సిడ్నీ లూమెట్
సిడ్నీ లూమెట్ | |
---|---|
జననం | సిడ్నీ ఆర్థర్ లూమెట్ 1924 జూన్ 25 సిడ్నీ ఆర్థర్ లూమెట్, యుఎస్ |
మరణం | 2011 ఏప్రిల్ 9 న్యూయార్క్, యుఎస్ | (వయసు 86)
విద్యాసంస్థ | కొలంబియా విశ్వవిద్యాలయం |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1930–2007 |
జీవిత భాగస్వామి | గ్లోరియా వాండర్‌బిల్ట్
(m. 1956; div. 1963)గెయిల్ జోన్స్
(m. 1963; div. 1978)మేరీ గింబెల్ (m. 1980) |
పిల్లలు | 2, జెన్నీ లూమెట్ |
తల్లిదండ్రులు |
|
సిడ్నీ ఆర్థర్ లూమెట్[1] (1924, జూన్ 25 – 2011, ఏప్రిల్ 9) అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. నాటకరంగంలో తన కళారంగ జీవితాన్ని ప్రారంభించిన లూమెట్ తరువాత టెలివిజన్, సినిమారంగంలోకి వచ్చాడు. న్యూయార్క్ నగరంలో నాటకాలను రూపొందించి, ప్రఖ్యాతిని పొందాడు. 1957 - 2007 మధ్యకాలంలో 52 సినిమాలకు దర్శకత్వం వహించాడు. మార్టిన్ స్కోర్సెస్, రాబర్ట్ ఆల్ట్‌మాన్, వుడీ అలెన్ వంటి కొత్త హాలీవుడ్ సినిమా నిర్మాతలలో భాగంగా లూమెట్ తరచుగా గుర్తించబడుతున్నాడు. ఐదు అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన లూమెట్, 2004లో అకాడమీ గౌరవ పురస్కారాన్ని అందుకున్నాడు.[2]
జననం
[మార్చు]లూమెట్ 1924, జూన్ 25న ఫిలడెల్ఫియాలో జన్మించాడు. మాన్‌హట్టన్‌లోని లోయర్ ఈస్ట్ సైడ్ పరిసరాల్లో పెరిగాడు.[3] న్యూయార్క్ నగరంలోని ప్రొఫెషనల్ చిల్డ్రన్స్ స్కూల్, కొలంబియా విశ్వవిద్యాలయంలో నాటకరంగ నటనలో శిక్షణ పొందాడు.[4][5]
నాటకరంగం
[మార్చు]న్యూయార్క్ నగరంలోని యాక్టర్స్ స్టూడియోలో ప్రారంభ తరగతిలో సభ్యుడిగా ఉన్నాడు.[6] తొలినాళ్ళలో లూమెట్ ఆఫ్-బ్రాడ్‌వేలో నటించడం ప్రారంభించాడు. 1935 నాటకం డెడ్ ఎండ్ అనే బ్రాడ్‌వే నాటకంలో తొలిసారిగా నటించాడు. తరువాత నైట్ ఆఫ్ ది ఔక్ (1956), కాలిగులా (1960), నోవేర్ టు గో బట్ అప్ (1962) వంటి బ్రాడ్‌వే నాటకాలకు దర్శకత్వం వహించాడు.
నటుడిగా
- ది ఎటర్నల్ రోడ్
- లాట్‌లోని స్కూల్‌హౌస్
- క్రిస్మస్ ఈవ్
- బ్రూక్లిన్
దర్శకుడిగా
- నైట్ ఆఫ్ ది ఔక్
- కాలిగులా
- నౌ హియర్ టు గో బట్ అప్
టెలివిజన్
[మార్చు]లూమెట్ టెలివిజన్‌లో కూడా ప్రసిద్ది చెందాడు. ఎన్.బి.ఏ. సండే షోకేస్ (1961) కోసం డ్రామా సిరీస్ నామినేషన్ కోసం అత్యుత్తమ దర్శకత్వం కోసం ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డును అందుకున్నాడు. గుడ్‌ఇయర్ టెలివిజన్ ప్లేహౌస్, క్రాఫ్ట్ టెలివిజన్ థియేటర్, ప్లేహౌస్ 90 కి కూడా దర్శకత్వం వహించాడు.
