించాడు. ఆమె తాను హత్య చేయలేదని, ఒకవేళ హత్య చేస్తే ఎందుకు పోలీసులకు తెలియజేస్తానని అన్నది. అదే విధంగా సిల్వియాతో పాటు ఆమె చెల్లెలు జెన్నీ కూడా ఆమె వద్ద ఉన్నట్లు తెలియజేసింది. కావాలంటే సిల్వియా చెల్లెలిని అడగమని చెప్పింది.

ఇంటిలోంచి బయటికి వచ్చిన జెన్నీని ప్రశ్నించే సరికి ఆమె కూడా ఇదివరకు యింటి యజమాని చెప్పినట్లు ఎవరితో గొడవ పడడం మూలంగా వారే చంపేశారని చెప్పింది. హత్యా ప్రదేశానికి అందరూ చేరే లోపు హంతకులు పారిపోయారని తెలియజేసింది.

పోలీసు అధికారి వారి మాటలను నమ్మి వెళ్ళిపోతుండగా ఎక్కడి నుండో ఒక కాగితం ఉండ అతని వద్ద పడింది. తెరచి చూసే సరికి అందులో " నన్ను ఇక్కడ నుండి బటయ పడేయండి అంకుల్. ఏం జరిగిందో నేను చెప్తాను- జెన్నీ" అని ఉంది.

అతను వెంటనే జెన్నీ వద్దకు చేరి ఏం జరిగిందో చెప్పమన్నాడు. ఆమె తెలియజేసిన విషయం విన్నాక అతను నిర్ఘాంత పోయాడు.

హత్యా విధానం

[మార్చు]

సిల్వియా తల్లిదండ్రులు బెనెస్యూయ్‌స్కీ కు వారానికి ఇరవై డాలర్ల చొప్పున చెల్లించేవారు. రెండు వారాలు చెల్లించి మూడోవారం డబ్బులు పంపించడం ఆలస్యం చేసారు. దీనితో బెనెస్యూయ్‌స్కీ వారి తల్లిదండ్రులు డబ్బులిస్తామని మోసం చేసారనే నెపంతో పిల్లలకు తిట్టడం మొదలు పెట్టింది. స్కూలుకు పంచించడం మానివేసింది. వికలాంగురాలైన జెన్నీని కూడా "కుంటిది" అని దుర్భాషలాడేది. సమాధానం చెబితే తీవ్రంగా కొట్టేది. కానీ ఆలస్యంగా నైనా వారి తల్లిదండ్రులు డబ్బులు పంపించేవారు. కానీ బెనెస్యూయ్‌స్కీ ప్రవర్తమ మారలేదు. ఆ డబ్బు సరిపడదనీ, దానితో ఆమెను పోషించలేనని కొంత కాలం పాటు తిండి పెట్టడం మానివేసింది. వారు ఆకలికి అల్లాడిపోయేవారు. ఈ క్రూర చర్యలకు సిల్వియా భరించేది కానీ జెన్నీ భరించలేక ఏడ్చేది. దీని వల్ల ఒక రోజు సిల్వియా దొంగతనంగా వంటగది నుండి రొట్టెను తెచ్చి చెల్లెలికి పెట్టింది. అది తెలిసి బెనెస్యూయ్‌స్కీ ఉగ్రరూపం దాల్చి విపరీతంగా కొట్టి బేస్‌మెంటులో కట్టి పడేసింది.

