సిరిశెట్టి సంకీర్త్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరిశెట్టి సంకీర్త్ గౌడ్
జననం1992
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐ.పి ఎస్ ఆఫీసర్
తల్లిదండ్రులు
  • సత్యనారాయణ గౌడ్ (తండ్రి)

సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ 2019 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన సివిల్ సర్వీసెస్ - 2019 ఫలితాల్లో 330వ ర్యాంకును సాధించాడు.[1] హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం పోస్టింగులుల్లో భాగంగా ఆయనను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కేడర్‌కు కేటాయించింది.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సంకీర్త్ 1992లో తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి లో జన్మించాడు. ఆయన బెల్లంపల్లిలోని మదర్స్ కాన్వెంట్ హైస్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్, ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.[3]

వృత్తి జీవితం

[మార్చు]

సిరిశెట్టి సంకీర్త్‌ సివిల్ ఇంజినీరింగ్ లో ఉన్నప్పుడే రెండుసార్లు సివిల్స్ పరీక్ష రాశాడు, 2014లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక సివిల్స్‌ వైపు దృష్టి పెట్టి ఢిల్లీలో సివిల్స్‌కి కోచింగ్‌ తీసుకున్నాడు. ఆయన కుటుంబానికి ఆర్థిక చేయూత అందించేందుకు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన పరీక్షల్లో పోలీస్‌ అధికారి కావాలనే లక్ష్యంతో రాష్ట్ర forest Range Officer రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగ నియామక ప్రక్రియలో 24 kms కొన్ని సెకన్ల తేడాతో విఫలమై,[4] 2018లో irrigation department lo ఉద్యోగం పొంది ఆదిలాబాద్‌లో మిషన్ భగీరథలో AEE అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశాడు.

సిరిశెట్టి సంకీర్త్‌ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూనే ఆశించిన స్థాయి ఫలితం రాలేదనే కసితో మళ్లీ సివిల్స్ కు ప్రిపేర్‌ అయి అయిదో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ - 2019 ఫలితాల్లో 330వ ర్యాంకును సాధించాడు. ఆయన హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం పోస్టింగులుల్లో భాగంగా ఆయనను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కేడర్‌కు కేటాయించింది.[5]

మూలాలు

[మార్చు]
  1. Mic Tv (4 August 2020). "సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు వీళ్లే". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  2. Sakshi (21 January 2021). "తెలంగాణకు నలుగురు కొత్త ఐపీఎస్‌లు". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  3. Indian Masterminds (13 August 2020). "Slow Learner in School, but hitting big in UPSC". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  4. Prajasakti (11 November 2021). "అప్పుడు ఎస్‌ఐ పరీక్షలో ఫెయిల్‌.. ఇప్పుడు ఐపిఎస్‌ ఆఫీసర్‌ .. | Prajasakti". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  5. News18 Telugu (11 November 2021). "అప్పుడు ఎస్‌ఐ పరీక్షలో ఫెయిల్.. ఇప్పుడు ఐపీఎస్‌ ఆఫీసర్.. తెలంగాణ యువకుడి సక్సెస్ స్టోరీ". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)