సాయికూమర్ పంపన
స్వరూపం
సాయికూమర్ పంపన తెలుగు సినిమా హాస్యనటుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతను 1990 నవంబరు 27న కేరళ లోని కొట్టరక్కరలో జన్మించాడు. సెయింట్ గ్రెగొరీస్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో విద్యనభ్యసించాడు. కేరళ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. తరువాత తెలంగాణ లోని హైదరాబాదులో స్థిరపడ్డాడు.
అతను 2012లో తెలుగు రొమాంటిక్ చలన చిత్రం ఈ రోజుల్లో ద్వారా తెలుగు చిత్రసీమలో తెరంగేట్రం చేసాడు. తరువాత బస్ స్టాప్, నా సామిరంగా, లవ్ టచ్, ఆడు మగాడ్రా బుజ్జీ సినిమాలలో నటించాడు. 2014లో విడుదలైన ప్రెసెంట్ లవ్, 2017 లోని మామ మంచు అల్లుడు కంచు, 2018లొ కన్నుల్లో నీ రూపమే చిత్రాలలోనటించాడు.[2]
అతను బిగ్ బాస్ తెలుగు 4 లో 13.09.2020 న వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించాడు.[3]
సినిమాలు
[మార్చు]తెలుగు సినిమాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Saikumar Pampana: బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ... ఆ కమెడియన్ వచ్చేశాడు". Samayam Telugu. Retrieved 2020-09-14.
- ↑ "Saikumar Pampana Bigg Boss Telugu 4 Contestant Wiki, Biography,". www.oracleglobe.com.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "Exclusive biography of #SaikumarPampana and on his life". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-09-14.