- ది బెస్ట్ ఆఫ్ బ్రాడ్‌వే
- ఎల్గిన్ అవర్
- స్టార్ స్టేజ్
- ఫ్రాంటియర్
- ఆల్కో అవర్
- గుడ్‌ఇయర్ ప్లేహౌస్
- క్రాఫ్ట్ థియేటర్
- డ్యూపాంట్ షో ఆఫ్ ది మంత్
- యునైటెడ్ స్టేట్స్ స్టీల్ అవర్
- ప్లే ఆఫ్ ది వీక్
- ప్లేహౌస్ 90
- ది ఐస్‌మ్యాన్ కమెత్
- 100 సెంటర్ స్ట్రీట్
సినిమారంగం
[మార్చు]12 యాంగ్రీ మెన్ (1957), డాగ్ డే ఆఫ్టర్‌నూన్ (1975), నెట్‌వర్క్ (1976), ది వెర్డిక్ట్ (1982) మొదలైన సినిమాలకు ఉత్తమ దర్శకుడు విభాగంలో నాలుగుసార్లు... ప్రిన్స్ ఆఫ్ ది సిటీ (1981) సినిమాకు ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఒకసారి మొత్తంగా ఐదుసార్లు అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యాడు. ది పాన్‌బ్రోకర్ (1961), ఎ వ్యూ ఫ్రమ్ ది బ్రిడ్జ్ (1962), లాంగ్ డేస్ జర్నీ టు నైట్ (1962), ఫెయిల్ సేఫ్ (1964), ది హిల్ (1965), మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ (1974), ఈక్వస్ (1977), ది విజ్ (1978), ది మార్నింగ్ ఆఫ్టర్ (1986), రన్నింగ్ ఆన్ ఎంప్టీ (1988), బిఫోర్ ది డెవిల్ నోస్ యు ఆర్ డెడ్ (2007) మొదలైన ఇతర సినిమాలకు దర్శకత్వం వహించాడు.
దర్శకత్వం వహించిన సినిమాలు (కొన్ని)
[మార్చు]- 12 యాంగ్రీ మెన్
- ది ఫ్యుజిటివ్ కైండ్
- లాంగ్ డేస్ జర్నీ ఇన్ నైట్
- ది పాన్ బ్రోకర్
- ది డెడ్లీ ఎఫైర్
- బై బై బ్రేవర్‌మాన్
- అపాయింట్మెంట్
- ఆండర్సన్ టేప్స్
- సెర్పికో
- లోవిన్ మోలీ
- నెట్‌వర్క్
- ఈక్వస్
- ది విజ్
- ప్రిన్స్ ఆఫ్ ది సిటీ
- డెత్‌ట్రాప్
- డేనియల్
- ది మార్నింగ్ ఆఫ్టర్
- గ్లోరియా
అవార్డులు, సన్మానాలు
[మార్చు]- 30వ అకాడమీ అవార్డులు (1957): ఉత్తమ దర్శకుడు, నామినేషన్, 12 యాంగ్రీ మెన్
- 48వ అకాడమీ అవార్డులు (1975): ఉత్తమ దర్శకుడు, నామినేషన్, డాగ్ డే ఆఫ్టర్‌నూన్
- 49వ అకాడమీ అవార్డులు (1976): ఉత్తమ దర్శకుడు, నామినేషన్, నెట్‌వర్క్
- 55వ అకాడమీ అవార్డులు (1981): ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, నామినేషన్, ప్రిన్స్ ఆఫ్ ది సిటీ
- 56వ అకాడమీ అవార్డులు (1982): ఉత్తమ దర్శకుడు, నామినేషన్, ది వెర్డిక్ట్
- 77వ అకాడెమీ అవార్డులు (2004): గౌరవ అకాడమీ అవార్డు, విజయం
12 యాంగ్రీ మెన్ సినిమాకు బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోల్డెన్ బేర్‌ను కూడా లుమెట్ అందుకున్నాడు. లాంగ్ డేస్ జర్నీ ఇంటు నైట్ (1962), ది హిల్ (1965), ది అపాయింట్‌మెంట్ (1969), ఎ స్ట్రేంజర్ అమాంగ్ అస్ (1992) సినిమాకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పామ్ డి'ఓర్‌కు నాలుగు నామినేషన్లు అందుకున్నాడు. ప్రిన్స్ ఆఫ్ ది సిటీ (1981) సినిమాకు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ గోల్డెన్ లయన్ అవార్డు ప్రతిపాదనను కూడా అందుకున్నాడు.
