సికింద్రాబాదు సిర్పూరు కాగజ్‌నగర్ తెలంగాణ ఎక్స్ప్రెస్
భారతీయ రైల్వేస్ కు చెందిన దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న 17035/17036 నెంబర్లు గల సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన సికింద్రాబాద్ జంక్షన్ మరియుసిరిపూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే రైలు.[1]
17035 నెంబరు గల తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సిరిపూర్ కాగజ్ నగర్ మధ్య నడుస్తుండగా, తిరుగు ప్రయాణంలో 17036 నెంబరు గల రైలు సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు ప్రయాణిస్తూ తెలంగాణ ప్రయాణికులకు సేవలందిస్తోంది.[2]
17035 / 36 నెంబర్లు గల సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో 1 AC ఛైర్ కారు, 17 సాధారణ అన్ రిజర్వుడు బోగీలు, 2 సీటింగ్ కం లగేజ్ రాక్ బోగీలు ఉంటాయి. దీనికి ప్యాంట్రీ కారు బోగీ సౌకర్యం లేదు.[3]
భారతదేశంలో చాలా రైళ్లు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నడపబడుతున్నాయి. అదేవిధంగా భారతీయ రైల్వేలు రద్దీని బట్టి తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలుకు అదనంగా బోగీలు చేర్చడం, తగ్గించడం చేయవచ్చు.[4]
సేవలు
[మార్చు]17035 నెంబర్ గల సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ ఎక్స్ ప్రెస్... మొత్తం 297 కిలోమీటర్ల (185 మైళ్లు) దూరాన్ని 5 గంటల 25 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ సమయంలో రైలు సగటు వేగం 54.83 కిలోమీటర్లు/గంట చొప్పున ఉంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 17036 నెంబరు గల తెలంగాణ ఎక్స్ ప్రెస్ సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ మార్గంలో ఇదే దూరాన్ని 54 కిమీ/గంటల వేగంతో 5 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మొత్తం ప్రయాణ సగటు వేగం 55 కి.మీ./ గంట (గంటకు 34మైళ్లు) కంటే తక్కువ. సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీ ఈ రైలు టికెట్ ధరలో కలపరు.[5]
మార్గం
[మార్చు]17035 / 36 నెంబర్లు గల సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరి కాజీపేట జంక్షన్ ద్వారా పెద్దపల్లి, రామగుండం మీదుగా సిరిపూర్ కాగజ్ నగర్ చేరుకుంటుంది.[6]
ట్రాక్షన్
[మార్చు]తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రయాణించే మార్గమంతా కూడా పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది. ఈ రైలుకు లాలాగూడాకు చెందిన WAP 4 లేదా WAP 7 లోకోమోటివ్ ఇంజన్లను ఈ రైలు ప్రయాణ మార్గమంతా ఉపయోగిస్తారు.[7]
విభాగాలు:
[మార్చు]- భారతదేశంలోని పేరుగల ప్యాసింజర్ రైళ్లు
- తెలంగాణలో రైలు రవాణా సదుపాయాలు
మూలాలు
[మార్చు]- ↑ "దక్షిణ మధ్య రైల్వే". scr.indianrailways.gov.in. 12 జూలై 2014.
- ↑ "WAP4 తెలంగాణ ఎక్స్ప్రెస్ యానం - యౌతుబే". youtube.com. 5 ఏప్రిల్ 2014.
- ↑ "భారతీయ రైల్వే రిజర్వేషన్ల గురించి వాకబు చేసే వారికి సుస్వాగతం". indianrail.gov.in. 12 జూలై 2014. Archived from the original on 2017-07-24.
- ↑ "IRCTC ఆన్ లైన్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే విధానం". irctc.co.in. 5 ఏప్రిల్ 2014.
- ↑ "తెలంగాణ ఎక్స్ప్రెస్". cleartrip.com. 23 మార్చి 2015. Archived from the original on 2015-05-27. Retrieved 2015-03-23.
- ↑ "తెలంగాణ ఎక్స్ప్రెస్ రద్దు - హిందూ మతం". thehindu.com.
- ↑ "[IRFCA] IRFCA.org కు సుస్వాగతం, ఇంటర్నెట్ లో IRFCA యొక్క కుటుంబం". irfca.org. 12 జూలై 2014.