అక్షాంశ రేఖాంశాలు: 18°32′N 83°13′E / 18.53°N 83.22°E / 18.53; 83.22

సాలూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 18°32′N 83°13′E / 18.53°N 83.22°E / 18.53; 83.22
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపార్వతీపురం మన్యం జిల్లా
మండలంసాలూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం19.55 కి.మీ2 (7.55 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం49,500
 • జనసాంద్రత2,500/కి.మీ2 (6,600/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1061
ప్రాంతపు కోడ్+91 ( 8964 Edit this on Wikidata )
పిన్(PIN)535591 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

సాలూరు, (వినండి: //) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. నాగావళి ఉపనదైన వేగావతి ఒడ్డున చుట్టు కొండల మధ్యలో వుంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,05,389 - పురుషులు 51,107 - స్త్రీలు 54,282.

పరిపాలన

[మార్చు]

సాలూరు 1950 సంవత్సరం వరకు గ్రామ పంచాయితి. 26 సెప్టంబరు 1950 సంవత్సరంలో గ్రామ పంచాయితీ స్థాయి నుండి మూడవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని కల్పించారు. 1950 సంవత్సరంలో సాలూరు పురపాలక సంఘ పరిధి 13.58 మైళ్ళు. 2001 సంవత్సరంలో రెండవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని పొందిన తరువాత సాలూరు పురపాలక సంఘ పరిధి 19.55 మైళ్ళు.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా కేంద్రమైన పార్వతీపురం నుండి నైరుతి దిశలో 47 కి.మీ. దూరంలో ఈ ఊరున్నది. జాతీయ రహదారి 26 (భారతదేశం) ఈ పట్టణం గుండా పోతుంది. ఒడిశా రాష్ట్ర బస్సు సేవలున్నాయి. [2]

ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతమైన సాలూరు నుండి పర్యాటక ప్రాంతమైన అరకు వెళ్లేందుకు దగ్గర మార్గాలున్నాయి. మాతుమురు మీదుగా కొత్తగా వేస్తున్న మార్గంలో 54 కిలోమీటర్లు ప్రయాణము చేస్తే అరకు చేరుకోవచ్చు అలాగే ఒరిస్సా మీదుగా అరకు మార్గముకు సుంకి, రాళ్లగడ్డ మీదుగా 71 కిలోమీటర్లు దూరంలో చేరుకోవచ్చు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

పట్టణంలో 24 ప్రాథమిక పాఠశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు, 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. [ఆధారం చూపాలి]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

పట్టణంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, హోమియో ఆసుపత్రి, 5 ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, 30 మంది వైద్యులతో ఒక కమ్యూనిటి ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. [ఆధారం చూపాలి]

ఉత్పత్తులు

[మార్చు]

మల్లెపువ్వులు, గులాబీలు,వరి, చెరుకు, పొగాకు, అరటి

పరిశ్రమలు

[మార్చు]

అంతేకాక పట్టణంలో 13 రైస్ మిల్లులు, 2 రంపం మిల్లులు (వడ్రంగి పనికి చెక్క కోసే మిల్లు), 3 ఇంజనీరింగ్ వర్క షాప్ లు, 15 వాహనాల రిపైరు చేసే షెడ్స్, 8 లారీ బాడి బిల్డింగ్ కర్మాగారాలు ఉన్నాయి. [ఆధారం చూపాలి]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

ఈ ఊరిలో పురాతనమైన పంచముఖేశ్వర శివాలయం ఉంది. శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవత.

ఇక్కడకు దగ్గరలోనే శ్రీ శంబర పోలమాంబ దేవాలయం, పారమ్మకొండలాంటి పుణ్యతీర్దాలు ఉన్నాయి.సాలూరు చుట్టుపక్కల తొణాం, దండిగం, కూరుకుటి, దాలయువలస, కుంబిమడ, ఆలూరు, లోద్ద ప్రదేశాల వద్ద అందమైన జలపాతాలు ఉన్నాయి. పాచిపెంటడ్యాం, శంబరడ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు ఉన్నాయి.

ప్రముఖులు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. DHS (2022). District Handbook of Statistics -Parvathipuram Manyam (PDF). p. 20.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సాలూరు&oldid=3917571" నుండి వెలికితీశారు