మరణం
[మార్చు]లూమెట్ తన 86 ఏళ్ళ వయస్సులో 2011, ఏప్రిల్ 9న మాన్‌హట్టన్‌లోని తన నివాసంలో లింఫోమాతో మరణించాడు.[4] 2011 ఏప్రిల్ లో లూమెట్ మరణించిన కొన్ని నెలల తర్వాత, న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్‌లో అనేకమంది వక్తలు, సినిమా నటీనటులతో లూమెట్ చేసిన కృషికి సంబంధించిన పునరాలోచన వేడుక జరిగింది.[7] 2015లో సిడ్నీ లుమెట్ అతని కెరీర్ గురించి నాన్సీ బ్యూర్‌స్కీ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ[8][9] 2017, జనవరిలో పిబిఎస్అమెరికన్ మాస్టర్స్ సిరీస్‌లో భాగంగా ప్రసారం చేయబడింది.[10][11][12]
మూలాలు
[మార్చు]- ↑ "Say How: L". National Library Service for the Blind and Print Disabled. Retrieved 2023-06-26.
- ↑ "Director Sidney Lumet wins honorary Oscar". Entertainment Weekly. Retrieved 2023-06-26.
- ↑ Clark, John (April 30, 2006). "New York City as Film Set: From Mean Streets to Clean Streets". The New York Times. ISSN 0362-4331. Retrieved 2023-06-26.
- ↑ 4.0 4.1 "Obituary: Sidney Lumet". BBC News. April 9, 2011. Retrieved April 10, 2011.
- ↑ "Film Obituaries; Sidney Lumet". The Daily Telegraph. London. April 9, 2011. Archived from the original on January 11, 2022. Retrieved 2023-06-26.
- ↑ Garfield, David (1980). "Birth of The Actors Studio: 1947–1950". A Player's Place: The Story of the Actors Studio. New York: MacMillan Publishing Co., Inc. p. 52. ISBN 0-02-542650-8.
- ↑ Fleming, Mike. "Lincoln Center Celebrates Sidney Lumet", June 27, 2011
- ↑ "Trailer Watch: Nancy Buirski Honors a Great in 'By Sidney Lumet'", Indiewire, April 1, 2016
- ↑ "Cannes: 'By Sidney Lumet' Doc Captures the Helmer's Radical, American Vision", The Hollywood Reporter, May 22, 2015
- ↑ "Treat Williams Recalls Sidney Lumet for PBS: He Was 'A Ball of Fire'", Parade, Jan. 2, 2017
- ↑ "PBS "American Masters"". Archived from the original on 2017-03-06. Retrieved 2023-06-26.
- ↑ "By Sidney Lumet". American Masters on PBS. December 7, 2016.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సిడ్నీ లూమెట్ పేజీ
- "Last Word" New York Times April 21, 2011, video (14 minutes)
- Archive of American Television, TV Legends interview, 1999 video, 6-parts, 3 hours
- Fresh Air interview from 2006 (audio)
- Sidney Lumet: The Prince of New York City