Jump to content

సాహిబ్ సింగ్ వర్మ

వికీపీడియా నుండి
సాహిబ్ సింగ్ వర్మ
సాహిబ్ సింగ్ వర్మ


పదవీ కాలం
1996 ఫిబ్రవరి 27 – 1998 అక్టోబర్ 12
ముందు మదన్ లాల్ ఖురానా
తరువాత సుష్మా స్వరాజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1943-03-15)1943 మార్చి 15
ఢిల్లీ, బ్రిటిష్ ఇండియా
మరణం 30 జూన్ 2007(2007-06-30) (aged 64)
జోనైచా ఖుర్ద్, రాజస్థాన్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
సాహిబ్ కౌర్
(m. 1954)
సంతానం 5 (పర్వేశ్ వర్మ, సిద్ధార్థ్ సాహిబ్ సింగ్‌తో సహా)

సాహిబ్ సింగ్ వర్మ (15 మార్చి 1943 - 30 జూన్ 2007) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 1996 నుండి 1998 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేసి[2] ఆ తరువాత 1999 నుండి 2004 వరకు 13వ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర కార్మిక మంత్రిగా పని చేశాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చౌదరి సాహిబ్ సింగ్ 1943 మార్చి 15న ఢిల్లీలోని లక్రా జాట్స్‌లోని ముండ్కా గ్రామంలో జమీందార్ చౌదరి మీర్ సింగ్ లక్రా, భార్పాయి దేవి దంపతులకు జన్మించాడు. ఆయన అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్, (ఎంఏ ) మరియు లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని, లైబ్రరీ సైన్స్‌లో పిహెచ్‌డి డిగ్రీని పూర్తి చేసి ఆ తరువాత ఢిల్లీలోని భగత్ సింగ్ కళాశాలలో లైబ్రేరియన్‌గా పని చేశాడు.[4]

సాహిబ్ సింగ్ సాహిబ్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

సాహిబ్ సింగ్ వర్మ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చురుగ్గా పని చేసి వరల్డ్ జాట్ ఆర్యన్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 1977లో ఢిల్లీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. సాహిబ్ సింగ్ వర్మ జనతా పార్టీ, బిజెపి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 1993లో విద్య & అభివృద్ధి మంత్రిగా పని చేశాడు. 1996లో మదన్ లాల్ ఖురానాపై అవినీతి రావడంతో ఆయన రాజీనామా అనంతరం సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేశాడు. సాహిబ్ సింగ్ వర్మ 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఔటర్ ఢిల్లీ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2002లో వాజ్‌పేయి మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా పని చేశాడు. ఆయన 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాడు.

మరణం

[మార్చు]

సాహిబ్ సింగ్ వర్మ 2007 జూన్ 30న రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని ఖండురా 'మోడ్' సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు మినీ ట్రక్కును ఢీకొట్టడంతో మరణించాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Ranjan, Amitav (21 September 2003). "Sahib Singh wanted to visit Serbia to meet fellow Jats". The Indian Express. Retrieved 11 May 2013.
  2. "Continuance of Delhi CM Sahib Singh Verma becomes matter of concern for BJP" (in ఇంగ్లీష్). India Today. 8 December 1997. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  3. "जाट नेता, गांवों में मजबूत पकड़ लेकिन प्याज की महंगाई ने छीन ली थी दिल्ली CM की कुर्सी...कहानी साहिब सिंह वर्मा की". आज तक. 24 December 2024. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  4. "LIST OF PROMINENT ALUMNI". Archived from the original on 2017-08-10.
  5. "Sahib Singh Verma cremated" (in ఇంగ్లీష్). Rediff. 2007. Retrieved 8 February 2025.
  6. "Sahib Singh Verma dies in road accident". Zee News. 30 June 2007. Retrieved 4 July 2007.