Jump to content

సారథి (వారపత్రిక)

వికీపీడియా నుండి

సారథి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తరఫున వెలువడిన తెలుగు వారపత్రిక. హైదరాబాద్ రాష్ట్రానికి వెలుపల విజయవాడ నుండి టి.హయగ్రీవాచారి, బొమ్మకంటి సత్యనారాయణ రావుల నేతృత్వంలో ఈ పత్రిక నడిచింది. ఈ పత్రికకు తాళ్లూరి రామానుజస్వామి సంపాదకులుగా, డి.రామలింగం సహాయ సంపాదకులుగా పనిచేశారు. స్వాతంత్రోద్యమం తీవ్రతరంగా రూపుదాల్చుకున్న సమయంలో ఈ పత్రిక ప్రజలను సమాయత్తం చేసే బాధ్యతను నిర్వహించింది. ఈ పత్రిక స్టేట్ కాంగ్రెస్ నాయకుల ప్రకటనలతో పాటు నిజాం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమ విశేషాలను, నిజాం రాష్ట్రం నుండి యూనియన్ ప్రాంతాలకు వలస వచ్చిన ఉద్యమకారులు, ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ పరిష్కారాలకు ప్రయత్నించింది.[1] ఈ పత్రికను అయ్యదేవర కాళేశ్వరరావు ప్రారంభించాడు. ఈ పత్రిక ప్రథమ సంచికలో కడపటి పేజీలో మునగాల స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్ శిబిరంపై కమ్యూనిస్టు బాంబులు వేసిన సందర్భంలో క్షతగాత్రుల బొమ్మలు ప్రచురించింది. ఈ పత్రిక వెల 2 అణాలు.[2]

మూలాలు

[మార్చు]
  1. ఎం.జితేందర్ రెడ్డి (20 January 2025). "నిర్భందాలను దాటి... నిజాలను చాటి." ఈనాడు దినపత్రిక. Retrieved 25 February 2025.
  2. సంపాదకుడు (1 September 1948). "స్వీకారము - సారథి". గృహలక్ష్మి. 17 (7): 445. Retrieved 25 February 2025.