Jump to content

సాయి బాలాజీ

వికీపీడియా నుండి
సాయి బాలాజీ
జననం1974
మరణంఏప్రిల్ 26, 2021
వృత్తిసినీ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
జీవిత భాగస్వామిగౌరి
పిల్లలుస్నేహ పూజిత (కుమార్తె)

సాయి బాలాజీ తెలుగు సినిమా దర్శకుడు. శ్రీహరి నటించిన శివాజీ, ‘ఒరేయ్ తమ్ముడు చిత్రాలలకు, ఉదయ్ కిరణ్ నటించిన ‘జై శ్రీరామ్ (2013 సినిమా)’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[1]

జననం

[మార్చు]

సాయి బాలాజీ 1974లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, తిరుపతి దగ్గరలోని అలమేలు మంగాపురం గ్రామంలో జన్మించాడు.[2]

సినీ ప్రస్థానం

[మార్చు]

చెన్నైలో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నప్పుడే సాయిబాలాజీ సినీరంగానికి వచ్చి దర్శకుడు రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో చేరి ‘పెదరాయుడు’, ‘బంగారు బుల్లోడు’, ‘చంటి’ వంటి చిత్రాలకు పని చేశాడు. ఆయన అంజనా ప్రొడక్షన్స్ లో దర్శక, రచనా శాఖలో పనిచేశాడు. అంజనా ప్రొడక్షన్స్ లో చిరంజీవి నటించిన ‘బావగారూ బాగున్నారా?’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించాడు.[3]

ఆయన 2000లో శ్రీహరి హీరోగా నటించిన శివాజీ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించాడు. 2001లో ఒరేయ్ తమ్ముడు, 2013లో ఉదయ్ కిరణ్ చివరగా నటించిన జై శ్రీరామ్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[4] ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ లాంటి పలు టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహించాడు. ఆయన తెలుగు సినీదర్శకులు కృష్ణవంశీ, వై.వి.ఎస్.చౌదరి రూపొందించిన సినిమాలకు కథా విభాగంలో కీలకపాత్ర పోషించాడు.

మరణం

[మార్చు]

సాయిబాలాజీ హైదరాబాదు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్సపొందుతూ 2021, ఏప్రిల్ 26న మరణించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (26 April 2021). "టాలీవుడ్‌లో విషాదం: కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.
  2. V6 Velugu (26 April 2021). "కరోనాతో దర్శకుడు సాయిబాలాజీ హఠాన్మరణం". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Indian Express (26 April 2021). "Telugu director Sai Balaji dies due to Covid-19 complications". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.
  4. News18 Telugu (26 April 2021). "Director Sai Balaji: టాలీవుడ్‌లో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత." Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. 10TV (26 April 2021). "Sai Balaji : కరోనాతో దర్శకుడు సాయి బాలాజీ హఠాన్మరణం | Sai Balaji" (in telugu). Retrieved 28 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)