ఆమె చేసిన హింస చాలదన్నట్లు తన పిల్లల్ని, వాళ్ల స్నేహితులను, ఆడుకోవడానికి వచ్చిన ఇరుగు పొరుగు పిల్లల్ని రెచ్చగొట్టేది. సిల్వియాని పంచింగ్ బ్యాట్ గా భావించి ఆడుకొమ్మని చెప్పేది.[5] దాంతో వాళ్ళు వికృతంగా ప్రవర్తించేవారు.[6] బెనెస్యూయ్‌స్కీ పెద్ద కుమార్తె పౌలా, సిల్వియా మీద వేడినీళ్ళు పోసేది. రెండవ కుమార్తె స్టెఫానీ సిల్వియా కడుపులో పదే పదే గుద్దేది. మిగతా పిల్లలంతా ఆమెను వివస్త్రను చేసి శరీరమంతా బ్లేడులతో కోసేవారు. సూదులతో గుచ్చేవారు. బెనె స్యూయ్‌స్కీ ఇంకా కొత్త రమమైన హింసా పద్ధతులనుపయోగించి హింసించేది. జననాంగాల్లో గాజు సీసాలు పెట్టేది[7][8]. టెస్ట్ చేస్తే నువ్వు చెడిపోయినదానివని తెలియడానికే అలా చేస్తున్నానని తెలిపేది. సూదులను కాల్చి ఆమె ఒంటి మీద "నేను చెడిపోయినదాన్ని" అని అక్షరాలు వచ్చేలా గుచ్చేది. చెక్క దిమ్మలతో రహస్యాంగాల మీద కొట్టేది. భరించలేక కేకలు పెడితే పైశాచికానందాన్ని పొందేది. ఆమె చర్మాన్ని 100 కన్నా ఎక్కువ సార్లు సిగరెట్లతో కాల్చడం చేసింది.[9] హింస, క్రూరత్వం, వేధింపుల వల్ల లైకెన్స్ క్రమంగా తీవ్రమైన బాధలకు గురయింది. [10] స్నానాలగదిలోకి ఆమెను ఏవిధంగాను పోనిచ్చేవారు కాదు. తానే మూత్రం పోసుకోవాలని బలవంతం చేశారు. అక్టోబర్ 6 న, గెట్రూడ్ ఆమెను నేలమాళిగలోకి విసిరి, ఆమెను కట్టివేసింది. ఇక్కడ, లికెన్స్‌ను నగ్నంగా ఉంచి, అరుదుగా ఆహరాన్నిచ్చేది. ఆమె తరచూ దప్పికతో ఉండేది. [11] అప్పుడప్పుడు, ఆమె హింస తారాస్థాయికి చేరి ఆమెను బేస్‌మెంట్ మెట్ల రైలింగుకు వ్రేలాడగట్టి ఆమె పాదాలు భూమికి తాకకుండా చేసేవారు. [12]

సిల్వియా తన విరిగిన ఎముకలు బాధ పెడుతుంటే, బ్లేడు కోతలు బాధ పెడుతుంటే తట్టుకోలేక ఏడ్చేది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎలా బయట పడాలో అర్థం కాక, ఎలాగో తంటాలు పడి పక్క ఊరిలో ఉన్న తన అక్క డయానాని ఉత్తరం రాసింది.[13] సిల్వియా, జెన్నీలు తమ వద్ద ఉండడానికి ఎత్తు వేస్తున్నట్లు భావించి డయానా, ఆమె భర్త ఆ ఉత్తరాన్ని చించి వేసారు. కానీ ఆ ఉత్తరం రాసిన సంగతి బెనెస్యూయ్‌స్కీకి తెలిసి పోయింది. వెంటనే సిల్వియాని వదిలించు కోవడానికి ప్లాన్ వేసింది.

తనని ఎక్కడికైనా తీసుకెళ్ళి వదిలేస్తే చస్తుంది అనుకుంది. ఆ నేరం తన మీదకు రాకుండా ఉండెందుకు "నేను నా ప్రియుడితో పారిపోతున్నాను" అని ఉత్తరం రాసి సిల్వియాతో బలవంతంగా సంతకం చేయించింది. ఆమె ఎత్తుగడ గ్రహించిన సిల్వియా అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించింది కానీ ఆమెకు సత్తువ లేదు. అందుకని బెనెస్యూయ్‌స్కీ కు దొరికిపోయింది. ఆ తర్వాత వాళ్లు పెట్టిన హింసను తాళలేక, ప్రాణాలే వదిలేసింది.

