Jump to content

సిద్ధగురు

వికీపీడియా నుండి
సిద్ధగురు
జననం (1968-04-27) 1968 ఏప్రిల్ 27 (వయసు 56)
కప్పట్రాళ్ళ, ఆంధ్ర ప్రదేశ్
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లురమణానంద మహర్షి
వృత్తిశక్తిపాత సిద్ధయోగీశ్వరులు, సిద్ధగురువు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తత్త్వ వేత్త
గుర్తించదగిన సేవలు
శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమశివుడు గ్రంథ వితరణ

సిద్ధగురు రమణానంద మహర్షి భారతీయ ఆధ్యాత్మిక లివింగ్ సిద్ధ గురువు. ఈయనను 'సిద్ధగురు' అని శిష్యులు సంబోధించెదరు. ఆయన "శివుడే దేవాది దేవుడు ఆదిదేవుడు పరమపురుషుడు", "ఆత్మదర్శన అనుభూతి", "శక్తిపాతం ", "శిరిడి సాయి అనుగ్రహ సేవా రహస్యం " రచయిత. శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం -రమణేశ్వరంలో 1008 శివలింగాలను విజయవంతంగా ప్రతిష్ఠ చేసినందుకు "ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్" ఆయనను సత్కరించింది.[1][2]

జీవితం తొలి దశలో

[మార్చు]

సిద్ధగురు రమణానంద మహర్షి వారు 1968 ఏప్రిల్ 27 వ సంవత్సరములో కీ.శే. శ్రీ గూడూరు నరసయ్య, శ్రీమతి నాగమ్మ దంపతులకు జన్మించారు.[3] మహర్షి వారు అనంతపురం JNTU కళాశాలనుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైనారు. ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత 1995 నుండి 2001 వరకు mathematics lecturer గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. సిద్ధగురు, విజయలక్ష్మి గారిని 1995 మార్చి 8 న వివాహం చేసుకున్నారు, ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఆయనకు 1995వ సంవత్సరం జూన్ 29వ తేదీన ఆత్మసాక్షాత్కారం కలిగినది.ఆయనకు తన గురువైన మాత శ్రీ పూర్ణానందగిరి యోగిని వారు "సిద్ధగురు రమణానంద మహర్షి" అని ఆధ్యాత్మిక నామకరణం చేసారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Siddhaguru And Self-Realization - An Intuitive Connection". Outlook India.
  2. "SIDDHAGURU – Understanding an accomplished enlightened Guru". Telegraph India.
  3. "'A guru who is always conscious of the absolute bliss is the right guru', says shaktipat yogi Siddhaguru". The Statesman.[permanent dead link]
  4. "Siddhaguru - A Guru with endearing dimension". Mid Day.