సింధువార పత్రి
స్వరూపం
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |

సింధువార పత్రి వావిలి వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది.
భౌతిక లక్షణాలు
[మార్చు]ఈ ఆకు తెలుపు, నలుపు అనే రెండు రకాల రంగుల్లో దొరుకుతుంది. ఆకారం వారాగ్రంతో భల్లాకారంగా ఉంటుంది. పరిమాణంలో చిన్నది. ఇది పెద్దపొద లేదా చిన్న వృక్షంగా పెరుగుతుంది. దీని ప్రతి రెమ్మకు ఐదు (5) ఆకులు వుంటాయి.
శాస్త్రీయ నామం
[మార్చు]ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం విటెక్స్ నెగుండొ (Vitex negundo).
ఔషధ గుణాలు
[మార్చు]ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు:[1]
- వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు.[2]
- వావిలి ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి.
- వావిలి ఆకులు వేసి, కాచిన నీటిలో స్నానం చేస్తే, వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది.
- పత్రాలు కషాయం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. పత్రాలతో గుంట గలగర ఆకు, తులసి, వాము, కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులు ముఖ్యముగా ర్యుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ కు బాగా ఉపశమనం కలుగుతుంది. పత్రాలను దిండులాగా తయారు చేసి, తల క్రింద పెట్టుకొని పడుకుంటే, తరచుగా వచ్చే తలనొప్పి, జలుబు మటుమాయం అవుతుందని అంటారు. పత్రాల రసం, పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధులకు ముక్కులో వేస్తే, ప్రథమ చికిత్సగా పనిచేస్తుంది. వావిలి పత్రాలలో గాడిదగడపాకు, జిల్లేడాకులు, ఆముదం ఆకులు, గుంటగలగర, కుప్పింటి కలిపి రసం తీసి, నువ్వులనూనెలో వేసి కాచి, కీళ్ల వాపులకు పై పూతగా వూస్తారు. పత్రాల రసంలో అల్లరసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
సువాసన గుణం
[మార్చు]ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.
ఇతర ఉపయోగాలు
[మార్చు]ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
- ఈ ఆకులతో పచ్చడి చేసుకుంటారు.
- వేడినీళ్ళలో వావిలి ఆకులు వేసి దానిలో గుడ్డ తడిపి కాపడం పెట్టుకుంటారు.
- కీళ్ళ సంబంధిత విషాలకు విరుగుడు కొందరు వాడుతూంటారు.
- ఈ ఆకుల వాసన చీకటి ఈగలు రాకుండా నిరోధిస్తుంది.
ఆయుర్వేదంలో
[మార్చు]ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు, బాలింత నొప్పులకు రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ సింధువార - వావిలి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 119.