శిక్షలు

[మార్చు]

బెనెస్యూయ్‌స్కీతో పాటు సిల్వియా ప్రాణాలు పోవడానికి కారణ మైన వాళ్లందరినీ కోర్టులో నిలబెట్టాడు ఇనస్పెక్టరు. అయితే రెండు పెళ్లిళ్లు విఫలమై, ఒంటరిగా కుటుంబాన్ని ఈదలేక, ఒక విధమైన మానసిక రుగ్మతకు గురవ్వడం వల్లే బెనెస్యూయ్‌స్కీ అలా చేసిందని భావించిన న్యాయస్థానం ఆమెకు మరణ శిక్ష వేయలేదు. ఆమెకు, ఆమె కూతురు పౌలాకి జీవితఖైదును విధించింది. మిగతా వాళ్లందరికీ వాళ్ల నేర తీవ్రతను బట్టి రెండు నుంచి ఇరవయ్యొక్కేళ్ల వరకూ శిక్షలు విధించింది.

అయితే, వీళ్లంతా తర్వాత బెయిలు మీద బయటికొచ్చేశారు. బెనెస్యూయ్‌స్కీ అయితే రెండేళ్లకే బయటికొచ్చింది. ఊపిరి తిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసే వరకూ మారు పేరుతో మరోచోట ప్రశాంతంగానే జీవించింది. మిగతావాళ్లు కూడా తమ కుటుంబాలతో సంతోషంగా జీవించారు. కానీ అక్క పడిన వేదనను కళ్లారా చూసిన జెన్నీ మాత్రం కొన్నేళ్ల వరకూ తేరుకోలేక పోయింది. వాళ్ల కుటుంబం సిల్వియాను మర్చిపోలేక నరక యాతన పడింది.

చిత్రం

[మార్చు]

ఈ యధార్థ ఘటన ఆధారంగా అమెరికాలో చాలా కథానికలు, "ది గర్ల్ నెక్స్ట్ డోర్ " అనే చిత్రాన్ని తీశారు.

మూలాలు

[మార్చు]
  1. "Laykens Silviya మృతి?". te.delachieve.com. Retrieved 2020-05-20.
  2. Dean, John (July 29, 2008). House of Evil: The Indiana Torture Slaying. ISBN 978-1-429-94402-1.
  3. 3.0 3.1 "The Sexual Aesthetic of Murder". The Village Voice. February 13, 1978. Retrieved March 30, 2019.
  4. "సిల్వియా లెకైన్స్... చెరిగిన చిరునవ్వు". Sakshi. 2015-09-27. Retrieved 2020-05-20.
  5. "Looking Back On Indiana's Most Infamous Crime, 50 Years Later".
  6. "When Sylvia Likens was Killed, Part of Our Childhoods Died, Too". The Indianapolis Star. October 8, 2018. Retrieved May 28, 2019.
  7. Dean, John (January 1999). The Indiana Torture Slaying: Sylvia Likens' Ordeal and Death. ISBN 978-0-960-48947-3.
  8. Dean, John (July 29, 2008). House of Evil: The Indiana Torture Slaying. ISBN 978-0-312-94699-9.
  9. "Teen Girl Fatally Bullied in Indiana House of Horrors". NY Daily News (in ఇంగ్లీష్). Archived from the original on 2020-08-13. Retrieved August 4, 2017.
  10. Dean, John (July 29, 2008). House of Evil: The Indiana Torture Slaying. ISBN 978-1-429-94402-1.
  11. [1] Archived 2019-04-02 at the Wayback Machine Jenny Fay Likens
  12. Dean, John (January 1999). The Indiana Torture Slaying: Sylvia Likens' Ordeal and Death. ISBN 978-0-960-48947-3.
  13. "No Rescue In Sight".

బాహ్య లంకెలు

[మార్చు]